Wednesday, September 23, 2026
26 C
Hyderabad

అంతా ‘పత్తి’త్తులే!?|COTTON|CCI|SCAM

సీసీఐ పత్తి కొనుగోల్ మాల్!
తప్పెవరిది? శిక్షలెవరికి?
మిల్లర్లు, అధికారుల అనుబంధమేంటి?
దళారుల ప్రమేయం నిజం కాదా?
మార్కెటింగ్ శాఖదే బాధ్యతా?
కేంద్రం ఎందుకు స్పందించదు?
వరంగల్ జేడీఎం సప్పెన్షన్!
7గురు మార్కెట్ కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు
84మంది మార్కెటింగ్ అధికారులకు నోటీసులు
సీసీఐ పత్తి అవినీతిపై ‘అడుగుగ్రౌండ్ రిపోర్ట్

దేశమంతటా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతి ఏటా పత్తి కొనుగోలు చేస్తోంది. ప్రతిసారీ సీసీఐ కొనుగోళ్ళ కంటే కూడా కొనుగోల్ మాల్ మీదే వివాదాలు ఎక్కువగా ముసురుకుంటున్నాయి. గతేడాది జరిగిన అవినీతిపై తాజాగా మార్కెటింగ్ శాఖ అధికారులకు నోటీసులివ్వడం ఒక ఉన్నతాధికారిని సస్పెండ్ చేయడం వాదాస్పదమే కాకుండా, చర్చనీయాంశంగా మారింది. అవినీతిలో అనేక మంది పాలు పంచుకున్నా, ఒక్క మార్కెటింగ్ శాఖ మీదే చర్యలెందుకు? మిగతా వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు? కేంద్ర సంస్థల వైఫల్యాలపై కేంద్రం ఎందుకు స్పందించదు? ఏటేటా దగా పడుతున్న రైతులు సంధిస్తున్న ప్రశ్నలెన్నో?

(అడుగు ప్రత్యేక ప్రతినిధి)

తెలంగాణలో భారత పత్తి సంస్థ పత్తి కొనుగోలులో తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్) పేరుతో జరిగిన అవినీతిలో బాధ్యులెవరు? సీసీఐ అధికారుల పాత్ర ఎంత? మార్కెటింగ్ శాఖ అధికారుల బాధ్యతెంత? మొత్తం అవినీతిలో ఒక్క మార్కెటింగ్ శాఖ అధికారులను మాత్రమే భాద్యులను చేయడం సబబేనా? అసలు అవినీతి ఎలా జరిగింది? ఎవరెవరి ప్రమేయం ఏ మేరకు?

గత ఏడాది సీసీఐ పత్తి కొనుగోలులో జరిగిన అక్రమాల వ్యవహారంలో 84 మంది మార్కెటింగ్ అధికారులకు నోటీసులు ఇచ్చారు. విచారణ పేరుతో ఏడుగురు మార్కెట్ కార్యదర్శులపై సస్పెన్షన్ వేటువేయగా, తాజాగా మార్కెటింగ్ శాఖ వరంగల్ జేడీఎంగా బాధ్యతలు నిర్వర్తించిన అధికారిని సస్పెన్షన్ చేయడం వివాదాస్పదంగానేగాక, చర్చనీయాంశంగా మారింది.

ఇదీ వెసలుబాటు
పట్టాదారు పాసు పుస్తకాలు లేని కౌలు రైతులు, పోడుభూములు చేసే రైతులకు సరైన పత్రాలు లేని కారణంగా ప్రభుత్వం తాత్కాలిక రిజిస్ట్రేషన్ వెసలుబాటు కల్పించింది. ఈ వెసలుబాటు ఆసరాగా దళారులతో కలిసి, మిల్లర్లు, అధికారులు అక్రమాలకు తెరలేపారు. ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేశారు. కొందరి పేర్లతో నేరుగా దళారులు, మిల్లర్లు, అధికారులు కలిసి దోచేశారు.

దందా సాగిందిలా?
తాత్కాలిక రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అధికారులంతా భాగవస్వాములే. ముందుగా వ్యవసాయ అధికారులు పత్తి రైతులను గుర్తిస్తూ, వారు సాగు చేసిన భూములు, పండిన పత్తికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. ఆ ధ్రువీకరణ పత్రాల్లో రాసిన ఒక ఎకరా పంటకు బదులు ఒకటి పక్కన సున్నా పెట్టి పది, అంతకు మించి 19 ఎకరాలు పత్తి పండినట్లుగా మిగతా అధికారులు, మిల్లర్లు కలిసి నమోదు చేశారు. ఆ మేరకు మిల్లర్ల పత్తినే తిరిగి మిల్లర్లకు పెడుతూ కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. ఆ అవినీతి సొమ్ముని తలా ఇంత పంచుకున్నారు.

మిల్లులే వేదికగా పత్తి కొనుగోలు
భారత పత్తి సంస్థ పత్తి కొనుగోలును వ్యవసాయ మార్కెట్లల్లో కాకుండా పత్తి మిల్లులే వేదికగా చేపట్టింది. తాత్కాలిక రిజిస్ట్రేషన్ విషయంలో రాష్ట్ర మార్కెటింగ్ శాఖ బాధ్యత తీసుకున్నా.. సీసీఐ కొనుగోలులో తప్పులు జరగడానికి ఒక్క మార్కెట్ అధికారులే కారణమా? పత్తి మిల్లర్లకు ఎలాంటి సంబంధం లేదా? పత్తి కొనుగోళ్లు పరిశీలించే సీసీఐ అధికారులకు బాధ్యత లేదా? అవినీతిలో రైతు సరుకుల విక్రయ దారులు, దళారుల ప్రమేయం లేదా? తప్పంతా మార్కెటింగ్ శాఖదేనా?

