Thursday, August 6, 2026
28.2 C
Hyderabad

మహిళలకు అండగా ఐద్వా!|EDITORIAL

మహిళలు అన్ని రంగాల్లో విప్లవాత్మక విజయాలు సాధిస్తున్న ఈ కాలంలోనూ, భారత మహిళల స్థితి పూర్తిగా మారి, ఆ స్థితికి చేరిందని ధైర్యంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. అంతరిక్షం నుంచి రాజకీయాల వరకూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా, సాధారణ మహిళలు భద్రత, గౌరవం, స్వేచ్ఛ కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నారు. నేటికీ మహిళలు ఒంటరిగా ప్రయాణించలేని పరిస్థితులు, స్వేచ్ఛగా జీవించలేని దుస్థితి కొనసాగుతూనే ఉన్నాయి. ఇది సమాజం సాధించిన అభివృద్ధికి పెద్ద ప్రశ్న మాత్రమే కాదు. పెను సవాల్ కూడా.

సమాజంలో పురుషాధిక్యత ఇప్పటికీ బలంగా కొనసాగుతోంది. పనిప్రదేశాలు, అన్ని రంగాల్లో పురుషుల పెత్తనమే కనిపిస్తోంది. మహిళలకు అధికారం దక్కినట్టు కనిపిస్తున్నా, అది వాస్తవంలో ఉండటం లేదు. పాలనలో మహిళలు ఉన్నా, మహిళలపై జరుగుతున్న హింసను అడ్డుకునే స్థాయికి ఆ అధికారం ఉపయోగపడడం లేదు. మమతా బెనర్జీ లాంటి మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న పశ్చిమ బెంగాల్‌లోనూ నిత్యం అత్యాచారాలు జరుగుతున్నాయి. మహిళల భద్రతపై స్పష్టమైన హామీ ఇవ్వలేని పరిస్థితి అక్కడ కూడా ఉంది. ఇది మహిళలకు అధికారం ఇచ్చినంత మాత్రాన సమస్యలు పరిష్కారమవ్వవని, ఆ అధికారాన్ని ప్రజల తరఫున వినియోగించే దృక్పథం కీలకమని స్పష్టం చేస్తోంది. మహిళలు, చిన్నపిల్లలను గౌరవించే సమాజం ఏర్పడే వరకు, వారికి సంపూర్ణ రక్షణ కల్పించే వరకు ఈ పోరాటం ఆగకూడదు.

ఈ నేపథ్యంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) అఖిల భారత 14వ మహాసభలు జనవరి 24-28 తేదీలలో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. 1981లో మార్చిలో చెన్నై వేదికగా ఐద్వా స్థాపించబడింది. దేశంలో ప్రజాస్వామ్యం, సమానత్వం, మహిళా విముక్తి కోసం పోరాడే ఈ సంస్థకు 23 రాష్ట్రాలలో 1.1 కోట్లకు పైగా సభ్యులు ఉన్నారు. ఇది సీపీఐఎం కి అనుబంధంగా పనిచేస్తున్నప్పటికీ స్వతంత్ర మహిళా ఉద్యమ వేదికగా గుర్తింపు పొందింది. ప్రధానంగా గ్రామీణ, పట్టణ పేద మహిళలకు ప్రాతినిధ్యం వహిస్తోంది. గృహ హింస, వరకట్నం, అత్యాచారాలు, రాజకీయ అణచివేత వంటి సమస్యలపై ఐద్వా నిరంతరం పోరాడుతుంది. అణగారిన వర్గాల మహిళల కోసం గ్రామస్థాయి నుండి జాతీయ స్థాయి వరకు పనిచేస్తున్న అతిపెద్ద మహిళా సంస్థలలో ఐద్వా ఒకటి.

తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకీ చేతబట్టి ముందుకు సాగిన రైతు మహిళల నేలలో జరగనున్న మహాసభలు మహిళా ఉద్యమానికి దిశానిర్దేశం చేసే వేదికలుగా మారాలి. ఈ సందర్భంగా ఐద్వా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ‘మనువాద’ నినాదాన్ని నిర్మూలించే భావనను సగటు మహిళకు అర్థమయ్యేలా వివరించాలి. ఇది కేవలం లెఫ్ట్ పార్టీల మహిళా సంఘం అన్న ముద్రను చెరిపేసి, అన్ని వర్గాల మహిళలకు అండగా నిలవాలి.

‘మహిళలంతా ఒక్కటే’ అన్న సమభావన ఇంకా పూర్తిగా రాలేదు. అందుకే మహిళల గొంతు మరింత బలంగా వినిపించాల్సిన అవసరం ఉంది. ఇంట్లోనే కాదు, సమాజంలోనూ కలసికట్టుగా నినదించే స్థాయికి రావాలి. అసంఘటిత రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఐద్వా చేసిన పోరాటాలు ప్రేరణగా నిలవాలి.

సోషల్ మీడియా విస్తరణతో మహిళల వ్యక్తిత్వ హననం మరింతగా పెరిగింది. అశ్లీలత, ట్రోలింగ్, వేధింపులు సాధారణమయ్యాయి. సినిమాల్లో మహిళలను అవమానకరంగా చూపించే సన్నివేశాలపై, సోషల్ మీడియాలో మహిళల హక్కుల దుర్వినియోగంపై ఐద్వా స్పష్టమైన పోరాటం చేయాలి. సమస్య ఏదైనా, మహిళల తరఫున ఐద్వా నిలబడుతుందన్న నమ్మకం కలగాలి.

