సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ కుటుంబానికి పుష్ప 2 నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని 50 లక్షల చెక్ ను రాష్ట్ర మంత్రి వెంకట్ రెడ్డి సమక్షంలో అందించారు. గాయపడి కిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ తండ్రిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో నవీన్ యెర్నేని కలిశారు.
శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నిర్మాత నవీన్ యెర్నేని బాలుడి వైద్య ఖర్చుల నిమిత్తం ప్రస్తుతం 50 లక్షలు ఇస్తున్నాం అని, భవిష్యత్తులో వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సంఘటనలో శ్రీతేజ్ తల్లి రేవతి మరణించడంపై బాధ వ్యక్తం చేస్తూ ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.
ఇదే సందర్భంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ…. ఈ సంఘటనపై ఎవరు మాట్లాడకూడదని ప్రజలకు, అన్ని పార్టీల నాయకులకు విజ్ఞప్తి చేశారు.

