Wednesday, June 10, 2026
25.8 C
Hyderabad

గింతకంటే సిగ్గుతప్పిన ముచ్చట ఇంకోటి ఉంటాది!?|ADUGU TRENDS

గిది యింటే తల్కాయె యేడ పెట్టుకోవాల్నో తెల్వదు! ఇగ సూత్తెనైతే గీ దేశంల పుట్టిన పతి ఒక్కలూ సిగ్గుతోని సచ్చిపోవాలె? గదేందో చెప్త ఇనుండ్లి.

గదే గా దిల్లీ పక్కన గుర్గాం అనే ఊరుంటది. దిల్లీకి గావల్సిన పాలు, పెరుగు, కాయగూరలన్నీ గానుంచే పోతయి. కూలోల్లు గూడ గీ నుంచే పోతరు. ఇగ గర్గాం లేకుంటే దిల్లీ లేనట్లే లెక్క! గుర్గాం కూలోడు కదల్కపోతే, దిల్లీల యే పొయ్యిల, పిల్లి గూడ లేవది.

గా గుర్గాంల సోమారం పొద్దుపొద్దగాల్నె… గా తెల్ల తోలోల్లు ఒకలిద్దరు మనోల్లతోని కల్సి ముర్కి పని చేసుకుంట కన్పించిండ్లు. సూటు, బూటేసుకున్నరు. మొకానికి గుడ్డలు కట్టిండ్లు. సేతులకు లబ్బర్లసొంటివేవో తొడుక్కుండ్లు. గిదేందని సూత్తె… గా సడక్ మీద పడ్డ సెత్త సెదారాన్ని యేరుతాండ్లు. ఎత్తేస్తాండ్లు. ముర్కి కాలువల్ని సాఫ్ జేస్తాండ్లు. ఇగ మన నారదమునులు… గదే, గా యిలేకర్లంటం గద. గవాళ్ళు ఊకుంటారు. ఇగ యీడియోలు దీసిండ్లు. గా పన్లు జేస్తున్నోలల్ల గా పొల్లను పట్టుకున్నరు. యెవలు మీరు? యేం జేస్తాండ్లు? గిదంతా ఎందుకు సాఫ్ జేస్తాండ్లు? అని దబ్బ దబ్బ అడిగిండ్లు. గప్పుడు గా ‘మటిల్డా’ యనే గా పొల్ల యేం సెప్పిందంటే… ‘మాది ప్రాన్స్ దేసం. నేను తొమ్మిదేండ్ల కానించి గీడ్నే గీ బారతదేసంల ఉంటున్న. ఇంకో రెండేండ్లుంట. గీ దేసం మస్తుగుంటది. గీ దేసమంటే నాకెంతో పానం. ఇట్టం. పేమ. అయితే గాడీడ కన్పించే గీ సెత్తే మస్తు సికాకు పెడ్తాంది. ముర్కి కాల్వలల్ల అంతా ముర్కే. నీళ్ళేడపోతానయి? యిశారంగుంది. యికారమన్పిస్తాంది.’ ఇగ గిదంత పనిగాదని ‘నేను మా దేసపోల్లను కూడగట్టిన. గీ ఊరోల్లు ఒకలిద్దరు ఒచ్చిండ్లు. గివన్నీ సాపు జేస్తానం. గిదంతా సాపు అయ్యేదాన్క సేత్తనే ఉంటమ’ని సెప్పింది. గాడికి ఊకోకుండ.. ‘నా గుర్గాం నాకు గర్వం, నా బాధ్యత’, ‘మీ యీది, మీ బాధ్యత’, ‘సెత్త వద్దు, మరిన్ని చెట్లు’ గావాల్నని రాసిపెట్టిన ‘అట్టముక్కలు’ పట్టుకొని మంచిగ యీడియోలకి, పోటోలకి పోజులిచ్చిండ్లు.

ఇగ కన్పించే గా సెత్తను, గావాల్లు పని జేసేది. గా పొల్ల మాట్లాంది, ‘అట్టముక్కలు’ పట్టకున్నది.. అంతా కలె గలిపి ఓ యీడియో జేసి, పోటోలు దీసి, గా ఎఎన్ఐ వోల్లు.. గ వాల్ల పేజీతోబాటు, ఎక్స్ కాతాల పెట్టిండ్లు. సూత్తాంటే లచ్చలచ్చల మంది సూత్తనే ఉండ్లు. సూసినోడు సూసి ఊకోక, ఏదో కామెంట్లు పెట్టబట్టిరి. ఒకగడనె గద.. ‘గీ గుర్గాంల మున్సిపాల్టోల్ల సెత్తదీసే పని సెత్తసెత్తగ ఉన్నద’న్నడు. మరొకడనె గద.. ‘గిది మన పబుత్వానికి, సడక్ ల మీద సెత్తేసే, పతి బారతీయునికి సిగ్గుసేట’న్నడు. ఇంకొకడనె గద.. ‘గిది సర్కారోనికి, మున్సిపాల్టోనికి ముక్కు మీద గుద్దిన’ట్టున్నదన్నడు. యింకో యింకొకడు అనె గద… ‘ఇది మన సెంప మీద సాచి కొట్టిన’టున్నదన్నడు. మరో ఇంకొకడు అనెగద..‘యెహె గిదీనికంటే సిగ్గుసేటు మరోటి లేదన్న’డు.

