Tuesday, November 3, 2026
23.2 C
Hyderabad

ఏది గొప్ప? అధికారమా? ఓటు హక్కా!?|EDITORIAL

ఎన్నికల సంఘం స్వతంత్రతపై ప్రశ్నలు తలెత్తడం చిన్న విషయమేమీ కాదు. అలాగే ఆధారాలు లేని ఆరోపణలు కూడా సమర్థనీయం కాదు. అందువల్ల ఎస్ఐఆర్‌కు సంబంధించిన రాష్ట్రాలవారీ గణాంకాలు, తొలగించిన పేర్ల వివరాలు, పునరుద్ధరించిన ఓట్ల సంఖ్యను ప్రకటించాలి. అవసరమైతే స్వతంత్ర సాంకేతిక, న్యాయపరమైన సమీక్ష చేపట్టాలి. రాజకీయ పార్టీలు పరస్పర విమర్శలకే పరిమితం కాకుండా ఓటరు హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలి. అధికారం కంటే ఓటు హక్కే గొప్పది. ఆ హక్కుపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లకుండా చూసే బాధ్యత రాజకీయ పార్టీలదే!

మార్గం – అడుగు, ఎడిటోరియల్

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ రాజకీయ దుమారానికి తెరలేపింది. ఓటర్ల జాబితా ప్రక్షాళన చేయడం, నకిలీ ఓట్లను తొలగించడం లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రక్రియ ఇప్పుడు ఎన్నికల సంఘం విశ్వసనీయత, పారదర్శకతపై ప్రశ్నలు సంధిస్తోంది. ఒకవైపు ఓటు హక్కును కాపాడాలంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి పోరాటం చేస్తుంటే, మరోవైపు చొరబాటుదారులు, డూప్లికేట్ ఓట్లను తొలగించడాన్ని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని బీజేపీ ఎదురుదాడికి దిగుతోంది. దీంతో ఎస్ఐఆర్ వివాదం సంస్కరణలను దాటి రాజకీయ ఆధిపత్య పోరుగా మారింది.

ఈ వివాదంలో అత్యంత ఆందోళనకరమైనది ఎన్నికల సంఘంలో అంతర్గత విభేదాలు. ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి గత పది నెలల్లో ఎస్ఐఆర్‌కు సంబంధించిన నిర్ణయాలపై కనీసం 14 సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు ఇండియన్ ఎక్స్ ప్రెస్ పరిశోధనాత్మక కథనం వెల్లడించింది. తమకు తగిన సమాచారం లేకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని వారు ప్రశ్నించినట్లు ఆ కథనం పేర్కొంది. గోవాలోనూ పరిస్థితి మరింత వివాదాస్పదంగా మారింది. అర్హులుగా గుర్తించిన 97 మంది ఓటర్ల పేర్లను తిరిగి చేర్చేందుకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం 7 రోజుల్లో 8 సార్లు ఢిల్లీ అధికారులను సంప్రదించినప్పటికీ సాంకేతిక సమస్య పరిష్కారం కాకపోవడం, వ్యవస్థ పనితీరుపై సందేహాలను పెంచాయి.

ఇదే సమయంలో ఇండియా కూటమి ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ నినాదంతో భారీ నిరసన చేపట్టింది. సీఈసీ జ్ఞానేశ్ రాజీనామా చేయాలని, ఎన్నికల సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేసింది. అర్హులైన పౌరుల ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని ప్రతిపక్ష నేతలు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య సంస్థల స్వతంత్రతను కాపాడాలని పిలుపునిచ్చారు.

అయితే, ప్రతిపక్షాల ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఎన్నికల జాబితాల్లో చనిపోయినవారు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైనవారి పేర్లను తొలగించడం తప్పా? అని ప్రభుత్వం వాదిస్తోంది. దేశవ్యాప్తంగా 13 కోట్లకు పైగా పేర్లు తొలగించబడ్డాయన్న చర్చ నేపథ్యంలో, అవన్నీ ఒకే రకమైన తొలగింపులు కావని బీజేపీ నేతలు వివరణ ఇస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకారం, 3 కోట్ల మంది మరణించినవారు, 6.5 కోట్ల మంది ఇతర ప్రాంతాలకు తరలివెళ్లినవారు కాగా, మిగిలినవి డూప్లికేట్, ఇతర అనర్హుల పేర్లు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే, ఈ గణాంకాలు, పూర్తి వివరాలు, రాష్ట్రాలవారీ లెక్కలు ప్రజలకు అందుబాటులో ఉండటం అత్యవసరం.

