Wednesday, August 19, 2026
26.1 C
Hyderabad

కల’వరంగా ఐటీ ఉద్యోగరంగం!|EDITORIAL

9వేల మంది ఉద్యోగుల్ని తొలగించనున్న మైక్రోసాఫ్ట్. పాకిస్తాన్ కు మైక్రోసాఫ్ట్ బై బై. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఒక ఐటీ కంపెనీకి సంబంధించి మచ్చుకు ఒకటి రెండు ఉదాహరణలివి. మిగతా అనేకానేక కంపెనీలో చెప్పి తొలగించేవి. చెప్పకనే తొలగించేవి. చెప్పినా, చెప్పకపోయినా, వెల్లడి కాని కంపెనీలు కొన్ని. ఇలా అనేకానేక ఐటీ కంపెనీలు ఇప్పుడు ఉద్యోగులను తగ్గించుకునే పనిలో ఉన్నాయి. కంపెనీలకు ఉద్యోగులు భారంగా మారారు అనడం కంటే, ఖర్చు తగ్గించుకోవడం, లాభాలు ఆర్జించడం ఒక ఎత్తైతే. ఇప్పుడు వందల వేల మంది ఉద్యోగులు చేసే పనులను ఆర్టిఫీషియల్ ఇంటలీజెన్స్ చేసేస్తోంది. కాబట్టి, ఉద్యోగులతో పనేంటి? వారికి జీతాలు దండగ. పైగా ఉద్యోగి పనిలో పరిపక్వత సంగతి పక్కన పెట్టండి. ఎఐ ద్వారా అంతకంటే అద్భుతం అనే విధంగా పనులు చక చకా జరిగిపోతుంటే, మానవ వనరులు, మనుషులతో పనే లేకుండా పోతోంది. ఆశ్చర్యమనిపించినా అంగీకరించక తప్పని పరిస్థితి ముంగిట మనమున్నాం.

నిజానికి ఐటి రంగం ఎంతగా ఆకర్షించి, ఊరిస్తున్నదో అంతకంటే ఎన్నో రెట్లు క్షోభ కూడా పెడుతోంది. దేశ, భాష సరిహద్దులు చెరిగిపోయి, ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఐటి ఉద్యోగాలు ఉన్న పళంగా ఊడిపోతున్నాయి. ఉద్యోగులను అకారణంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఇది మామూలై పోయింది. చిన్నా చితక కంపెనీలు మాత్రమే కాదు, పేరు ప్రతిష్టలు ఉన్న కంపెనీలే ఇలా చేస్తున్నాయి. పైగా అవి జీతం ఎక్కువగా ఉన్న ఉద్యోగులనే టార్గెట్‌ చేస్తున్నాయి. దీంతో ఉన్న ఉద్యోగం ఊడిపోతుండటంతో కొందరు ఆత్మహత్యలకు పాల్పడే దుష్పరిణామాలు సంభవిస్తున్నాయి. ఖర్చు తగ్గించుకునే పనైతే, కంపెనీని నమ్ముకుని, దీర్ఘకాలంగా పని చేస్తున్న వారికి నచ్చచెప్పి, జీతాల్లో కోతలు విధించవచ్చు. తగ్గించవచ్చు. కరోనా సమయంలోలా తగ్గించుకోవడానికి కూడా ఓ పద్దతి అంటూ ఉంటుంది. కానీ, ఇటీవలి కాలంలో ఆలా జరగడం లేదు. ఐటి కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు పెరుగుతున్న తీరు ఆ రంగం మీద ఆధారపడి జీవిస్తున్న వారిని తీవ్రంగా కలవరపెడుతోంది. ఉద్యోగం పోయినా బతకగల, ఇతర ప్రత్యామ్నాయ ఏదైనా రంగంలో రాణించే బహుముఖ ప్రావీణ్యం కూడా ఐటీ ఉద్యోగులకు ఉండటం లేదు. దీంతో పరిస్థితులు మరింత దారుణంగా మారుతున్నాయి.

నిజానికి క్షేత్రస్థాయి లోనే విద్యారంగంలో మార్పులు రావాలి. విద్యార్థులు రాటుదేలేలా తర్ఫీదు ఇవ్వాలి. వారు ఎంచుకంటున్న ఆయా రంగాల్లో నిష్ణాతులను తయారు చేయాలి. అప్పుడే వారు ఏ పరిశ్రమలో అయినా, ఉపాధి రంగంలో అయినా రాణిస్తారు. విద్యావిధానంలో మార్పుల తోనే ఇది సాధ్యం. కేవలం బట్టీ చదువుల వల్ల విద్యార్థుల్లో నైపుణ్యాలు లోపిస్తున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించేలా మార్కెట్‌ విస్తరించాలి. ఉద్యోగమంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగమే కాదు.. ప్రైవేట్‌ రంగంలోనూ వారికి అవకాశాలు కల్పించాలి. అలాగే సొంతకాళ్ల మీద నిలబడేలా ఉపాధికి అవకాశాలను పెంచాలి. బ్యాంకులు ఇతోధికంగా రుణాలు ఇవ్వాలి. ఇవన్నీ సాకారం కావాలంటే వ్యవసాయరంగం, అనుబంధ రంగాలు బలపడాలి. పారిశ్రామిక రంగం పురోగమించాలి. ఇవన్నీ కూడా ఓ క్రమద్దతిలో అభివృద్ది చేసుకుంటూ పోవాలి. ఎంతసేపు పెన్షన్లు పంచడం, కిలో రూపాయికి బియ్యిం ఇవ్వడం, ఇందిరమ్మ ఇళ్లు కట్టించడం ఇదే అభివృద్ది కాదు. ప్రజలు తమకాళ్ల మీద తాము నిలబడగలిగేలా వాతావరణం సృష్టించాలి. ఇది ప్రభుత్వాల బాధ్యత. యువత ఆకాంక్షల మేరకు అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వాల విధానాలు ఉండాలి.

