Tuesday, October 13, 2026
27.1 C
Hyderabad

మాటలు సరే, చేతలేవి?|EDITORIAL

తెలంగాణ రాజకీయాలు ప్రజల అవసరాలు, రాష్ట్ర లక్ష్యాలకన్నా, అధికార లాలసకే పాకులాడుతున్నాయి. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు.. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రజల సమస్యల పరిష్కారానికి కాకుండా స్వలాభం కోసం పరస్పర విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలకే పరిమితమవుతున్నాయి. ప్రజలకు మేలు చేయాల్సిన రాజకీయ వ్యవస్థ, అదే ప్రజలను తమ రాజకీయ క్రీడలో పావులుగా మార్చే నీచ స్థాయికి దిగజారిందన్న భావన బలపడుతోంది.

బీఆర్‌ఎస్‌ పాలన ముగిసి రెండేళ్లు దాటుతున్నా, అప్పటి అవినీతి ఆరోపణలపై విచారణలేమీ తేల్చకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కాళేశ్వరం నుంచి కూకట్ పల్లి భూకబ్జాల వరకు, అక్రమ లావాదేవీలు వంటి తీవ్రమైన అంశాలు ప్రజల చర్చలో ఉన్నప్పటికీ, వాటిపై స్పష్టమైన చర్యలు లేకపోవడం ప్రభుత్వ వైఫల్యాన్ని సూచిస్తోంది. విచారణల పేరుతో కాలయాపన చేయడం తప్ప, అవినీతి రుజువై, న్యాయం గెలిచిందన్న భావన ఎక్కడా కనిపించడం లేదు. పదేపదే బీజేపీ ఆరోపిస్తున్నట్లు ఆ రెండు పార్టీల మధ్య అంతర్గత అవగాహనేమైనా ఉందా? అన్న అనుమానాలు బలపడుతున్నాయి.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరలేదన్నది విస్తృతంగా వినిపిస్తున్న మరో అంశం. ‘బంగారు తెలంగాణ’ నినాదం, చివరకు ‘బాకీల తెలంగాణ’గా మారిపోయింది. అభివృద్ధి పేరుతో చేసిన అప్పులు, అవి ఖర్చైన తీరుకు ఏలికలెవరూ బాధ్యత వహించడంలేదు. ఒక ప్రభుత్వం గత ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపడానికి, గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శంచడానికే పరిమితమవుతే, ప్రజలకు ఒరిగేదేంటి? కేవలం నిరాశ తప్ప.

ఇక బీజేపీ కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై దుమ్మెత్తిపోస్తోంది. సరే, కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ రాష్ట్ర పురోగతికి చేస్తోందేంటి? నిర్దిష్టంగా రాష్ట్రాభివృద్ధికి చేసిందేంటన్నది ఆ పార్టీ పనితీరుకు కొలమానం కానుంది. తెలంగాణలో అధికారం కోసం ఆరాటపడుతున్న బీజేపీకి పోరాటమే లేదు.