పత్తిపాపం తలా పిడికెడు
సీసీఐ కొనుగోలులో తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు.. పత్తి మిల్లర్లు, సీసీఐ అధికారులు, దళారులు, మార్కెట్ సిబ్బంది అవినీతి విషయంలో అందరి బాధ్యత ఉంది. కానీ తప్పులు అందరు చేస్తే మార్కెటింగ్ శాఖ అధికారులకు మాత్రమే శిక్ష వేయడం ఎంతవరకు సమంజసం అని సీసీఐ కొనుగోలు మాల్ తో పరిచయం ఉన్న వారు ప్రశ్నిస్తున్నారు.

పత్తి పాపాన్ని పంచుకున్నారు
సీసీఐ కొనుగోలులో పెద్ద మొత్తంలో అక్రమాలు జరిగాయి అనేది నిజం. పత్తి మిల్లర్లు, సీసీఐ, మార్కెట్ అధికారులు అందరూ ఏకమై పత్తి కొనుగోలులో పెద్ద మొత్తం దోపిడీ చేశారు. కానీ, మార్కెటింగ్ శాఖ పెద్దలు మాత్రం జేడియం తో పాటు ఏడుగురు మార్కెట్ కార్యదర్శులను సస్పెన్షన్ చేసింది. ఇందులో కొందరు రాజకీయ నాయకులకు సైతం డబ్బులు అందాయి. చివరికి రైతు సంఘ నాయకులకు.. మీడియా మిత్రులకు డబ్బులు ఇచ్చి మరీ, సీసీఐ పత్తి కొనుగోలు అవినీతి బయటికి పొక్కకుండా నోర్లు మూయించారు.

బాధ్యులపై కేసులేవి?
సీసీఐలో జరిగిన అవినీతి విషయంలో కేవలం మార్కెటింగ్ శాఖ ఉద్యోగులపై వేటు వేసి చేతులు దులుపుకోకుండా అవినీతిలో భాగం పంచుకున్న పత్తి మిల్లర్లు సీసీఐ అధికారులు, రైతు సరుకుల విక్రయదారులు, దళారులు, మార్కెటింగ్ సిబ్బంది, దడ్వాయిలు అందరిపై కేసు నమోదు చేయాలి. తప్పు చేసిన వారిని జైల్లో వేసి శిక్షించాలి.

Latest News

గా ఊర్ల పేమ పెండ్లిల్లు నిషేధం!?|ADUGU TRENDS

ఇగీ మద్దెల ఏడ సూసినా, లవ్వు మ్యారేజీలు, లివింగ్ టుగెదర్లేనాయె! గియి ఊర్లు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటి దేశాలు, ఖండాంతరాలకు విస్తరించినయి. ఇగ కులం లేదు, మతం లేదు. ఇల0 లేదు....

యూపీ విభజన ప్రతిపాదనా? రాజకీయ వ్యూహమా?|EDITORIAL

దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై చర్చ జరగడం సహజమే. కానీ ఇలాంటి నిర్ణయాలు ప్రజల దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. యూపీ విభజనపై రాజ్‌భర్‌ చేసిన ప్రకటన అధికారిక విధానంగా మారుతుందా?...

సెప్టెంబర్ 23, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ద్వాదశి రాత్రి 08.43 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శ్రవణ ఉదయం 08.18 వరకు ఉపరి ధనిష్ఠ యోగం సుకర్మ సాయంత్రం 04.50 వరకు ఉపరి ధృతి కరణం బవ ఉదయం 08.03...

పుతిన్ తిరుగులేని నేతేనా!?|EDITORIAL

పుతిన్ రాజకీయ పట్టు బలపడినప్పటికీ, ప్రతిపక్ష స్వేచ్ఛ, ఎన్నికల పారదర్శకత, యుద్ధానికి ముగింపు వంటి అంశాలపై రష్యా ఎదుర్కొంటున్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ ఆధిపత్యాన్ని కేవలం సీట్ల సంఖ్యతో...

బంగారం కొనే ముందు గీ మూడు సూడాలే!|ADUGU TRENDS

మనం బంగారం, నగలు ఏడ కొంటం? ఔసలోల్ల దగ్గర, బంగారం దుకాణాల్ల కొంటం .పెద్దపెద్ద దుకాణాలకు కూడా పోయేటోల్లు ఉంటరు. కానీ, గీ మూడు ముఖ్యమైన ముచ్చట్లు పట్టించుకోం. కానీ మన సర్కార్...

సెప్టెంబర్ 22, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ఏకాదశి రాత్రి 07.23 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.14 వరకు ఉపరి శ్రవణ యోగం అతిగండ సాయంత్రం 04.49 వరకు ఉపరి సుకర్మ కరణం వణజి ఉదయం 06.34...

సెప్టెంబర్ 21, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు దశమి సాయంత్రం 05.43 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా ఉంది యోగం శోభ సాయంత్రం 04.30 వరకు ఉపరి అతిగండ కరణం గరజి సాయంత్రం 05.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News