Wednesday, September 9, 2026
31.8 C
Hyderabad

ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వివరణ

“నా భూమిలో అసాంఘిక కార్యకలాపాలకు ఎటువంటి సంబంధం లేదు”

తెలంగాణలో మొయినాబాద్ మండలం, తోల్కట్ట గ్రామంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి భూమిలో అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకున్నాయనే వార్తలపై ఆయన వివరణ ఇచ్చారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ, ఈ వ్యవహారానికి తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

2018లో తోల్కట్ట గ్రామంలో సర్వే నంబర్ 165 పార్ట్‌లో 10 ఎకరాల 1 గుంట భూమిని కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. అప్పటి నుంచి ఆ భూమి నిర్వహణ బాధ్యతలను తన మేనల్లుడు జ్ఞాన్దేవ్ రెడ్డికి అప్పగించినట్లు చెప్పారు. సదరు భూమిలో ఎటువంటి ఫార్మ్ హౌస్, గెస్ట్ హౌస్ లేవని, కేవలం మామిడి, కొబ్బరి తోట మాత్రమే ఉందని స్పష్టం చేశారు.

తన అనుమతి లేకుండా జ్ఞాన్దేవ్ రెడ్డి, వర్రా రమేష్ కుమార్ రెడ్డికి ఆ తోటను కౌలుకు ఇచ్చిన విషయం నిన్నటి ఘటన అనంతరం మాత్రమే తన దృష్టికి వచ్చిందని తెలిపారు. తరువాత వర్రా రమేష్ కుమార్ రెడ్డి, ఎం. వెంకటపతి రాజుకు తోటను కౌలుకు ఇచ్చినట్లు కూడా తెలుసుకున్నట్లు చెప్పారు. ఈ మొత్తం వ్యవహారం తనకు తెలియకుండానే జరిగిందని, దీనికి తన ప్రమేయం ఏమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు.

నిన్న వార్తలు చూసిన తర్వాత ఈ వ్యవహారంపై స్పష్టత వచ్చింది. తన భూమిలో అసాంఘిక కార్యకలాపాలు జరిగాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో, దీనికి తాను బాధ్యత వహించాల్సిన అవసరం లేదని తెలిపారు. సంఘటన జరిగిన రోజున తాను హైదరాబాద్‌లో లేరని, వరంగల్‌లో ఎల్లమ్మ పండుగ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి తనపై జరుగుతున్న రాజకీయ కుట్రలను ఆయన తీవ్రంగా ఖండించారు. తాను 20 ఏళ్లుగా మచ్చలేని రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్నానని, అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోనని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని, నోటీసుకు సమాధానం ఇస్తానని చెప్పారు. నిరాధార ఆరోపణలతో మీడియా కథనాలు ప్రసారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని తెలిపారు.

Latest News

గాలిమోటర్ కాదు ఎర్ర బస్సే!?|ADUGU TRENDS

సుతిమెత్తగా తోలు సీట్లు, సీటుసీటుకు బుల్లి తెరలు, శార్జింగ్ పాయింట్లు, ఉచితంగా వైఫై, కావాలంటే టిపిని, తాగాలంటే చాయ్, పోవాలంటే ఒకటి, రెండుకు టాయిలెట్లు... సల్లగా పయాణం.. ఇంకేం కావాలె శెప్పుండ్రి? అయితే...

సెప్టెంబర్ 09, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం మాస శివరాత్రి తిధి త్రయోదశి ఉదయం 11.45 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం ఆశ్లేష పగలు 03.40 వరకు ఉపరి మఖ యోగం శివ రాత్రి 11.15 వరకు ఉపరి సిద్ద కరణం వణజి ఉదయం 11.47 వరకు ఉపరి...

రక్షణ వ్యవస్థలే సైబర్ దోపిడీకి ఆయుధాలు!?|EDITORIAL

అసలైన కాపీరైట్ హక్కుదారులు లేదా వారి అధికారిక ప్రతినిధులకే ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసే హక్కు ఉండాలి. అందువల్ల కాపీరైట్ పేరుతో ఎవరైనా వ్యక్తిగతంగా డబ్బులు అడిగితే చెల్లించడం పరిష్కారం కాదు. పోలీసులు, సైబర్...

