Sunday, September 13, 2026
26.2 C
Hyderabad

ఇదేం ఏలు “బడి”!?

నైట్ వాచ్ మన్ లేరు

స్వీపర్లు ఊడ్చేయరు!

పంతుళ్ళు పట్టించుకోరు?

2 ఏండ్ల కిందే గేట్లు తీసేశారు!

పెట్టిన 2 నెలలకే డిగ్రీ కాలేజీని ఎత్తేశారు!

నాంచారి మడూరుకు మార్చేశారు!

ఖాళీగా గ్రౌండ్ లో కట్టిన కొత్త భవనాలు

గ్రౌండ్ లో లేని సీసీ కెమెరాలు

బడినే బార్ గా మార్చిన మందుబాబులు!

ఆకతాయిలకు అడ్డాగా బడి

మాతృ దేవోభవ! పితృ దేవోభవ!!ఆచార్య దేవోభవ!!! గురువు ఉండే చోటు బడి. బడి గుడితో సమానం. కానీ, బడిగుడి ఏలుబడి లయ తప్పుతోంది. ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపుల్లో మిగతాతో పోలిస్తే, బడి వాటా అతి తక్కువే! “మన ఊరు – మన బడి”, *అమ్మ ఆదర్శ పాఠశాల” వంటి పథకాలెన్ని పెట్టినా, బడి బర్ బాత్ అవుతున్నది. 75 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా కనీస వసతులు కరువైన సదువు సట్టు బండలు అవుతూనే ఉన్నది. ఇప్పటికైనా బడుల సమీక్ష జరగాలి. సదుపాయాలు, సౌకర్యాలు, విద్యార్థులు, టీచర్లు, స్విపర్లు, మొత్తం స్టాఫ్ రేషనలైజేషన్ వంటివి జరగాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఈ తరుణంలో… బడి, తడబడిన పరిస్థితికి పాలకుర్తి జిల్లా పరిషత్ హై స్కూల్ ఒక ఉదాహరణగా పేర్కొనవచ్చు. చారిత్రాత్మకమైన గుడిలాంటి పాలకుర్తి బడి బందెల దొడ్డిలా మారింది. ఆకతాయిలకు అడ్డా అయింది. మందుబాబులకు మజా చేసుకునే కేంద్రమైంది. అడ్డు అదుపులేని విచ్చలవిడి అసాంఘిక కార్యక్రమాలకు అందివచ్చినట్లయింది. ఈ పరిస్థితి ఇప్పటికిప్పుడు ఈ ఒక్క ప్రజా పాలనతోనే రాకపోవచ్చు. గత పాలకుల పాపాల ఫలితం కూడా కావచ్చు. కానీ, ఇది మచ్చుకు ఒకటి మాత్రమే. ఇలాంటి బడులు అనేకం రాష్ట్రంలో ఉన్నాయి.

అది చారిత్రక బడి. 50 ఏండ్ల నుంచీ ఆ బడి నుండి వేలాది మంది విద్యార్థులు చదువుకున్నారు. ఎంతో మంది ఉన్నత చదువులు చదివారు. అనేక మంది అత్యున్నత పదవులను అధిరోహించి శిఖరాలకు చేరారు. గతమెంతో ఘనకీర్తి. ఉజ్వల భవిష్యత్తు. కానీ వర్తమానమే అత్యంత దారుణంగా మారింది. ఇప్పుడు సదువు కంటే సదుపాయాలే సమస్యగా మారాయి. బడిలో పిల్లలకు టాయిలెట్స్ లేవు. భవనాల సముదాయాలకి గేట్లు లేవు. నైట్ వాచ్ మన్ లేరు. మొన్నటి దాకా స్వీపర్లు లేరు. గ్రామ పంచాయతీ సపాయీ వర్కర్లే ఊడ్చేసేవారు. ఇప్పుడు ఉన్నా స్వీపర్లు పరిశుభ్రంగా ఊడ్చేయరు. వచ్చామా? చెప్పామా? వెళ్ళామా? తప్ప పంతుళ్ళు పెద్దగా పట్టించుకోరు. దీంతో గుడిలాంటి బడి బందెల దొడ్డిలా మారింది. ఇదే అదనుగా బడిని ఆకతాయిలు అడ్డాగా మార్చుకున్నారు. బడిని కాస్తా బార్ లా మార్చుకున్నారు. ఎక్కడ పడితే అక్కడ అనువైన చోటల్లా దర్జాగా కూర్చుని బీర్లు లాగేస్తున్నారు. వైన్ ను గుంజేస్తున్నారు. చెత్తా చెదారాన్ని చెల్లా చెదురుగా వేసేస్తున్నారు.