ఆంధ్రప్రదేశ్‌లో క్వాంటమ్‌ గురించి సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. తెలంగాణ సిఎం రేవంత్‌ స్కిల్‌ వర్సిటీ అంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. కొత్తగా పరిశ్రమలు వస్తాయి. తమకు ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సీఎంలు, మంత్రులు అమెరికా, దావొస్, జపాన్ తదితర దేశాలు చుట్టివచ్చారు. ఐటీ, ఇతర పరిశ్రమల ఏర్పాటుకు ఆహ్వానాలు పలికారు. అయితే ఆయా కంపెనీలు మన దేశానికి వచ్చి ఉద్యోగాలిచ్చేదాకా, ఇక్కడి నిరుద్యోగులేం కాను? పైగా ఆయా దేశాల కంపెనీలు నైపుణ్యం గల ఉద్యోగులను, ఉద్యోగాలను తామే నియమించుకుని, అన్ స్కిల్డ్ లేబర్ గా మన వాళ్ళని వాడుకుంటున్నాయి. దీంతో ఆశించిన కంపెనీలు వచ్చినా, ఆశించే ఉద్యోగాలు మాత్రం ఉండటం లేదు.

అయినా, మనకు అందుబాటులో ఉన్న వనరులతో ఏం చేయవచ్చన్నది ప్రభుత్వాలు ఆలోచించాలి. మనకు విస్తారంగా సహజవనరులు ఉన్నాయి. సముద్రతీరం ఉంది. అతి పెద్ద రంగంగా వ్యవసాయం ఉంది. వ్యవసాయాధారిత రంగాల పురోగతిపై ఆలోచించాలి. ఇవన్నీ కూడా ఉపాధికి అభివృద్ది కేంద్రాలు. పారిశ్రామకవేత్తలకు మోకరిల్లి, రెడ్‌ కార్పెట్‌ పరవడం కంటే, స్థానికంగా మనదైన రంగంలో మనం ఎదగడంపై ఆలోచిస్తే మంచి ఫలితాలుంటాయి. కంపెనీలకు మేలు చేసేలా నిర్ణయాలు కాకుండా, ప్రజలకు మేలు చేసేలా విధానాలు ఉండాలి. ఎస్‌.ఇ.జెడ్‌ లలో వచ్చిన కంపెనీలకు భూములు ఇచ్చి రైతులు ఆ కంపెనీల్లో కూలీలుగా మారుతున్నారు. పరిశ్రమల నిర్మాణ సమయంలో వచ్చే, పోయే లారీల్లో దింపుడు, ఎత్తుడు హమాలీలయ్యారు. గంగవరం పోర్టు, పోలవరం ప్రాజెక్ట్‌, ఫార్మాసిటీల లాంటి వాటికోసం, విశాఖ ఉక్కు కోసం భూములు త్యాగాలు చేసిన వారు రోడ్డున పడుతున్నారు. ఇలాంటి ఘోరాలు జరక్కుండా దిశగా ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. తెలంగాణలో మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌ లాంటి వాటికి భూములు ఇచ్చిన రైతులు ఇవాళ దిక్కులేకుండా పోయారు. ఇలాంటి అభివృద్ది ఎవరి కోసమన్నది కూడా ఆలోచన చేయాలి. ప్రభుత్వాలు ఏకపక్షంగా పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే పని చేస్తున్నాయి. ప్రైవేట్‌ పరిశ్రమల్లో తనిఖీలను, కార్మికుల భద్రతను గాలికొదిలేశారు. వెట్టి చాకిరీ చేయించుకునే వ్యవస్థను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది. సిగాచీ పరిశ్రమలో జరిగిన దారుణమే ఇందుకు నిదర్శనం.

Latest News

వరుస ఆరోపణలు.. షోకాజ్ నోటీసులు!|CONGRESS|NOTICE

తెలంగాణ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతుంది?|TELANGANA|CM|REVANTH REDDY|KONDA FAMILY తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ కుటుంబం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గం మధ్య...

సుస్మితకు ఎమ్మెల్యేల ఘాటు కౌంటర్|KONDA FAMILY|MLAS|COUNTER

క్రమశిక్షణ చర్యలపై కాంగ్రెస్‌ ఫోకస్|MALLU RAVI|CONGRESS|FOCUS తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఇటీవల పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో...

