ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన జనవరి 4న సాయంత్రం 4 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగనుంది. రైతు భరోసా, భూమిలేని పేదలకు నగదు సహాయం, కొత్త రేషన్ కార్డులపై కీలక చర్చలు జరగనున్నాయి. సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమచేయనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమంపై నిర్ణయం తీసుకోనున్నారు. రేషన్ కార్డుల దరఖాస్తుల ప్రక్రియ, ఆదాయ పరిమితిపై నిర్ణయం తీసుకోవడంతో పాటు ఇళ్ల నిర్మాణానికి సబ్సిడీ రేట్లతో ఇసుక, సిమెంట్ సరఫరా ప్రతిపాదనను కేబినెట్ చర్చించనుంది. యాదగిరిగుట్ట ఆలయానికి ప్రత్యేక పాలక మండలి ఏర్పాటు, విద్యుత్ కమిషన్ నివేదికలు, టూరిజం పాలసీపై కూడా సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.

