Trending News
Friday, March 6, 2026
35.9 C
Hyderabad
Trending News

శివ నామస్మరణతో మారుమ్రోగిన పాలకుర్తి|PALAKURTHI|SHIVARATRI

భక్తుల స్మరణతో పులకించిన సోమన్న గుట్ట

ఘనంగా సోమన్న కళ్యాణం

పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే యశస్విని

సోమన్నను దర్శించుకున్న పలువురు ప్రముఖులు

జనగామ జిల్లా, పాలకుర్తిలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తి పారవశ్యంతో కళకళలాడింది. శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే శివనామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ప్రధాన వీధులు, రాజీవ్ చౌరస్తా నుంచి గుడివాడ చౌరస్తా వరకు రాత్రంతా భక్తుల రద్దీ కనిపించింది. గ్రామీణ ప్రాంతాల నుంచి మాత్రమే కాకుండా సమీప జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆదివారం ఒక్కరోజే సుమారు మూడు లక్షల మంది స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు చెప్తున్నారు. కల్యాణోత్సవాన్ని లక్షకు పైగా భక్తులు ప్రత్యక్షంగా తిలకించారు.

భక్తుల రద్దీ కారణంగా దర్శనానికి సుమారు ఎనిమిది గంటల సమయం పట్టింది. ఆలయ ఈఓ భాగం లక్ష్మీ ప్రసన్న, ఇతర ఆలయ అధికారులు గత మూడు రోజుల నుండి ఏర్పాట్లు మంచి ఫలితాలు ఇచ్చాయి. కానీ భక్తుల రద్దీ పెరగడంతో ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలతో వచ్చిన తల్లులు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాగునీరు, క్యూలైన్ల నిర్వహణ, పార్కింగ్ వంటి అంశాల్లో సరైన ఏర్పాట్లు చేయడంలో అధికార యంత్రాంగం సఫలీకృతమైందని కొందరు భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్ని చేసినా… భక్తులలో ఉత్సాహం మాత్రం తగ్గలేదు. “ఓం నమశ్శివాయ” నినాదాలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయాయి.

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం స్వామివారి కల్యాణోత్సవాన్ని ఆదివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రధాన అర్చకులు దేవగిరి లక్ష్మన్న శర్మ, అర్చకులు డివిఆర్ శర్మ, అనిల్ కుమార్ శర్మ, మత్తగజం నాగరాజు శర్మ, నాగరాజు శర్మ, సునీల్ శర్మ, సంతోష్ శర్మ, శ్యామ్ శర్మ, తదితర అర్చకులు శాస్త్రోక్తంగా కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో ఆలయం రాత్రంతా కిటకిటలాడగా, భద్రతా పరంగా డిసిపి రాజమహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో ఏసిపి నర్సయ్య, సీఐ జానకిరామ్ రెడ్డి, ఎస్సైలు,తదితర సిబ్బంది, 150 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

మహా అన్నదానం

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి సహకారంతో పాలకుర్తిలో 10 వేల మందికి మహా అన్నదానం నిర్వహించారు. క్యాంపు కార్యాలయం ఎదురుగా ఉన్న విశాలమైన ప్రాంగణంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరంతరాయంగా అన్నప్రసాదం పంపిణీ చేశారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల అధ్యక్షుడు కుమారస్వామి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించగా భారీ ఎత్తున భక్తులు స్వీకరించారు. పలువురు దాతలు వాటర్ బాటిల్స్, మజ్జిగ ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేసి సేవాభావాన్ని చాటుకున్నారు. మొత్తంగా మహాశివరాత్రి సందర్భంగా పాలకుర్తి ఆధ్యాత్మిక క్షేత్రంగా మారి భక్తి భావంతో కళకళలాడింది.

Latest News

పురుగుల బెడదకు.. బెల్లం పానకం శిట్కా!?|ADUGU TRENDS

పంటలకు పట్టే పురుగులు రైతులకు శాపంగ మారుతానయి. ఇగ గవాటిని సంపడానికి పురుగుల మందులు కొట్టాలె. కర్సు బాగైతది. మల్ల గా మందులతోటి పురుగులు సత్తలేవు. పంటల దిగుబడొత్తలేదు. ఎరువులు, పురుగుల మందులెక్కువై...

మూసీ ప్రక్షాళనపై ముసురుకుంటున్న వివాదాలు!|EDITORIAL

అభివృద్ధి పథకాలు ప్రజావసరాలు తీర్చడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయా? అసలా పథకాలు ప్రజల కోసమే అమలవుతున్నాయా? పేదలు, అట్టడుగు వర్గాలు నివసించే ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులు తరచూ నిర్వాసిత సమస్యలకు...