ఇక బీఆర్‌ఎస్‌ అంతర్గత రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కేసిఆర్‌ కుమార్తె కవిత, ఆపార్టీ నేతలపై చేస్తున్న అవినీతి ఆరోపణలు సంచలనంగా ఉన్నాయి. కాళేశ్వరం నుంచి కూకట్‌పల్లి భూకబ్జాల వరకు ఆమె ఎత్తి చూపుతున్న అంశాలు బీఆర్‌ఎస్‌ పాలనలోని అవినీతి, బంధుప్రీతి, లోపాలను తిరిగి చర్చల్లోకి తెస్తున్నాయి. అయితే కవిత, తాను ‘కడిగిన ముత్యాన్న’ని నిరూపించుకునే ప్రయత్నం ప్రజల్లో నమ్మకాన్ని కలిగించలేకపోతోంది. లిక్కర్‌ స్కామ్‌ కేసు కవిత రాజకీయ భవిష్యత్తుపై మాయని మచ్చగా మిగిలింది. కన్నవారిల్లు కాదన్న ఈ సమయంలో రాజకీయ మార్గమే ఏకైక దారిగా ఆమె ఎంచుకున్నట్లుంది. కవిత ఆరోపణలు బీఆర్‌ఎస్‌ను మరింత బలహీనపరుస్తుండగా, కాంగ్రెస్‌కు అనుకోని లాభంగా కలిసివస్తోంది.
ఇదే తరుణంలో వారసత్వ రాజకీయాలు తెరమీదకు వస్తున్నాయి. తెలంగాణ సహా, దేశవ్యాప్తంగా వారసత్వ రాజకీయాలు అన్ని పార్టీల్లోనూ కొనసాగుతున్నాయి. ఒకే కుటుంబం, ఒకే కుల ప్రాబల్యంతో పాలన సాగితే, ఆ పార్టీకి, ఆ కులానికే నష్టం కలిగిస్తుందనడానికి బీఆర్‌ఎస్‌ ఉదాహరణగా నిలిచింది.

ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా ఈ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం బీఆర్‌ఎస్‌ వైఫల్యాలను ఎత్తిచూపడమే కాకుండా, పాలనలో స్పష్టత, పారదర్శకత, ప్రజల నమ్మకం పెంచే చర్యలు చేపట్టాలి. అప్పులపై శ్వేతపత్రం, అవినీతి ఆరోపణలను కాలపరిమితితో తేల్చే విచారణలు, అభివృద్ధి ప్రాధాన్యతలపై స్పష్టమైన దిశానిర్దేశం వంటివి ప్రజలు ఆశిస్తున్న కనీస చర్యలు.
రాజకీయాలు కేవలం అధికారం, నాయకుల కోసమే కాదు, ప్రజల కోసం కూడా. ప్రజలు ఎన్నో పోరాటాలు చేసి, అనేక త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని స్వార్థ రాజకీయాలకు బలి చేయడాన్ని చరిత్ర క్షమించదు. ప్రజలు కూడా వదలరు. ఈ తరహా రాజకీయాలకు చెక్ పెట్టాలంటే ప్రజలే చైతన్యవంతులవ్వాలి. ప్రశ్నించాలి. బాధ్యత కోరాలి. అవసరమైతే అలాంటి రాజకీయ పార్టీలను, నాయకులను తిరస్కరించాలి. ప్రజాస్వామ్యంలో నిజమైన శక్తి ప్రజలే.

Latest News

అక్టోబర్ 12, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజ మాసం శుక్లపక్షం శ్రీ గాయత్రి దేవి తిధి విదియ రాత్రి 08.41 వరకు ఉపరి తదియ నక్షత్రం స్వాతి రాత్రి 11.40 వరకు ఉపరి విశాఖ యోగం విస్కంబ రాత్రి 09.21 వరకు ఉపరి ప్రీతి కరణం బాలవ...

బతుకమ్మ పాట విడుదల|BATHUKAMMA|SONG|KALVAKUNTLA KAVITHA

హైదరాబాద్, నందీనగర్‌లో తెలంగాణ రక్షణ సమితి పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ‘సిరిసిరి మువ్వల సిరుల బతుకమ్మ’ పాట సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు...

గుప్తానంతర యుగం (క్రీ.శ.550-750)|HISTORY|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL

క్రీ.శ. ఆరవ శతాబ్దం మధ్యభాగంలో గుప్త సామ్రాజ్యం అంతమై మరోసారి భారత చరిత్రలో రాజకీయ అనైక్యత చోటుచేసుకుంది. దీనిని ఆసరాగా చేసుకొని కొన్ని స్వతంత్ర రాజ్యాలు భారతదేశంలో వెలిశాయి. అవి పుష్యభూతి రాజ్యం,...

