గ్రూప్ -2 వాయిదా వేయాలని ప్రభుత్వం రాసిన లేఖపై APPSC నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయని, పరీక్షలు వాయిదా వేయాలన్న అభ్యర్థుల విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అలాగే ఈ అంశంపై మార్చి 11 న హైకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. అఫిడవిట్ వేసేందుకు ఇంకా సమయం ఉందని అప్పటివరకు పరీక్షలు నిర్వహించవద్దని ప్రభుత్వం కోరింది. దీనిపై APPSC అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