ఎన్నికల్లో ఓటమిని అంగీకరించలేక కాంగ్రెస్, రాజ్యాంగ సంస్థలను లక్ష్యంగా చేసుకుంటోందని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమం, కాంగ్రెస్ నిజంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోరుకుంటే, ముందుగా తన పార్టీలో కుటుంబ పాలనకు ముగింపు పలకాలని వ్యాఖ్యానించారు. విదేశీ శక్తుల ప్రభావంతో దేశంలో అస్థిరత సృష్టించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపిస్తున్నారు.

ఇండియా కూటమి నిరసనకు పోటీగా బీజేపీ, 1984 సిక్కుల ఊచకోత బాధితులకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో నిరసనలు నిర్వహించింది. రాహుల్ కాంగ్రెస్ తరఫున బాధితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. జేపీ నడ్డా ప్రతిపక్షాల ర్యాలీని రాజకీయ కుట్ర, ప్రజాస్వామ్యం పేరుతో అరాచకానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అయితే, ర్యాలీకి పది లక్షల మంది హాజరయ్యారన్న కాంగ్రెస్ వర్గాల వాదనను బీజేపీ ప్రశ్నించింది.

తెలంగాణలోనూ ఎస్ఐఆర్ రాజకీయ వేడిని పెంచింది. హైదరాబాద్‌లో బీజేపీ మహాపాదయాత్ర ముగింపు సభలో అమిత్ షా, నకిలీ ఓట్లు తొలగించాలా వద్దా? సర్ లేనప్పుడు 2014, 2019 ఎన్నికల్లో మోదీ గెలవలేదా? ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగితే రేవంత్ సీఎం ఎలా అయ్యారు? అని కాంగ్రెస్‌ ను సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ మాత్రం, అర్హులైన పౌరుల ఓట్లు పోకుండా చూడటమే తమ పోరాటమని స్పష్టం చేస్తోంది.

వాస్తవానికి ఓటరు జాబితాల ప్రక్షాళన అవసరమే. మరణించినవారి పేర్లు, డూప్లికేట్ నమోదులు, అనర్హుల వివరాలను తొలగించడం ఎన్నికల పారదర్శకతను పెంచుతుంది. అయితే, ఆ ప్రక్రియలో ఒక్క అర్హుడి ఓటు కూడా అన్యాయంగా తొలగిపోకూడదు. ప్రతి తొలగింపునకు సరైన నోటీసు, వివరణ ఇచ్చుకునే అవకాశం, అప్పీల్ చేసుకునే హక్కు ఉండాలి. ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాలు రాజకీయ పక్షపాతానికి అతీతంగా, పారదర్శకంగా జరగాలి.

ఎన్నికల సంఘం స్వతంత్రతపై ప్రశ్నలు తలెత్తడం చిన్న విషయమేమీ కాదు. అలాగే ఆధారాలు లేని ఆరోపణలు కూడా సమర్థనీయం కాదు. అందువల్ల ఎస్ఐఆర్‌కు సంబంధించిన రాష్ట్రాలవారీ గణాంకాలు, తొలగించిన పేర్ల వివరాలు, పునరుద్ధరించిన ఓట్ల సంఖ్యను ప్రకటించాలి. అవసరమైతే స్వతంత్ర సాంకేతిక, న్యాయపరమైన సమీక్ష చేపట్టాలి. రాజకీయ పార్టీలు పరస్పర విమర్శలకే పరిమితం కాకుండా ఓటరు హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలి. అధికారం కంటే ఓటు హక్కే గొప్పది. ఆ హక్కుపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లకుండా చూసే బాధ్యత రాజకీయ పార్టీలదే!

Latest News

గురువును గౌరవించుడంటే గిదే మరి!?|ADUGU TRENDS

‘మాతృ దేవో భవ, పితృ దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ’ అన్నరు. గంట్లంటే గా తల్లిని దైవంగ సూడాలె. తండ్రిని కూడా దైవంగనే భావించాలె. ఇగ గట్లనే...

నవంబర్ 03, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం కృష్ణపక్షం తిధి నవమి మధ్యాహ్నం 02.41 వరకు ఉపరి దశమి నక్షత్రం ఆశ్లేష ఉదయం 07.32 వరకు ఉపరి మఖ యోగం శుక్ల మధ్యాహ్నం 02.07 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి పగలు 02.41 వరకు ఉపరి...

