పంచాయితీరాజ్ శాఖలో కీలకమైన మార్పులు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వము యోచిస్తోంది. అందులో భాగంగా మహిళా సర్పంచులు అనేక గ్రామాల్లో కనబడినా, వారి భర్తలు ఎక్కువగా నిర్ణయాలు తీసుకుంటున్న దృశ్యాన్ని మార్చాలని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సు చేసింది. మహిళా సాధికారతకు అవరోధం కలిగించేవారికి జరిమానా విధించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అదేవిధంగా, మహిళా సర్పంచులతో సంబంధిత వాట్సాప్ గ్రూప్‌లను ఏర్పాటు చేయాలని, తద్వారా పాలనలో ఎదురయ్యే సమస్యలను సమర్ధవంతంగా పరిష్కరించేందుకు ఒక సమగ్ర విధానం అమలు చేయాలని కమిటీ సూచించింది. ఈ నివేదికను కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖకు సమర్పించింది.