2 ఏండ్ల కిందే గేట్లు తీసేశారు


బడిని అభివృద్ధి చేస్తామని, కొత్త భవనాలు కట్టిస్తామని చెప్పి, కాంట్రాక్టర్ల అవతారమెత్తిన నాయకులు గేట్లు తీసేశారు. ఈ లోగా ఎన్నికలు రావడంతో వదిలేశారు. ప్రభుత్వమే మారింది. పలుకుబడి పోయింది. ఇక బడితో పనేంటని పట్టించుకోవడం మానేశారు. అసలు గేట్లే లేకపోవడంతో యథేచ్ఛగా పందులు, కుక్కలు, మనుషులు, మందుబాబులకు ఇష్టారాజ్యంగా మారింది.

పెట్టిన 2 నెలలకే డిగ్రీ కాలేజీని ఎత్తేశారు


ఇదే పాలకుర్తి బడి గ్రౌండ్ ఆవరణలో ఇంటర్ కమ్ డిగ్రీ కాలేజీని ఆదరబాదరగా ఏర్పాటు చేశారు. అరకొర సదుపాయాలు, చాలీచాలని సౌకర్యాలు, ఉన్నారో లేరో తెలియని విద్యార్థులు, అధ్యాపకులు… ఎందుకు ప్రారంభించారో తెలియదు కానీ, రెండు మూడు నెలలు తిరగకముందే ఆ కాలేజీనీ ఎత్తేశారు. నాంచారి మడూరుకు మార్చేశారు. దాన్నీ ఎవరూ పట్టించుకోలేదు.

ఖాళీగా గ్రౌండ్ లో కట్టిన కొత్త భవనాలు

ఖాళీగా ఉండాల్సిన గ్రౌండ్ కాస్తా ఖాళీగా మిగిలిన భవనాలతో నిండిపోయింది. పిల్లల ఆట స్థలం హాం ఫట్ అయింది. పోనీ, కొత్త భవనాలైనా పిల్లల చదువులకు ఉపయోగపడుతున్నాయా? అంటే అదీ లేదు. పాత భవనాల్లో పాఠాలు నడుస్తుంటే, కొత్త భవనాలు బోసిపోయి, శిధిలావస్థకు చేరుతున్నాయి. గట్టిగా, డోర్లు, కిటికీలు ఊడిపోయేలా ఉన్నాయి. కాంట్రాక్టర్ల పనితనం అంత గొప్పగా ఉంది.

కొత్త భవనాలకు సీసీ కెమెరాలు లేవు


పాలకుర్తి పాఠశాలలోని పాత భవనాలకు సీసీ కెమెరాలు ఉన్నాయి. కొత్త భవనాలకు లేవు. దీంతో కొత్త భవనాలు, గ్రౌండ్ కాస్తా ఆకతాయిలకు, అసాంఘిక కార్యలాపాలకు అడ్డాగా మారాయి.

బడినే బార్ గా మార్చుకున్న మందుబాబులు


గేట్లు లేవు. సిసి కెమెరాలు లేవు. నైట్ వాచ్ మన్ లేడు. అడిగే వారు లేరు. దిక్కు దివానం లేకుండా ఖాళీగా భవనాలు. ఒక భవనం ఫస్ట్ ఫ్లోర్, మరొక భవనం టెర్రెస్ పైకి ఎక్కి మరీ మందుబాబులు మజా చేసుకుంటున్నారు.