33 శాతం మహిళా రాజకీయ రిజర్వేషన్లు హక్కుగా తక్షణం అమల్లోకి రావడానికి ఐద్వా నాయకత్వం వహించాలి. పార్లమెంటు, శాసనసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి. కానీ అది కేవలం కార్పొరేట్, ఉన్నత వర్గ మహిళలకే పరిమితం కాకుండా, నిమ్న, బడుగు, బలహీన వర్గాల మహిళల చేతికి అధికారం చేరేలా పోరాటం సాగాలి.

స్త్రీ విముక్తి సమాజ విముక్తితో ముడిపడి ఉందన్న అవగాహన పెరగాలి. మహిళను వంటగదికి, సంతాన ఉత్పత్తికే పరిమితం చేసే ఈ వ్యవస్థపై తిరుగుబాటు రావాలి. అభ్యుదయ ఆలోచనలతో ప్రజా ఉద్యమాలను నిర్మిస్తూ, ఐద్వా తన పరిధిని విస్తరించి ప్రతి మహిళకు ఒక బలమైన గొడుగుగా మారాల్సిన అవసరం ఉంది. అదే మహిళా శక్తికి నిజమైన చిరునామా అవుతుంది.

Latest News

మౌర్య పూర్వయుగం|ADUGU SPECIAL|HISTORY|COMPITITIVE EXAMS

క్రీ.పూ.650 నుండి క్రీ.పూ.250 మధ్య ఉన్న కాలాన్ని మౌర్యుల పూర్వయుగం లేదా బుద్ధుని యుగం లేదా షోడశ మహాజనపాదాల యుగం అని అంటారు. ఈ కాలంలో గౌతమ బుద్ధుడు ముఖ్య పురుషుడు కాబట్టి...

సంయమనం కోల్పోతే రాజకీయ సంక్షోభమే!?|EDITORIAL

వ్యక్తిగత విమర్శలు తాత్కాలిక రాజకీయ ప్రచారానికి ఉపయోగపడవచ్చు. కానీ, దీర్ఘకాలంలో నాయకుడి విశ్వసనీయతను దెబ్బతీస్తాయి. రాజకీయ వారసత్వం కేవలం కుటుంబ నేపథ్యంతోనే రాదు, హుందాతనంతో కూడిన నాయకత్వంతోనే నిలుస్తుంది. మాటలతో సంపాదించేది ప్రచారం...

ఆగస్టు 06, గురువారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి అష్టమి మధ్యాహ్నం 03.39 వరకు ఉపరి నవమి నక్షత్రం భరణి సాయంత్రం 06.11 వరకు ఉపరి కృత్తిక యోగం గండ మధ్యాహ్నం 02.03 వరకు ఉపరి వృద్ధి కరణం కౌలవ మధ్యాహ్నం 03.39వరకు ఉపరి తైతుల రాహుకాలం...

తింటే గీ అవ్వ శేతి గారెలే తినాలె!?|ADUGU TRENDS

ఎన్కటికి... యింటే భారతమే యినాలె... తింటే గారెలే తినాలన్నరు. కనీ, ఇగిప్పుడైతే, తింటే గింటే గీ అవ్వ శేతి గారెలే తినాల్నని తిన్నోల్లంటాండ్రు. మరి, గా గారెల ముచ్చటేందో సూద్దాం పదండ్రి. ములుగు జిల్ల...

బీజేపీ-ఆత్మపరిశీలనకు సరైన సమయం! EDITORIAL

ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నిక ఒక సందేశం! ప్రతి ఉప ఎన్నిక ఒక హెచ్చరిక!! ప్రతి ప్రజా ఉద్యమం పాలకుల పాలనకు అద్దం. ఇప్పటిదాకా అప్రతిహతంగా అధికారం చెలాయిస్తున్న బీజేపీ అనూహ్యంగా ఈ మూడింటినీ...

ఆగస్టు 05 బుధవారం 2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, దక్షిణాయణం, గ్రీష్మ ఋతువు , ఆషాఢ మాసము-కృష్ణపక్షం తిథి కృష్ణ-సప్తమి ఈ రోజు (05) రాత్రి 8:42 వరకు, తదుపరి కృష్ణ-అష్టమి నక్షత్రము అశ్విని ఈ రోజు (05) రాత్రి 9:18 వరకు,...

ఇగ పోను అన్ లాక్ శేసుడు అల్కన!!?|ADUGU TRENDS

ఇగో గిప్పుడు గా పోన్ల వాడుడు అందరికీ అల్కగైపోయింది. సంటి పోరగాండ్ల కానుంచి, పండు ముసలోల్ల దాకా పోను వాడుతనే ఉన్నరు. ఇగ గీ వాడుట్ల అప్పుడప్పుడు గా పోన్ల లాకుల నెంబర్ల...

ఆగస్టు 04, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి రాత్రి 07.06 వరకు ఉపరి సప్తమి నక్షత్రం రేవతి రాత్రి 08.09 వరకు ఉపరి అశ్విని యోగం ధృతి రాత్రి 06.53 వరకు ఉపరి శూల కరణం గరజి ఉదయం 07.45...

గీ అవుడియ అదిరింది!?|ADUGU TRENDS

ఒక అవుడియ జీవితాన్నే మారుస్తదంటే గిదేనేమో మరి! ఏదైనా ఆలోశన శేత్తే, ఏదో ఒకటి జర్గుతది. లేకపోతే ఊదు కాలది పిల్లి గూడ లేవది? గది సరే గనీ గా పిల్లగాడు శేసిందేంటో...

అధికారం రాగానే హామీలు హుష్ కాకీ!?

ప్రజలు ఇప్పుడు రాజకీయ పార్టీల ప్రకటనలను కాకుండా వాటి పనితీరును కొలుస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కాలపరిమితి నిర్ణయించి, వాటి అమలుపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయడం...

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News