Wednesday, September 30, 2026
25.9 C
Hyderabad

రిషబ్ పంత్ ఫైటింగ్ ఇన్నింగ్స్

టెస్ట్ క్రికెట్‌ ఎందుకు అత్యంత కఠినమైన ఫార్మాట్‌గా పిలుస్తారో మరోసారి రిషబ్ పంత్ తన ఫైటింగ్ ఇన్నింగ్స్‌తో చూపించాడు. సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్టులో పంత్ చూపిన ధైర్యం, పట్టుదల క్రికెట్ లవర్స్‌ను ఆకట్టుకుంది. 72 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన పంత్, కంగారూ పేసర్ల బౌన్సర్లు, స్వింగ్ బంతులను ఎదుర్కొంటూ తన బ్యాటింగ్ ప్రతిభను ప్రదర్శించాడు.

మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, బోలాండ్‌లు అద్భుత పేస్‌తో దాడి చేయగా, పంత్ ఒంటినిండా గాయాలు పాలవడాన్ని సహించుకుంటూ క్రీజులో నిలబడ్డాడు. బౌండరీలు కొట్టడం కంటే, డిఫెన్సివ్‌గా ఆడుతూ సింగిల్స్, డబుల్స్‌తో స్కోరు బోర్డును నడిపించాడు. 98 బంతుల్లో 40 పరుగులు చేసిన పంత్, భారత ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

తన సహజ ఆటకు భిన్నంగా ఆడిన ఈ ఇన్నింగ్స్ పంత్ ప్రతిభకు నిదర్శనం. గాయాలను ఓర్చుకొని, అత్యంత క్లిష్ట పిచ్‌పై బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్న అతడి ప్రయత్నం జట్టుకు విలువైన పరుగులు అందించింది. అతడి డిఫెన్స్‌తో భారత జట్టు కనీస పరుగు స్కోరైనా సాధించగలిగింది. క్రికెట్ విశ్లేషకులు పంత్ ఆటతీరును ప్రశంసిస్తూ, ఈ ఇన్నింగ్స్‌ ఎప్పటికీ ప్రత్యేకంగా గుర్తుండిపోతుందని చెబుతున్నారు. “ఏం గుండె సామి ఇది!” అంటూ అభిమానులు అభినందిస్తున్నారు.

Latest News

అమ్మకానికో ఊరు..! నీల్లిత్తే సాలు!?|ADUGU TRENDS

ఇప్పటిదాకా వస్తువులమ్మడం సూసినం. ఆస్తులనమ్మడం సూసినం. కానీ, ఊరినే అమ్మకానికి పెట్టడం ఎక్కడైనా సూసినమా? కానీ, గా ఊరును నిజంగనే గా ఊరోల్లు అమ్మకానికి పెట్టిండ్రు. గది కూడా వట్టి నీల్లకే!? గది మహారాష్ట్ర....

ఎల్ నినో ప్రభావాన్ని తగ్గించడమే అసలైన పరీక్ష!|EDITORIAL

ఎల్‌నినో బలహీనపడాలని, సమయానుకూలం గా వర్షాలు కురవాలని కోరుకోవడం సహజమే. కానీ వాతావరణాన్ని మార్చలేం. దాని ప్రభావాన్ని తగ్గించే వ్యవసాయ విధానాలను మాత్రం ముందుగానే రూపొందించవచ్చు. ఇదే ఇప్పుడు కేంద్రం, రాష్ట్రాలు, శాస్త్రవేత్తలు,...

సెప్టెంబర్ 30, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తిధి చవితి సాయంత్రం 04.35 వరకు ఉపరి పంచమి నక్షత్రం భరణి ఉదయం 10.08 వరకు ఉపరి కృత్తిక యోగం హర్షణ ఉదయం 06.37 వరకు ఉపరి వజ్ర కరణం బాలవ సాయంత్రం 04.35 వరకు ఉపరి...

