Monday, August 3, 2026
31.5 C
Hyderabad

ఓట్ చోర్ ఎవరు? పార్టీలా!? ప్రజలా!?|EDITORIAL

‘ఓట్ చోరీ’తో ఇండియా కూటమికి సంబంధం లేదని ఆ కూటమిలో భాగస్వామి నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సంచలనం చేశారు. ఇదే అంశంపై కాంగ్రెస్ ఢిల్లీలో ‘ఓట్ చోర్ గద్దీ చోడ్’ బహిరంగసభ నిర్వహించిన తెల్లారే ఆయన స్పందించిడం గమనార్హం. ‘ప్రతి పార్టీకి తన సొంత ఎజెండాను నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంది. ఓట్ చోరీ, సర్ లను తమ ప్రధాన పోరాటంగా కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ఏం చేయలో మనం వాళ్ళకు చెప్పలేం కదా?’ అన్నారు. అంతకుముందు ఇండియా కూటమి పరిస్థితి వెంటిలేటర్ పై ఉన్నట్లుందని కూడా వ్యాఖ్యానించారు. ఒమర్ వ్యాఖ్యలను బట్టి, ఓట్ చోరీ జరుగుతోందా? జరిగితే ఎవరా ఓట్ చోర్ లు? పార్టీలా? ప్రజలా?

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రజల సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రజలుఆశలకు, ఆశయాలకు సంకేతాంగా నిలుస్తుంది. అయితే, భారత రాజకీయాల్లో తరచూ వినిపించే మాట.‘ఓట్ల దొంగతనం’, ‘ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది’, ‘అధికార పార్టీయే ఓట్ల దొంగ’. ఈ ఆరోపణలు అన్ని జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలపైనా ఉన్నాయి. అసలు ప్రశ్న ఏమిటంటే, నిజంగా ఓట్ల దొంగ ఎవరు?
‘ఓట్ చోరీ’ అంటే కేవలం ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడమే కాదు. డబ్బు, మద్యం, కులం, మతం, అధికార దుర్వినియోగం, మీడియా ప్రభావం, అలవికాని హామీలన్నీ ఓటు స్వేచ్ఛను దెబ్బతీసే పద్ధతులే. ఓట్ చోరీ సాంకేతిక సమస్య మాత్రమే కాక, నైతిక వైఫల్యం కూడా.

దేశంలో కాంగ్రెస్ దీర్ఘకాలంగా అధికారంలో ఉంది. అది వ్యవస్థలను తనకు అనుకూలంగా ఉపయోగించుకున్న సందర్భాలూ ఉన్నాయి. ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్య హక్కుల్ని అణచివేయడం, అధికార యంత్రాంగాన్ని తమ పార్టీ ప్రయోజనాలకు వాడుకోవడం వంటి విమర్శలు కాంగ్రెస్‌పై బలంగా ఉన్నాయి. రాష్ట్రాల్లో డబ్బు రాజకీయాలు, కుటుంబ పాలన, స్థానిక నాయకుల అక్రమాలు కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బతీశాయి. ఇవి పరోక్ష “ఓట్ చోర్” పద్ధతులే.

బీజేపీపై కూడా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. మత విద్వేషాలు, జాతీయత పేరుతో ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడం, మీడియా మీద ప్రభావం, ప్రభుత్వ సంస్థల స్వతంత్రతను తగ్గించడం వంటి అంశాలు బీజేపీని విమర్శలకు గురిచేశాయి. ప్రతిపక్ష పార్టీలను, నేతలను విచారణ సంస్థల ద్వారా భయపెట్టడం, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, ప్రభుత్వాలను కూల్చడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమైన చర్యలు. ఇవన్నీ ప్రత్యక్ష ఓట్ చోరీ కాకపోయినా, ప్రజల స్వేచ్ఛాయుత నిర్ణయాలని ప్రభావితం చేసే పద్ధతులే.

ప్రాంతీయ పార్టీలు కూడా ఈ జాబితాలేకే వస్తాయి. డీఎంకే, ఏఐఏడీఎంకే, బీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ, సమాజ్‌వాది, బీఎస్పీ వంటి పార్టీలు కూడా డబ్బు, కులం, మతం, ప్రాంతీయ, ప్రలోభాల భావోద్వేగాలపై రాజకీయాలను నెరుపుతున్నవే. “మనోడే గెలవాలి” అనే భావన ప్రజాస్వామ్యాన్ని కుటుంబ లేదా కుల రాజకీయం వైపు నడిపింది. ఇక్కడ ఓటు ప్రజల స్వేచ్ఛా అభిప్రాయానికి కాకుండా సామాజిక రాజకీయ ఒత్తిడికి లోనవుతున్నది.