పాత క్యాంపస్ లో విద్యార్థులకు టాయిలెట్స్ లేవు
పాలకుర్తి జిల్లా పరిషత్ హై స్కూల్ లో 288 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రధానోపాధ్యాయులు సహా 21 మంది టీచర్లు, ఇద్దరు స్వీపర్లు ఉన్నారు. అయితే పాత క్యాంపస్ లో ఉన్న టాయిలెట్స్ ని టీచర్లు వాడుతున్నారు. ఇక విద్యార్థుల కోసం లేవు. ఇక కొత్త క్యాంపస్ లో ఉన్న టాయిలెట్స్ ని విద్యార్థుల కోసం వినియోగిస్తున్నారు. 15 రోజుల క్రితం అడిషనల్ కలెక్టర్ పాఠశాలను సందర్శించి, ‘అమ్మ ఆదర్శ పాఠశాల పథకం’ కింద టాయిలెట్స్, గేటు వంటి ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. కానీ అదీ అమలు కాలేదు. ఫైల్ కలెక్టర్ దగ్గరే ఆగిపోయింది. పిల్లలు మాత్రం సమస్యల్లో మగ్గిపోతున్నారు.

ఒకటి రెండు రోజుల్లో సీసీ కెమెరాలు:హెచ్ ఎం వివరణ
పాఠశాల సమస్యలపై తాము ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియ చేస్తున్నామని పాలకుర్తి హై స్కూల్ హెడ్ మాస్టర్ మాచర్ల శోభారాణి ‘అడుగు’ కు తెలిపారు. గేట్లు లేకపోవడంతోపాటు, చుట్టూ ఇండ్లు ఉండటంతో వారు వేస్తున్న చెత్త కొంత, ప్రహారీ గోడ సరిగా లేక కొందరు ఆ గోడలు దూకి కూడా గ్రౌండ్ లోకి ప్రవేశిస్తున్నారని ఆమె వివరించారు. అయినా తాము సిసి కెమెరాలు పెట్టించామని, కొత్త క్యాంపస్ లో కూడా సోలార్ సిసి కెమెరాలను ఒకటి రెండు రోజుల్లో పెట్టిస్తామని తెలిపారు. అలాగే బడిలో మందుబాబుల ఆగడాలపై సిఐ మహేందర్ రెడ్డిని బుధవారం కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఇదే విషయమై ఎంఇఓ నర్సయ్యను వివరణ కోరగా, ఈ రోజు ప్రేరణ కార్యక్రమంతోనే ముగిసిందని, రేపు అంటే బుధవారం స్కూల్ ను సందర్శిస్తామని చెప్పారు.

త్వరలోనే బడి సమస్యలకు పరిష్కారం!: ఎమ్మెల్యే యశస్విని


పాలకుర్తి హై స్కూల్ సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వి ని రాజా రామ్ మోహన్ రెడ్డి తెలిపారు. ‘అడుగు ‘ లో వచ్చిన “పగటి పూట సాగు బడి… రాత్రి పూట తాగు బడి!!” అనే కథనానికి ఆమె స్పందించారు. ఇప్పటికే ఈ విషయమై తాను జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా తో మాట్లాడామన్నారు. ‘అమ్మ ఆదర్శ పాఠశాల పథకం’ కింద నిధులు మంజూరు చేయిస్తున్నామన్నారు. ఈ ఫైల్ జిల్లా కలెక్టర్ దగ్గర ఉందన్నారు. త్వరలోనే నిధులు అందేలా చూడాలని చెప్పామని అన్నారు.