తెలంగాణలో… కమల వికాసం కలేనా!?|TELANGANA|BJP

రాష్ట్రంలో బీజేపీకి భవిష్యత్తు ఉందా? కాషాయంలో అంతర్గత కలహాలు! కావాల్సిన కసరత్తేది? కార్యాచరణేది? పార్టీకి సత్తువెక్కడ? సమన్వయం ఎక్కడ? సీనియర్లకు, కార్యకర్తలకు గుర్తింపేది? సమీక్షలున్నాయా? సవరింపులున్నాయా? పెరుగుతున్న పార్టీకి... పెరగని గ్రామీణ బలం! కేంద్ర పదవులు... రాష్ట్రానికి ఉపయోగమేనా? బూత్ కమిటీలు ఉన్నాయా? పనిచేస్తున్నాయా? కొత్త...

ఇంద్రుడి మీద న్యాయమూర్తికి ఫిర్యాదు!?|ADUGU TRENDS

వాన దేవుడు వానలు కురిపిత్తరని మనం నమ్ముతం. గా వానాకాలం, సలికాలం, ఎండాకాలమని ఓ లెక్క పకారం వత్తయి. గీ మద్దెల గయి కూడా లెక్క తప్పినయి. పడితే ఒకటే వాన.. లేకపోతే...

మాటలు మంటలు రేపితే.. యుద్ధం ఎక్కడ ఆడుతుంది.!?|EDITORIAL

శాంతి చర్చలు సాగాల్సిన వేళ.. అమెరికా–ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. క్షిపణుల హెచ్చరికలతో ప్రపంచం వణుకుతోంది.. చమురు ధరలు కదులుతున్నాయి.. ఆర్థిక వ్యవస్థలు ఆందోళనలో పడుతున్నాయి. ఒకవైపు సైనిక ఒత్తిడి.....

సెప్టెంబర్ 29, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం సంకటహర చతుర్థి తిధి బ తదియ సాయంత్రం 06.25 వరకు ఉపరి చవితి నక్షత్రం అశ్విని ఉదయం 11.09 వరకు ఉపరి భరణి యోగం వ్యాఘాత ఉదయం 09.07 వరకు ఉపరి హర్షణ కరణం వణజి ఉదయం...

సెప్టెంబర్ 28, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తిధి బ విదియ రాత్రి 07.56 వరకు ఉపరి తదియ నక్షత్రం రేవతి ఉదయం 10.49 వరకు ఉపరి అశ్విని యోగం ధ్రువ ఉదయం 11.21 వరకు ఉపరి వ్యాఘాత కరణం తైతుల ఉదయం 08.32...

గీ యినాయకునికి.. నిమజ్జనమే లేదు!?|ADUGU TRENDS

పతి ఏటా యినాయకులను పతిష్టించి, పూజించి, కోటొక్క తీర్గ కొలిచి సివరాకరికి నిమజ్జనం చేస్తుంటం. కానీ, గీ యినాయకునికి నిమజ్జనమే లేదు!? ముంబై గిర్గావ్ లో ఓ గణేశ్ మండలి గీ సంప్రదాయాన్ని...

కత్తులు దూసిన చేతులే.. కరచాలనం!|EDITORIAL

నిన్నటి వరకు పరస్పరం సుంకాలు, ఆంక్షలు, హెచ్చరికలతో ఢీకొన్న అమెరికా–చైనా.. ఒక్కసారిగా ఆత్మీయ ఆలింగనంలో కనిపించాయి. శత్రువుల్లా కనిపించిన రెండు అగ్రశక్తుల అధినేతలు ఒకే వేదికపై చిరునవ్వులు చిందించడం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది....

ఈ రోజు/ వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 03 వరకు రాశి ఫలాలు మేష రాశి: ఈ వారం కొత్త బాధ్యతలు మీ ముందుకు రావచ్చు. ఉద్యోగంలో మీ పనితీరును ఉన్నతాధికారులు గమనించే అవకాశం ఉంది. పెండింగ్‌లో ఉన్న...

ఇగ్రహం ఉన్న సోటనే నిమజ్జనం!|ADUGU TRENDS

ప్రతి ఏటా ఇనాయకులను నిలబెడత0.. తొమ్మిది, పది రోజులు ఘనంగా పూజలు సేస్త0. ఇగ గా ఇగ్రహాలను చెరువుల్ల, కుంటల్ల నిమజ్జనం సేస్త0. గా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో సేసే గా...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News