సీఎం అయ్యాక కళ్ళు నెత్తికెక్కాయా….|TELANGANA|CONGRESS|KONDA|REVANTH REDDY

సీఎం రేవంత్ వర్సెస్ కొండా కుటుంబం!|CM|KONDA SUSMITHA ఒకవైపు జెన్ జీ వాళ్లకు టిక్కెట్లు ఇవ్వాలి అంటావ్ మరోవైపు డైపర్లు వేసుకొని తిరుగుతున్న రేవూరి ప్రకాశ్ రెడ్డికి టికెట్ ఇస్తా అంటావ్ - మంత్రి కొండా సురేఖ...

స్టార్ హోటల్ల దోశ గిట్లనే తినాల్నట!?|ADUGU TRENDS

శిన్నప్పుడు మనం ఎట్ల తినాల్నో? ఎట్ల తినకూడదో మన అవ్వయ్యలు నేర్పిత్తురు. అన్నలక్కలు కూడా శెప్తరు. గట్లనే మనం తినడం నేర్సుకుంటం. పెద్దగైనంక సుత.. గట్ల తినుడే అలవాటు శేసుకుంటం. కనీ, పెద్ద పెద్ద...

ఉగ్రవాదం : అనుమానమే ఆయుధం కాకూడదు!?|EDITORIAL

దేశ భద్రతకు ‘ప్రజలు కూడా బాధ్యతాయుతమైన సమాచార భాగస్వాములుగా ఉండాలి. నిఘా సంస్థలు ఆధారాలను విశ్లేషించి, చట్టబద్ధమైన దర్యాప్తు ద్వారా నిందితులను గుర్తించాలి. ఉగ్రవాదంపై కఠిన చర్య అవసరం. అదే సమయంలో నిరపరాధ...

ఆగస్టు19, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తిధి శు.సప్తమి రాత్రి 08.09 వరకు ఉపరి అష్టమి నక్షత్రం స్వాతి ఉదయం 08.58 వరకు ఉపరి విశాఖ యోగం శుక్ల ఉదయం 06.37 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 07.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

హవ్వ…ఆవు పెండ మట్టితోటి శివలింగం!?|ADUGU TRENDS

సావును తప్పించుకోవడానికి భక్త మార్కండేయుడు శివలింగాన్ని బిర్రుగ కావలిచ్చుని తపస్సు శేసిండు. యముడి పాశం శివలింగానికి తాకడంతోటి శివుడికి కోపమొచ్చిందిట. యముడిని తరిమికొట్టి మార్కండేయునికి చిరంజీవిగా వరం ఇచ్చిండట. గట్లనే తిన్నడు గదేనుల్ల భక్త...

మరి, ‘సౌరశక్తి మంథన్’ మాటేమిటి!?|EDITORIAL

చమురు, గ్యాస్‌ అన్వేషణ దేశానికి తక్షణ, వ్యూహాత్మక ప్రయోజనాలను అందించవచ్చు. కానీ అవి పరిమిత వనరులు. సూర్యుడు మాత్రం నిరంతర ఇంధన వనరు. అందుకే ‘సముద్ర మంథన్‌’తో పాటు ‘సౌర శక్తి మంథన్‌’...

ఆగస్టు 18, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం మంగళగౌరి వ్రతం తిధి శు.షష్ఠి రాత్రి 07.11 వరకు ఉపరి సప్తమి నక్షత్రం చిత్త ఉదయం 07.34 వరకు ఉపరి స్వాతి యోగం శుభ ఉదయం 07.00 వరకు ఉపరి శుక్ల కరణం కౌలవ ఉదయం 06.58 వరకు ఉపరి...

ఆగస్టు 17, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం నాగ పంచమి గరుడ పంచమి తిధి శు.పంచమి సాయంత్రం 06.43 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం హస్త ఉదయం 06.40 వరకు ఉపరి చిత్త యోగం సాధ్య ఉదయం 07.51 వరకు ఉపరి శుభ కరణం బవ ఉదయం...

గా ఊల్లె తాగొద్దు..!?|ADUGU TRENDS

ఎనకటికి 'మందు తాగనోడు దున్నపోతై పుట్టున్ ' అన్నరు. కానీ గా ఊరోల్లు మాత్రం మందు తాగితే జరిమానా ఏత్తం అంటున్నరు. పెండ్లి కానోళ్లు తాగొద్దట! పెండ్లి అయినోళ్ళు తాగొచ్చట? కానీ, కొట్లాడుకోవద్దట! తమిళనాడు...

రాహుల్ గాంధీ ముందున్న సవాల్ ఇదే!?|EDITORIAL

రాహుల్ గాంధీకి ఇప్పుడు ఎదురున్న అసలు సవాల్ మోదీని వ్యక్తిగతంగా విమర్శించడం కాదు. తన రాజకీయ శైలిని పునర్నిర్మించుకోవడం. సభలో హుందాతనం, వాస్తవాలపై పట్టు, విదేశాంగంపై బాధ్యతాయుతమైన భాష, పార్టీ పునర్వ్యవస్థీకరణ, యువ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News