మే 1 నుండి అమలు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వేసవి సెలవుల రద్దీని దృష్టిలో పెట్టుకొని కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుండి జూలై 15 వరకు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రముఖుల సిఫారసుల ఆధారంగా జారీ చేసే విఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయనుంది. ఇకపై ఈ కాలంలో స్వయంగా హాజరయ్యే ప్రోటోకాల్ విఐపీలకే బ్రేక్ దర్శన సదుపాయం కల్పించనున్నారు. వేసవి సెలవులు ప్రారంభం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. దీనితో సామాన్య భక్తులకు దర్శనాల్లో అవాంతరాలు లేకుండా చూడటానికి ఈ చర్య తీసుకున్నట్లు టీటీడీ ప్రకటించింది. మే 1వ తేదీ నుంచి ఉదయం 6 గంటలకు విఐపీ బ్రేక్ దర్శనాలను ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు. సాధారణ భక్తులకు మరింత సమర్ధవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా టీటీడీ ఈ కొత్త విధానాన్ని అమలు చేయనుంది.