ప్రత్యక్ష, పరోక్ష ‘ఓట్ చోరీ’లో రాజకీయ పార్టీలతో పాటు ఓటరు పాత్రను విస్మరించలేం. డబ్బు తీసుకుని ఓటేయడం, కులం లేదా మతం పేరుతో ఓటేయడం, భవిష్యత్ అభివృద్ధి కంటే తక్షణ స్వలాభాలకే ప్రాధాన్యం ఇవ్వడం, ప్రలోభాలకు లోనవడం ద్వారా ఓటరే తన ఓటును తానే అమ్ముకుంటున్నాడు.
మీడియా కూడా ఈ పాపంలో భాగమే. పార్టీకో పత్రిక, పత్రికకో పార్టీ ఉండటం, ఒక పార్టీకి అనుకూలంగా, మరో పార్టీని నిరంతరం దూషించడం ద్వారా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేస్తోంది. ఇది కనిపించని ఓట్ చోరీ. సోషల్ మీడియా ద్వారా అబద్ధాలు, అసత్యాలు ప్రచారమై ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నాయి.
ఓట్ చోరీ ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవస్థీక్రుతంగా విస్తరించిన విషం. పార్టీలను, ప్రజలను కూడా దోషులుగా పరగణించాల్సందే. ఇది మన రాజకీయ సంస్కృతిలో ఉన్న లోపం. ఆ లోపాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలతోపాటు, ప్రతి పౌరుడిది కూడా. ఓటరు చైతన్యం, స్వతంత్ర సంస్థల బలోపేతం, పారదర్శక ఎన్నికల ప్రక్రియ, బాధ్యతాయుత మీడియా కలిసి పనిచేసినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం నిలుస్తుంది.

Latest News

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా భోగాపురం!?|EDITORIAL

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక కొత్త అవకాశాన్ని తెరిచింది. ఈ అవకాశాన్ని స్థిరమైన అభివృద్ధిగా మలచడం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్థానిక ప్రజల సమిష్టి కృషిపైనే ఆధారపడి ఉంటుంది. మౌలిక వసతుల...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 02 నుండి ఆగస్టు 08 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో...

యిధి యిసిత్రమైందంటే గిదే మరి!?|ADUGU TRENDS

యిధి శాల యిసిత్రమైంది. ఒకపాలి కలిసున్నోల్లను సిడెంల యిడదీత్తది. యిడిపోయినోల్లని శిటికెల కలిపేత్తది. గసొంటిదే గీ ముచ్చట. గదేందో సూద్దాం పాండ్రి. తమిళనాడు రాస్ట్రం విరుదు నగర్ జిల్లా తిరుచూలి పూమాలై పట్టీకి శెందిన...

పోలీసింగ్ పై పార్లమెంటులో సమీక్షేది!?|EDITORIAL

పార్లమెంట్ వరుసగా వాయిదాలు పడుతూ స్తంభిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రతిష్ఠంభనల వల్ల ఉభయ సభల్లో కీలక అంశాలపై అసలు చర్చే జరగడం లేదు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కూడా అత్యవసరం....

ఆగస్టు 01, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 09.20 వరకు ఉపరి చవితి నక్షత్రం శతభిషం రాత్రి 08.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శోభ రాత్రి 11.43 వరకు ఉపరి అతిగండ కరణం వణజి ఉదయం 09.10...

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమవుతోందా!?|EDITORIAL

ప్రతిపక్షం బలహీనంగా ఉంటే ప్రజాస్వామ్యం కూడా బలహీనపడుతుంది. అధికార పక్షం తప్పులను ఎత్తిచూపే శక్తి లేకపోతే ప్రభుత్వ జవాబుదారీతనం తగ్గుతుంది. అందుకే, కాంగ్రెస్ బలపడటం కేవలం ఆ పార్టీ అవసరం మాత్రమే కాదు....

జూలై 31, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ విదియ రాత్రి 09.03 వరకు ఉపరి తదియ నక్షత్రం ధనిష్ఠ రాత్రి 07.09 వరకు ఉపరి శతభిషం యోగం సౌభాగ్య రాత్రి 12.33 వరకు ఉపరి శోభ కరణం తైతుల ఉదయం 08.40...

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News