నవంబర్ 02, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం కృష్ణపక్షం తిధి అష్టమి సాయంత్రం 04.40 వరకు ఉపరి నవమి నక్షత్రం పుస్యమి ఉదయం 08.53 వరకు ఉపరి ఆశ్లేష యోగం శుభ సాయంత్రం 04.54 వరకు ఉపరి శుక్ల కరణం కౌలవ సాయంత్రం 04.40 వరకు ఉపరి...

పట్టా శాశ్వతం.. ఓటు మాత్రం తాత్కాలికమా!?|ESSAY|GRADUATES

ప్రజాస్వామ్యానికి పునాది ఓటు హక్కు. అర్హులైన ప్రతి పౌరుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తన ఓటును వినియోగించుకునేలా ఎన్నికల వ్యవస్థ ఉండాలి. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు విధానం మాత్రం...

కరెంట్ అఫైర్స్|CURRENT AFFAIRS|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|EDUCATION

1) లడఖ్‌లోని పుగా వ్యాలీలో భారతదేశపు మొట్టమొదటి జియోథర్మల్ బావులు తూర్పు లడఖ్‌లోని పుగా వ్యాలీలో 1,000 మీటర్ల లోతు కలిగిన భారతదేశపు మొట్టమొదటి మరియు అత్యంత లోతైన జంట జియోథర్మల్ (భూగర్భ ఉష్ణ)...

గీ బూరు మిఠాయి గింత పని శేసిందా!?|ADUGU TRENDS

యెనకటికి ఓ సైకోలు మీదనో, మూడు గిర్రల బండి మీదనో.. ఓ గంట మోగేది. గది మెల్లెగా మన వాడల్లోకి వచ్చేది. ఇగ గది సూద్దుం గదా? గావాటి మీద ఎర్రగనో, గులాబీలోనో...

పేదరికంపై భారత్ విజయం|EDITORIAL

ఒకప్పుడు పేదరికం భారత్‌ను వెంటాడింది.. ఇప్పుడు అదే పేదరికంపై దేశం గణనీయమైన విజయం సాధిస్తోంది! 12 ఏళ్లలో 49.6 కోట్ల మందికి ఊరట. ఇది అభివృద్ధికి సంకేతమేనా? అసమానతల అంతానికి ఇంకా ఎంత...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

నవంబర్ 01 నుండి నవంబర్ 07 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త ఆలోచనలు కార్యరూపం దాల్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగ రంగంలో మీ ప్రతిభకు తగిన...

ఉపవాసం లేదని యిడుపు కాయితం!?|ADUGU TRENDS

ఆలుమొగల బంధం పాలునీల్ల లెక్క కలిసిపోయేది. ఎంతో యిలువైంది. వందేండ్ల పానాలకు నూరేండ్ల అనుబంధం. కానీ గా పెనిమిటి, పెండ్లాంల జీవితాలు కుక్కలు శింపి, ఇసిరేసిన ఇస్తరిలెక్కైతానయి. శీటికి మాటికి శిల్లర పంచాయితీలు,...

ప్రతి నీటి చుక్కా విలువైనదే!|EDITORIAL

ఎల్‌నినో హెచ్చరికలు.. అడుగంటుతున్న జలాశయాలు.. పెరుగుతున్న ట్యాంకర్ల డిమాండ్‌! భాగ్యనగరానికి జలగండం ముంచుకొస్తోందా? రేపటి దాహాన్ని తీర్చేందుకు నేడే మేల్కోవాలి. ప్రభుత్వ ముందుచూపుతో పాటు ప్రజల నీటి పొదుపే మహానగరానికి శ్రీరామరక్ష! మార్గం -...

అక్టోబర్ 31, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం కృష్ణపక్షం తిధి షష్ఠి రాత్రి 09.13 వరకు ఉపరి సప్తమి నక్షత్రం ఆరుద్ర పగలు 12.05 వరకు ఉపరి పునర్వసు యోగం సిద్ద రాత్రి 10.57 వరకు ఉపరి సాధ్య కరణం గరజి ఉదయం 10.24 వరకు ఉపరి...

గీ కుక్క-కోతిని సూసి నేర్సుకోవాలె!?|ADUGU TRENDS

కుక్క-కోతిలది పుట్టుకతోనే వైరం. వాటి స్వభావికం కూడా. కోతులను తరిమికొట్టడానికి కుక్కలను సాదుతరు. గాడాడ గా కుక్కలు, కోతులు కలిసి మెలిసి కూడా ఉంటయి. గట్లనే గా ఒడిశా రాష్ట్రం కలహండి జిల్ల కేంద్రం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News