చైనాలో షాక్‌కు గురిచేసిన ప్రమాదంలో, కారు నిర్లక్ష్యంగా నడిపి 35 మంది ప్రాణాలను హరించిన ఫాన్ వీకియూ (62)కు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. న్యాయ ప్రక్రియ పూర్తిచేసి, అతనికి శిక్షను అమలు చేశారు.
2023 నవంబర్ 11న, ఝుహాయ్ నగరంలో ఫాన్ తన కారును పాదచారులపైకి నడిపాడు. ఈ ఘటనలో 35 మంది అక్కడికక్కడే మరణించగా, అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు.పోలీసులు ఫాన్‌ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణలో అతనికి ఉద్దేశపూర్వక నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ప్రాణనష్టం జరిగినట్లు నిర్ధారించబడింది. దాంతో, న్యాయస్థానం అతనికి ఉరిశిక్ష విధించింది. ఆదేశాల మేరకు శిక్షను వెంటనే అమలు చేశారు.