పాలకుర్తికి వచ్చినా, పట్టించుకోకుండా పోయిన కలెక్టర్, డిఇఓ


పాలకుర్తికి వచ్చినప్పటికీ, హై స్కూల్ సమస్యలను జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, జిల్లా విద్యాధికారి రమేశ్ లు పట్టించుకోలేదు. అప్పటికే ఈ విషయమై పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రాజారామ్ మోహన్ రెడ్డి కలెక్టర్ తోనూ, పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జీ ఝాన్సీ రాజేందర్ రెడ్డి అడిషనల్ కలెక్టర్ తోనూ మాట్లాడారని తెలిసింది. 10వ తరగతి విద్యార్థుల్లో ప్రేరణ నింపడానికి వచ్చిన వారు, ఆ విద్యార్థుల, వారు చదువుతున్న హై స్కూల్ సమస్యలను పట్టించుకోకపోవడం ఆశ్చర్యం. ఆ తర్వాత పాలకుర్తి విద్యుత్ సబ్ స్టేషన్ ను సందర్శించి, పరిశీలించిన కలెక్టర్ దృష్టికి హై స్కూల్ సమస్యలు రాకపోవడం దురదృష్టకరం.

Latest News

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 19 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం...

గీ బూచోడు, ఎంత మంచోడో!?|ADUGU TRENDS

మనుసుల్లో మంచి మనుసులున్నట్లే.. దొంగల్ల కూడ మంచి దొంగలుంటారని నిరూపించాడో దొంగ. తను దోసుకున్న దేవుడి నగలే కాదు, వాటిని మరమ్మతు సేయడానికి కొంత నగదు కూడా పెట్టి, దేవుడా శమించు... తప్పైందని...

వానల్లేక అన్నదాతల విలవిల!?|EDITORIAL

వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత...

సెప్టెంబర్ 12, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.35 వరకు ఉపరి విదియ నక్షత్రం ఉత్తర పగలు 01.54 వరకు ఉపరి హస్త యోగం శుభ సాయంత్రం 05.12 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 07.35...

కోవా యినాయకుడు! లడ్డూ మండపం!?|ADUGU TRENDS

ఇగ యినాయక చవితి రానే వచ్చే! ఇగిప్పుడు యినాయకుల సీజన్ ఒచ్చింది. రకరకాల ఆకారాలల్ల యిగ్రహాలను తయారు శేసుడు. గవాటిని ఈధుల్ల పెట్టుడు. నవరాత్రులు పూజలు శేసుడు మామూలేనాయె. అయితే, గా యినాయకులను...

భారత అంతరిక్ష ఇరుసు ఇస్రో ప్రైవేటుపరమేనా!?|EDITORIAL

ఇస్రోను “ప్రైవేటు కంపెనీలతో పోటీ పడే సంస్థ”గా కాకుండా, దేశ అంతరిక్ష వ్యవస్థకు మూల స్తంభంగా చూడాలి. పరిశోధన, వ్యూహాత్మక మిషన్లు, కీలక సాంకేతికతలు, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన కార్యకలాపాలు ఇస్రో ఆధ్వర్యంలోనే...

సెప్టెంబర్ 11,శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి అమావాస్య ఉదయం 08.35 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం పుబ్బ పగలు 02.08 వరకు ఉపరి ఉత్తర యోగం సాధ్య రాత్రి 06.54 వరకు ఉపరి శుభ కరణం నాగవ ఉదయం 08.35 వరకు ఉపరి కింస్తుంఘ్న రాహుకాలం...

గీ సర్, గా అన్నదమ్ముల్ని కలిపింది!?|ADUGU TRENDS

అవుమల్ల.. గది నిజమేనుల్లా... పత్యేక ఓట్ల సవరింపు (సర్) 35 ఏండ్ల కింద యిడిపోయిన అన్నదమ్ముల్ని కలిపింది. గదెట్లనో మీరే సదువుండ్రి. మన తెలంగాణ లెక్కనే గా పంజాబ్ ల సర్ సవరింపులు జరుగుతున్నయి....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News