Friday, August 28, 2026
30.6 C
Hyderabad

మనసులతో పాటే కుక్కలు తింటానయి!?|ADUGU TRENDS

కుక్కకు కూడా ఓ రోజొస్తదన్నట్లు.. ఇగిప్పుడు కుక్కల రోజులొచ్చినయి.! కుక్కను గ్రామ సింహం అంటరు. ఇగిప్పుడు ఇంటింటికీ సింహమైందనుకోండ్లి! కుక్కలను గిప్పుడు మనుసుల కంటే మనుసులే మంచిగ సూసుకుంటాండ్లు. పాలు, పెరుగు, పండ్లు, డ్రైఫ్రూట్సు తినబెట్టి, పరుపుల్ల పండబెడ్తాండ్లు. కార్లే కాదుల్లా… ఏకంగా యిమానాలల్లో తిప్పుతాండ్రు. గందుకేనేమో మన హైదరబాద్ల ఉండే శంషాబాద్ యిమానాశ్రయంల కుక్కలు కూడా మనుసులతోటి కలిసే తింటానయి!? ఇదేం ఇచ్చెంత్రం? అనుకుంటాండ్రా? సూస్తే మీరే ఆశీరపోతరు.

యిమానాశ్రయాలల్ల మనుసులు కూసునేటందుకు, తినేటందుకు యేర్వేరు యేర్పాట్లుంటయి. ఇగ గా మనుసులు కూసుని తినే సోటికే ఓ కుక్క వచ్చింది. ఓ దిక్కు మనసులు తింటుంటే, మరోదిక్కు ఏకంగా టేబులెక్కి, మనసులు తిని పోయినంక మిగిలిన బొచ్చెలను నాక్కుంట ఉన్నది. ఇగ గదాన్ని సూసినోడు లేడు. కొట్టినోడు లేడు. ఎవలి పనిల వాళ్ళున్నరు. ఇగ గదాన్ని ఓకాయినె ఈడియ తీసి, నెట్టింట్ల పెట్టిండు. ఇగ గది సూసినోల్లు, గా యిమానాశ్రయపోల్లను కుక్కు తిట్లు తిడుతాండ్రు.!? గా కుక్క యిమానాశ్రయంల మనసులతో సమానమేనన్నట్లా? లేకపోతే గీ మనుసులే గా….. సమానమా? ఎవలికి ఎరుక?

Latest News

‘రాఖీ’తో ‘రాజీ’…!?|RAKSHA BANDHAN|KONDA SUREKHA|CM|REVANTH REDDY

మంత్రి పదవికి ‘రక్షా’ బంధన్! కొండా సురేఖ వ్యూహం ఫలించేనా? ‘రక్షాబంధనం’ సురేఖక్క మంత్రి పదవిని రక్షిస్తుందా? ‘రాఖీ’తో ‘రాజీ’ కుదురుతుందా? మంత్రి కొండా సురేఖ వ్యూహం ఫలిస్తుందా? ఏం కానుంది? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్...

తమ్ముడికి జీవితాన్నే బహమతిగా ఇచ్చిన అక్క!?|ADUGU TRENDS

రాఖీల పున్నం పండగను అన్నా శెల్లెల్లు, అక్కాతమ్ముళ్ల మద్దెల పేమానురాగాలకు, రచ్చణకు పతీకగా జరుపుకుంటరు. రాఖీ అంటే రచ్చణ కవచం. రచ్చా సూత్రం. గా అన్నాతమ్ముల్లకు ఆపదలు రాకుండా, గవాల్లు ఆయురారోగ్యాలతో కలకాలం...

హిమాలయాల్లో మహా విలయం!?|EDITORIAL

ఇంతటి విపత్తు నుంచి భారత్‌ పాఠాలు నేర్చుకోవాలి. హిమాలయాల్లో విచ్చలవిడిగా రహదారులు, హైడ్రోపవర్‌ ప్రాజెక్టులు, పర్యాటక నిర్మాణాలు చేపడుతూ పర్వతాల సహజ సమతౌల్యాన్ని దెబ్బతీస్తే ప్రమాదాల సంఖ్యేకాదు, వాటి తీవ్రతా పెరుగుతుంది. వాతావరణ...