06-03-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి తదియ సాయంత్రం 05.20 వరకు ఉపరి చవితి నక్షత్రం హస్త ఉదయం 09.15 వరకు ఉపరి చిత్త యోగం గండ ఉదయం 07.05 వరకు ఉపరి వృద్ధి కరణం భద్ర సాయంత్రం 05.22...

ఓలి రంగుల్లెక్క మెరపకాయెల రాసులు!?|ADUGU TRENDS

మెరపకాయెను కూడ కూరగాయల్లెక్కనే పండిత్తరు. మనం తినే బువ్వకు కారం, రుసిని ఇత్తది. గిదీన్ని మన తెలంగాణ, ఏపీల్నే గదేనుల్ల.. గుంటూరు, వరంగల్ ల ఇరగమరగ పండిత్తరు. గీ మెరపకాయెల ఉండే 'క్యాప్సైసిన్'...

స్వయం సమృద్ధే ఈ సంక్షోభానికి విరుగుడు!|EDITORIAL

వరుస యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. కరోనా మొత్తం భూమినే అతలాకుతలం చేస్తే, ఇప్పుడు మధ్యప్రాచ్యంలో యుద్ధాలు, ఉద్రిక్తతల వల్ల మరోసారి చమురు సంక్షోభం ముంచుకొచ్చింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యం...

05-03-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి విదియ సాయంత్రం 04.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఉత్తర ఉదయం 08.11 వరకు ఉపరి హస్త యోగం శుల ఉదయం 07.49 వరకు ఉపరి గండ కరణం గరజి సాయంత్రం 04.39...

బర్నర్ల మురికిని తీసే ఇకమతు!?|ADUGU TRENDS

మన ఆడోల్లు ఎంత ఇకమతులు పడ్డా అరవై పది దినాలకు గా గ్యాస్ స్టౌ బర్నర్లు మురికి పడతనే ఉంటయి. గ వాటిని కడగాల్నంటే మస్తు తిప్పలైతది. అల్కగ గా బర్నర్ల మురికిని...

హార్ముజ్ జలసంధి ఆర్థిక సంక్షోభంలో ప్రపంచం!|EDITORIAL

ఇరాన్–అమెరికా–ఇజ్రాయిల్ మధ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అనిశ్చితి అంచులపై నిలిపింది. ఇది కేవలం యుద్ధ దేశాలకే పరిమితం కాదు. ప్రపంచ ఇంధన భద్రతకు కీలక నాడి హార్ముజ్ జలసంధి చుట్టూ ముప్పు...

04-03-2026 బుధవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి బ.పాడ్యమి సాయంత్రం 04.29 వరకు ఉపరి విదియ నక్షత్రం పుబ్బ ఉదయం 07.30 వరకు ఉపరి ఉత్తర యోగం ధృతి ఉదయం 08.58 వరకు ఉపరి శుల కరణం కౌలవ సాయంత్రం 04.29...

వచన సాహిత్యం ప్రజల సాహిత్యం!|ESSAY

ಓಂ శ్రీ గురు బసవ లింగాయ నమః! శరణు శరణార్థి! బీదర్ పట్టణం బసవగిరిలోని బసవ సేవా ప్రతిష్ఠాన వారి ఆధ్వర్యంలో 2026 జనవరి 30, 31 మరియు ఫిబ్రవరి 1 తేదీలలో...

దుర్గంథాన్ని పోగొట్టే సుగంథం!?|ADUGU TRENDS

ఎన్కటేమో గనీ, ఇగిప్పుడైతే నీల్లకు ప్లాటిక్, స్టీలు, రాగి సీసాలే వాడుతాండ్రు. ప్రిజ్జులనే కాదుల్లా, యేడికిపోయినా, గవాటినే తీస్కపొతాండ్రు, లేకపోతే కొనుక్కుని తాగుతాండ్రు. గనీ గవి వాడంగ, వాడంగ... దుర్వాసన వేస్తయి. దుర్గంథం...

విపత్కర ఇరాన్ కు వివేకంతోనే విజయం!|EDITORIAL

అమెరికా–ఇరాన్ విభేదాలు, ఇజ్రాయెల్ భద్రతా ఆందోళనలు, ప్రాంతీయ అభద్రతా భావ రాజకీయాలు ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తున్నాయి. యుద్ధ వాతావరణం సృష్టించడం సులువు కానీ, దాని ఫలితాలను భరించడం మాత్రం దేశాలకు, ప్రజలకు మాత్రం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News