కేంద్ర బడ్జెట్‌పై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అధిక నిధులు కేటాయించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు, పోలవరానికి ఈ బడ్జెట్ ఊపిరి పోసిందని ఆమె అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లకు మంత్రి సవిత ధన్యవాదాలు తెలిపారు. ఈ బడ్జెట్ వ్యవసాయం, పారిశ్రామిక రంగాలకు ప్రాధాన్యమిచ్చి, దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది వేస్తుందని ఆమె పేర్కొన్నారు.
అలాగే, సీఎం చంద్రబాబు కృషి ఫలితంగానే కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అధిక నిధులు కేటాయించాయని మంత్రి సవిత చెప్పారు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచేలా, యువతకు ఉపాధి అవకాశాలు అందించేలా ఈ బడ్జెట్ ఉందని ఆమె చెప్పారు.
ఇక, మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కొత్త ఊపిరి నిచ్చేలా నిధులు కేటాయించడంపై ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి సీతారామన్‌లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ బడ్జెట్‌లో ఆరోగ్య వ్యవస్థ, నేచురల్ ఫార్మింగ్, విశాఖ పోర్టు కోసం నిధులు కేటాయించడం సంతోషకరమని చెప్పారు.