సిల్లరతోనే స్కూటర్ కొన్నడు!?|ADUGU TRENDS

సిల్లరని సిల్లరగా సూత్తం. ‘సిల్లరగా!’ అని సిల్లరగ తిడ్తం. గా సిల్లరనే సిల్లరగ సూసే రోజులు పోయినయి. గా సిల్లరే పదులు, ఎయ్యిలు, లచ్చలు, కోట్లు అయితయి. గందుకే ఒక్కొక్కటి నూటొక్కటి అయితయి...

ప్రజా తీర్పు పాలనలో ప్రతిబింబించాలి!|EDITORIAL

బెంగాల్‌లో బీజేపీ విజయాలు, తమిళనాడులో విజయ్ పార్టీ పురోగతి, పుదుచ్చేరిలో అధికార కూటమి గెలుపు ఆయా పార్టీలకు రాజకీయ ఊపునిచ్చాయి. కానీ ప్రజాభిమానాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోవాలంటే గెలుపు గర్వాన్ని కాకుండా బాధ్యతను పెంచాలి....

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

అక్టోబర్ 11 నుండి అక్టోబర్ 18 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం ఉద్యోగ రంగంలో కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం మంచిది. వ్యాపారంలో కొత్త...

గది ఇల్లా? ఇంగ్లీష్ పుత్తకమా!?|ADUGU TRENDS

యెన్కటికి యిద్దె అంటే గురువు. గురువు శెప్పిందే యిని నేర్సుకునేది. సూపింది సూసి, సేసి తర్పీదు పొందేది. ఇగ తర్వాత్తర్వాత గది పాయే, సారు శెప్పే సదువు కానించి, సారు లేకుండనే సదువుకునే...

ఎల్ నినో.. జల సంరక్షణకు మేల్కొలుపు!?|EDITORIAL

ఎల్‌నినో ప్రభావాన్ని పూర్తిగా నివారించడం మన చేతుల్లో లేకపోయినా, దాని వల్ల కలిగే నష్టాలను తగ్గించుకోవడం మాత్రం సాధ్యమే. వాతావరణ హెచ్చరికలకు అనుగుణంగా వ్యవసాయ ప్రణాళికలు రూపొందించడం, తాగునీటి నిల్వలను పెంచడం, చెరువులు,...

అక్టోబర్ 10, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం మహాలయ అమావాస్య బతుకమ్మ పండుగ తిధి అమావాస్య రాత్రి 08.10 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం హస్త రాత్రి 09.45 వరకు ఉపరి చిత్త యోగం ఐంద్ర రాత్రి 11.06 వరకు ఉపరి వైధృతి కరణం చతుష్పాద ఉదయం...

బాబోయ్…! గిదేం థాలీ!?|ADUGU TRENDS

జివ్వకో రుసి, పుర్రెకో బుద్ధి అన్నరు. నాలుక రకరకాల రుసులను కావాలంటది. బుద్ధి కూడా గట్లనే రకరకాల ఆలోశనలు సేత్తది. గట్ల గా ఆలోశలన నుంచి కొత్త రుసులను అందించే, సరికొత్త ఆలోశనే...

నేడే నోబెల్ ప్రకటన…దక్కేదెవరికో!?|EDITORIAL

ప్రపంచ శాంతికి, అంతర్జాతీయ సహకారానికి, సంఘర్షణల పరిష్కారానికి విశేషంగా దోహదపడిన వ్యక్తి లేదా సంస్థను నోబెల్ గుర్తిస్తుంది. కమిటీ నిర్ణయం కేవలం ఒక వ్యక్తి ప్రచారం, రాజకీయ ప్రభావం లేదా నామినేషన్ల సంఖ్య...

అక్టోబర్ 09, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తిధి చతుర్దశి రాత్రి 08.40 వరకు ఉపరి అమావాస్య నక్షత్రం ఉత్తర రాత్రి 09.35 వరకు ఉపరి హస్త యోగం బ్రహ్మ రాత్రి 12.34 వరకు ఉపరి ఐంద్ర కరణం భద్ర ఉదయం 09.12 వరకు ఉపరి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News