గదేదో దేసం గాని దేసం నుంచి వచ్చినోల్లకున్న ఇంగితం మనకు లేకపాయె. మనం మంచిగ ఉండాలనుకుంటం గనీ, మన సుట్టుముట్టు గూడ మంచిగుండాలని అనుకుంటానమా? యేడబడితే ఆడ సెత్తేత్తానం. అయిపాయె! మన సిగ్గు పాయె! మన దేసం పరువు పోయె!!

ఇగ గింత కంటే సిగ్గుదప్పిన ముచ్చట ఉంటాది. సడక్ ల మీద సెత్తేసేటోల్లు ఎవలైనా సిగ్గుపడాలె. ఇగ సెత్త ఎయ్యనే ఎయ్యమని పతిన బూనాలె. పతి ఒక్కలం పాటించాలె. పక్కోనికి సెప్పాలె. అందరికీ యినిపిస్తాందా?

Latest News

శెట్టు కిందే ఊరు!|ADUGU TRENDS

ఎండా కాలమొస్తే మనమేం శేత్తానం? ప్యాన్లు, ప్రిజ్జీలు, కూలర్లు, ఏసీలను సిద్ధం చేసుకుంటానం. మండే కాలం వత్తాందనంగనే గవాటన్నింటినీ మరమ్మతులు చేసి పెట్టుకుంటానం. ఎండ మండుతనే ఉండె, కరెంటు కాల్తనే ఉండె. ఇగ...

ట్రంప్ కు బోస్టన్ తీర్పు దెబ్బ!|EDITORIAL

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలస విధానాలపై, హెచ్-1బీ వీసాలపై విధించిన లక్ష డాలర్ల ఫీజును బోస్టన్ ఫెడరల్ కోర్టు చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఆ తీర్పు భారతీయ వృత్తి నిపుణులకు తక్షణ ఊరటనిచ్చినా, అంతిమ...

జూన్ 10-బుధవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ దశమి రాత్రి 07.41 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం రేవతి రాత్రి తెల్ల 04.00 వరకు ఉపరి అశ్విని యోగం సౌభాగ్య రాత్రి 12.20 వరకు ఉపరి శోభ కరణం వణజి ఉదయం...

సేఫ్టీ డోర్లు!|ADUGU TRENDS

భద్రతకే భద్రత లేని రోజులియి.! మరైతే మనమెంత భద్రంగుండాలె? మనమెంత జాగర్త పడ్డా దోసేటోడు కొత్త కొత్త దారుల్ల దోస్తనే ఉన్నడు. కట్టం లేకుండా మన సొక్కం మన గాబుల్ల, జేబుల్ల నిండాలె....

దేశానికి ముప్పుగా డ్రగ్స్ దందా!|EDITORIAL

యువతను మాదక ద్రవ్యాల మహమ్మారి నుంచి కాపాడటం కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు. అది సమాజం మొత్తం నిర్వర్తించాల్సిన సామూహిక కర్తవ్యం. నేడు అప్రమత్తంగా వ్యవహరిస్తేనే రేపటి తరాన్ని ఆరోగ్యవంతమైన, సురక్షితమైన...

09-06-2026, మంగళవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 సంకల్ప తిథి: కృష్ణ-నవమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-నవమి తిథి : కృష్ణ-నవమి తె. ఝా 2:35 వరకు...

08-06-2026, సోమవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 సంకల్ప తిథి: కృష్ణ-అష్టమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-అష్టమి తిథి : కృష్ణ-అష్టమి తె. ఝా 3:24 వరకు...

ప్రొఫెసర్ వ్యాఖ్యలు-పోస్టు మార్టం|JANASENA|PROF.NAGESHWAR|PSPK

స్థానిక బీజేపీ నాయకత్వం నుంచి కాని పనిని జాతీయ పార్టీ నెత్తికెత్తుకుందా? అందుకే జన సేనాని పవన్ ని తెలంగాణపైకి ఉసి గొల్పిందా? ఈ స్కెచ్ లో భాగంగానే జగన్ ను అరెస్ట్...

మందా? ‘మజా’కా!?|ADUGU TRENDS

ఎనకటికి ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే, సుట్టకు అగ్గి కావాలని మరొకడేడిసిండట! గీ ముచ్చట గట్లనే ఉన్నది. రోజులు మారినా, గా సామెతల అర్థాలు మారట్లేదు. గీ సామెతసొంటి ముచ్చటే గా చిత్తూరు జిల్లా...

ఆర్థిక మోసాలకు అడ్డుకట్టలే లేవా!?|EDITORIAL

చిన్న మోసగాళ్లనే కాదు, పెద్ద కార్పొరేట్ సంస్థలు, ప్రభావశీల వ్యక్తులు చేసిన అక్రమాలపై కూడా సమానంగా చర్యలు తీసుకోవాలి. చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకం ఏర్పడినప్పుడే ఆర్థిక క్రమశిక్షణ బలపడుతుంది. లేకపోతే...

ఈ రోజు/ వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 07 నుండి జూన్ 13 వరకు వారఫలాలు: మేషం: ఈ వారం కుటుంబ వ్యవహారాల్లో కొంత ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సౌహార్దంగా వ్యవహరించడం మంచిది. వ్యాపారవేత్తలు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా...

రెండోసారి రాజ్యసభకు సానా…|AP|TDP|RAJYASABHA|SANA SATHISH BABU

బాబుకు ధన్యవాదాలు తెలిపిన సతీష్ బాబు|CHANDRABABU|CM రాష్ట్ర రాజకీయాల్లో, సామాజిక సేవలో, క్రీడా రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, తెలుగుదేశం పార్టీ నేత సానా సతీష్ బాబు రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News