వయసు మీద పడిందనుకోండ్రి. నడక కట్టమే. కూసునుడు కూడా ఇంకా కట్టం. మూడో కాలనే శేతి కర్రో.. ఇంకేదో ఒకటి ఊతంగా ఉండాల్సిందే. గట్లనే శేతకాకపోతే కూసోనికి ఏదో ఒక ఉచితాసనం ఉండాల్సిందే. గీ రెండుంటిని యేర్వేరుగా పట్టుకుపోవాల్నంటే శేతకానోల్లకు మరింత అలవిగాని ముచ్చటే కదా? మరి గీ రెండు ఒకటేదాంట్ల ఉంటే? గీ ఆలోశనే…గిదన్నట్లు.

గిదీన్ని మల్టీ పర్పస్ వాకర్ అంటరు. కొద్దోగొప్పో శేతనైనప్పుడు గ దాన్ని ఊతంగా పట్టుకొని నడవొచ్చు. గదే ఆయాసమొచ్చిందనుకోండ్రి. గదాని మీదనే కూసోవచ్చు. ఇగ గదాన్ని మడిసి, కార్లనో, రిచ్చాల్నో, ఆటోల్నో పెట్టి సక్కగా ఇంటికి పోవచ్చు. మస్తుగుంది కదా ఈ ఐవుడియా.!?

