ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. గడివేముల మండలంలోని గని వద్ద ఏర్పాటు చేసిన సోలార్ పార్క్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు సైట్‌ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించనున్నారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఉపముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. పవన్ కల్యాణ్ పర్యటనను సజావుగా పూర్తి చేసేందుకు భద్రతా చర్యలు ముమ్మరం చేశారు. ప్రత్యేకంగా పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ సిబ్బందికి పటిష్ట భద్రతా చర్యలపై సూచనలు చేశారు. పవన్ కల్యాణ్ పర్యటన సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లా అధికార యంత్రాంగం పవన్ పర్యటన కోసం విస్తృత ఏర్పాట్లను పూర్తి చేసింది.