ఆగస్టు 28, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం రాఖీ పూర్ణిమ జంధ్యాల పూర్ణిమ తిధి పౌర్ణమి ఉదయం 08.57 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం శతభిషం రాత్రి తెల్ల 03.43 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం అతిగండ ఉదయం 08.57 వరకు ఉపరి సుకర్మ కరణం బవ...

హద్దుల్లేని ముద్దురణం!?|ADUGU TRENDS

ము ముద్దంటే శేదా? అంటే ఎవరికి శేదు చెప్పండి? గందుకే కాకిపిల్ల కాకికి ముద్దన్నరు. తల్లికి పిల్లంటే ముద్దు. పేమికులకు ఒకలంటే ఇంకొకలికి ముద్దు. గా ముద్దు ముచ్చట ఒకామె గీ ఇధంగా...

ఆర్థిక పతనం దిశగా అమెరికా ఫస్ట్ నినాదం!?|EDITORIAL

‘అమెరికా ఫస్ట్’ అంటే ప్రపంచం నుంచి అమెరికా దూరం కావడం కాదు. అమెరికా ఆర్థిక ప్రయోజనాలను కాపాడుతూనే ప్రపంచ వాణిజ్యం, శాంతి, స్థిరత్వంతో సమన్వయం సాధించాలి. లేకపోతే గొప్ప దేశాన్ని నిర్మించాలన్న నినాదమే...

ఆగస్టు 27, గురువారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తిధి చతుర్దశి ఉదయం 08.05 వరకు ఉపరి పొర్ణమి నక్షత్రం ధనిష్ఠ రాత్రి 02.38 వరకు ఉపరి శతభిషం యోగం శోభ ఉదయం 09.20 వరకు ఉపరి అతిగండ కరణం వణజి ఉదయం 08.05 వరకు ఉపరి భద్ర రాహుకాలం...

పనికి ఫార్చునర్ కారులో సఫాయి!?|ADUGU TRENDS

రోజులు మస్తుగ మారిపోతున్నయి. పేదా బక్క, బిక్కిబీదా తేడా లేకుండా పోతాంది. ఎవ్వలైనా హమ్ కిసీ సే కం నహీ అంటాండ్రు. గట్లనే గా సఫాయి కూడా అంటా0డు. గా సఫాయి రోజూ...

ఆర్థిక యుద్ధం అణుబాంబు కన్నా డేంజర్!?|EDITORIAL

యుద్ధానికి ఆయుధాలు అవసరం. ఆర్థిక యుద్ధానికి ప్రపంచ సహకారం అవసరం. అమెరికా ఆ సహకారాన్ని ఎంతవరకు సాధించగలదన్నదే అసలు పరీక్ష. ఇరాన్‌ను బలహీనపరచాలన్న అమెరికా ప్రయత్నం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బలహీనపరచకుండా జాగ్రత్తపడాల్సిన...

ఆగస్టు 26, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తిధి త్రయోదశి ఉదయం 06.53 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం శ్రవణ రాత్రి 01.03 వరకు ఉపరి ధనిష్ఠ యోగం సౌభాగ్య ఉదయం 09.20 వరకు ఉపరి శోభ కరణం తైతుల ఉదయం 06.53 వరకు ఉపరి గరజి రాహుకాలం...

పార్టీ పెడితే పోలా!|ADUGU EXCLUSIVE|KONDA FAMILY|NEW PARTY

అడుగు ఎక్స్ క్లూజివ్ కొండా దంపతుల కొత్త పార్టీ? పాత పార్టీల్లో పొసగడం కష్టమే! కొత్త పార్టీతో ప్రయాణం స్పష్టమే! లక్ష్యం బీసీ సామాజిక న్యాయమే! ఇప్పటికే ప్రధాన పార్టీల్లో0చి బయటకు  కాంగ్రెస్ కాదంటే బీజేపీ ఛాన్స్? సిద్ధాంత రీత్యా కమలంలోనూ కష్టమే ఇప్పటికే...

పూర్వ ప్రేమికులకు.. అపూర్వ ప్రేమ రోజు!?|ADUGU TRENDS

యినడానికి గిది ఇబ్బందిగనే ఉన్నా, ఇది నిజమే మరి! కాకపోతే గిది మన దేసంల కాదు. పరాయి దేశంల. ఎవలైనా వయసొచ్చినంక పేమల పడ్తరు. అందరూ గా పేమల్ని గెలపించుకోలేరు. ఐటెంక వేరెవ్వల్నో...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News