రూపాయెకే వైద్గ సేవలు!?|ADUGU TRENDS

సంకల్పం ఉండాలె గనీ, యేదైనా సాధించొచ్చు. గట్లనే కొందరు ఉచిత సేవలందిత్తరు. గదానికి సరైన యిలువ ఉండదనుకున్నడో ఏమో గనీ, గీ డాస్కర్ శంకర్ దాస్ రాంచందానీ, ఒక్క రూపాయెకే వైద్గం అందిత్తాండు. గీ...

కొండా కుటుంబానికి కొత్త పరీక్ష!?|EDITORIAL

ఇప్పుడు కొండా కుటుంబం ముందున్న అసలు ప్రశ్న ‘ఎవరి మీద పోరాడాలి?’ అన్నది కాదు.. ‘ఎలా తిరిగి రాజకీయంగా బలపడాలి?’ అనేదే. మౌనం, సమన్వయం, సంస్థాగత పునర్నిర్మాణం ఈ మూడు మార్గాల్లో దేన్ని...

సెప్టెంబర్ 08, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి ద్వాదశి పగలు 01.49 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం పుష్యమి సాయంత్రం 04.55 వరకు ఉపరి ఆశ్లేష యోగం పరిఘ రాత్రి 01.59 వరకు ఉపరి శివ కరణం తైతుల పగలు 01.49 వరకు ఉపరి గరజి రాహుకాలం...

సెప్టెంబర్ 07, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం ఏకాదశి తిధి ఏకాదశి సాయంత్రం 04.03 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం పునర్వసు సాయంత్రం 06.23 వరకు ఉపరి పుష్యమి యోగం వ్యతీపాత ఉదయం 07.46 వరకు ఉపరి వరీయాన్ కరణం బాలవ సాయంత్రం 04.03 వరకు ఉపరి కౌలవ రాహుకాలం...

బర్త్ డే టు బర్తరఫ్!|KONDA FAMILY|CONGRESS|

తారుమారైన కొండా సు‘రేఖ’! 17 రోజుల్లోనే తలకిందులు? ‘చే’జేతులా...చెడిన రాజకీయం ఆగస్టు 19 నుంచి సెప్టెంబరం 3 వరకు మరి తర్వాత వారి దారెటు? కోరి కోరి పదవికి ఎసరు తెచ్చుకోవడమంటే ఇదే! అదీ లండన్ లో ఉన్న...

గుప్త సామ్రాజ్యం – ప్రారంభం మరియు అభివృద్ధి (క్రీ.శ.275-550)|ADUGU DIGITAL MEDIA|HISTORY|COMPITITIVE EXAMS|SPECIAL

గుప్తుల చరిత్రకు సంబంధించిన ఆధారాలు తెలుసుకోవడానికి సాహిత్యం, శాసనాలు మరియు నాణాలు ఉపయోగపడుతున్నాయి. గుప్త సామ్రాజ్యంలోని తొలి రాజులు *మహారాజ* అనే బిరుదును తీసుకోవడం వల్ల వీరు సామంతులుగా పాలించారని తెలుస్తుంది. కొంతమంది...

డాక్టర్ నెట్ ఇండియా-వైద్గం ఫ్రీ!?|ADUGU TRENDS

ఏదన్నా రోగమొత్తే అయిపాయె, ఆగమాగమైతం. యాడికిపోవాల్నో తెల్వదు. ఎంత కర్సైతదో తెల్వదు. ఇగ గిదే సందని, పైసలు గుంజుడు, పానం తీసుడు గా ప్రైవేట్ దవాఖాన్లల్ల పనైపాయె. పానం పోతదో, నిలుత్తదో కనీ,...

అధ్యాపకా! అభివందనం!!|EDITORIAL

నాణ్యమైన విద్య, సమర్థవంతమైన ఉపాధ్యాయ శిక్షణ, పరిశోధనకు ప్రోత్సాహం, పాఠశాలల్లో మౌలిక వసతులు, ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు కల్పించడమే రాధాకృష్ణన్‌కు నిజమైన నివాళి. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా మారుతున్న నేటి ప్రపంచంలో...

ఈ రోజు/ వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 06 నుండి సెప్టెంబర్ 12 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త ఆలోచనలు మీలో ఉత్సాహాన్ని పెంచుతాయి. ప్రారంభించిన పనులను మధ్యలో వదిలిపెట్టకుండా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగంలో మీ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News