న్యూడ్ వీడియోల కేసులో ఇప్పటికే అరెస్టయిన మస్తాన్ సాయి మరో వివాదంలో చిక్కుకున్నాడు. తాజా డ్రగ్స్ టెస్ట్‌లో ఆయనకు పాజిటివ్ రావడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. మస్తాన్ సాయితో పాటు అరెస్టైన కాజా కూడా డ్రగ్ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలినట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఇద్దరిపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి, పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, మస్తాన్ సాయి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. యువతులను టార్గెట్ చేసి వారి ప్రైవేట్ వీడియోలు రికార్డ్ చేయడమే కాకుండా, మెడకు ఉరి తాడు బిగించుకుని బ్లాక్‌మెయిల్ చేసిన ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవ్వడంతో, ప్రజలు షాక్‌కు గురవుతున్నారు.

