ఒక్కొక్కలు ఒక్కో రకం. ఒక్కొక్కలిది ఒక్కో టేస్టు. ఎవ్వలిట్టం వాల్లది. గా హైదరాబాద్ పట్నంల ఫిష్ హౌజ్, రెడ్ బిల్డింగ్ వంటి ల్యాండ్ మార్క్ లను సూసినం. శేప ఆకారంలనే గా సర్కార్ శేపల ఆపీసును కట్టింది కూడా మనకు తెలుసు. కనీ, గీ కార్ బిల్డింగును ఎక్కడన్నా సూసినమా ఏంది?

ఒగన్న గా కారు అంటే పడి సత్తడు. ఇగ గా కారుతోటే తనకు తగిన గుర్తింపు రావాల్నని ఓ ఉపాయం శేసిండు. ఏకంగా గా కారు బొమ్మనే ఆయన ఇంటి మీద పెట్టకున్నడు. గదానికి నెంబర్ ప్లేట్ తో సహా గా బొమ్మల గీపిచ్చిండు. ఇగ గా ఊల్లెకు పోయినోల్లు గదాన్ని సూసి ఇచ్చెంత్ర పోతాండ్లు. గదాన్ని కార్ బల్డింగని పిలుస్తాండ్లు. జిహ్వ కో రుసి, పుర్రె కో బుద్ధి అంటే గిదేనుల్లా…

