Thursday, October 8, 2026
25.5 C
Hyderabad

నానా పటేకర్ ఇక లేరు|NANA PATEKAR|FILM ACTOR

ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు నానా పటేకర్ (75) గురువారం ఉదయం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో అపస్మారక స్థితిలో కనిపించిన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని దవాఖానకి తరలించారు. అయితే అప్పటికే ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు మృతి చెందినట్లు ప్రకటించారు. తీవ్రమైన గుండెపోటుతో ఆయన మరణించినట్లు దవాఖాన వర్గాలు వెల్లడించాయి. వైద్యులు దాదాపు 45 నిమిషాల పాటు సీపీఆర్ చేసినప్పటికీ స్పందన లేకపోయిందని తెలిపారు. ఈ ఘటనపై మెడికో-లీగల్ కేసు నమోదు కాగా, పోస్టుమార్టం అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

నానా పటేకర్ అసలు పేరు విశ్వనాథ్ పటేకర్. 1951లో జన్మించిన ఆయన 1978లో ‘గమన్’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. హిందీ, మరాఠీ చిత్రాల్లో తన విలక్షణ నటన, శక్తివంతమైన సంభాషణలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘పరిందా’, ‘క్రాంతివీర్’, ‘ప్రహార్’, ‘అబ్ తక్ ఛప్పన్’, ‘వెల్‌కమ్’, ‘నటసమ్రాట్’ వంటి చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశాయి. ‘పరిందా’ చిత్రంలోని నటనకు 1989లో ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు.

తెలుగు ప్రేక్షకులకు కూడా నానా పటేకర్ సుపరిచితమే. రజనీకాంత్ నటించిన ‘కాలా’లో ప్రతినాయకుడిగా మెప్పించారు. అలాగే తమిళ చిత్రం ‘బొమ్మలాట్టమ్’ తెలుగులో ‘రాణా’ పేరుతో విడుదల కాగా, ఇందులో అర్జున్, కాజల్ అగర్వాల్‌తో కలిసి కీలక పాత్ర పోషించారు.

సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా 2013లో కేంద్ర ప్రభుత్వం నానా పటేకర్‌ను పద్మశ్రీతో సత్కరించింది. అదే ఏడాది మహారాష్ట్ర ప్రభుత్వం రాజ్‌కపూర్ ప్రత్యేక సహకార అవార్డును అందించింది. ఆయన మరణంతో భారతీయ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.

Latest News

మూగ జీవాలకో ఫుడ్ కోర్టు!?|ADUGU TRENDS

మూగ జీవాలను మనుసులతో సమానంగ సూత్తం. మంచి మంచి దేవుల్ల పేర్లు పెట్టి పిలుస్తం. గయి మనతో సమానంగ కలిసే జీవిత్తయి. కనీ, గీ మద్దెల గవాటిని పట్టించుకునుడే మానేసినం. గయ్యేమో ఆహారం...

నమో పాతికేళ్ళ అసాధారణ ప్రస్థానం!?|EDITORIAL

నమో పాతికేళ్ల అనుభవం నిజంగానే ఒక గొప్ప ఆస్తి. కానీ ప్రజాస్వామ్యంలో ఆ ఆస్తికి అసలైన యజమానులు ప్రజలే. కాబట్టి ఈ అనుభవానికి తుది కొలమానం అధికారంలో గడిపిన సంవత్సరాల సంఖ్య కాదు....

అక్టోబర్ 08, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తిధి త్రయోదశి రాత్రి 09.40 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం పుబ్బ రాత్రి 09.50 వరకు ఉపరి ఉత్తర యోగం శుక్ల రాత్రి 02.25 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 10.23 వరకు ఉపరి...

‘అన్న’మో రామచంద్రా!?|RICE|FARMER|RICE MILL|STATE|CENTRAL|GOVERNMENT

బియ్యమా? ధరలు పెరుగుతున్న దయ్యమా? ధాన్యం ఉత్పత్తిలో టాప్..ధరల నియంత్రణలో ఫ్లాప్ రైతుకు గిట్టుబాటు-సామాన్యుడికి అందుబాటేది? మిల్లర్ల మాయా? పరిపాలనా వైఫల్యమా? రాష్ట్రమే కాదు, దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి! ధరల పెరుగుదలకు దరిద్రపు కారణాలెన్నో? అన్నపూర్ణ రాష్ట్రంలో ప్రజలు ‘అన్న’మో...

తాటిశెట్టుకు ఇనుప మెట్లు!?|ADUGU TRENDS

తాటి కల్లు మత్తుగున్నది.. నీ బాంచెన్ తాగుతుంటే ఎక్కుతున్నది. అనుకుంటనే గీ కల్లును మస్తుగ తాగుతుంటరు. తెలంగాణలనైతే ఊర్లల్ల ఆడోల్లు కూడా గీ కల్లు తాగుతరు. కనీ, గీ కల్లు గీసుడే మస్తు...

‘సర్’ సర్వేపై సర్వత్రా నిరసనలు.. భరోసా ఏది!|EDITORIAL

‘సర్’పై నెలకొన్న వివాదాన్ని విస్తృత ప్రజాస్వామ్య విశ్వాస సంక్షోభంలో భాగంగా చూడాలి. ఎన్నికల సంఘం నిష్పక్షపాతత్వంపై సందేహాలు రాకుండా ప్రతి అభ్యంతరానికీ పారదర్శకంగా సమాధానం చెప్పాలి. అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా...

అక్టోబర్ 07, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తిధి ద్వాదశి రాత్రి 11.02 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం మఖ రాత్రి 10.32 వరకు ఉపరి పుబ్బ యోగం సాధ్య ఉదయం 07.05 వరకు ఉపరి శుక్ల కరణం కౌలవ ఉదయం 11.55 వరకు ఉపరి...

గాడ దుర్గమ్మకు శేపల కూరే నైవేద్యం!?|ADUGU TRENDS

దేవీ శరన్నవరాత్రోత్సవాలు గదేనుల్లా.. దుర్గా నవరాత్రులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్రమైన పండుగ. తొమ్మిది రోజులు జగన్మాత అయిన గా దుర్గాదేవిని రకరకాల రూపాలల్ల అర్చిస్తూ, పదో రోజున అంటే విజయదశమి దసరా...

భయపడటం కాదు, అప్రమత్తంగా ఉండాలి!?|EDITORIAL

సైబీరియా ఘటన మనకు నేర్పే పాఠం భయపడటం కాదు. అప్రమత్తంగా ఉండటం. అధికారిక నిర్ధారణకు ముందే రూమర్లను ప్లేగ్ మహమ్మారి వార్తలుగా మార్చడం ప్రజల్లో అనవసర భయాన్ని పెంచుతుంది. అదే సమయంలో ల్యాబొరేటరీ...

అక్టోబర్ 06, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తిధి ఏకాదశి రాత్రి 12.45 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఆశ్లేష రాత్రి 11.36 వరకు ఉపరి మఖ యోగం సిద్ద ఉదయం 09.47 వరకు ఉపరి సాధ్య కరణం బవ పగలు 01.47 వరకు ఉపరి...

అక్టోబర్ 05, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తిధి దశమి రాత్రి 02.47 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పుష్యమి రాత్రి 12.51 వరకు ఉపరి ఆశ్లేష యోగం శివ పగలు 12.50 వరకు ఉపరి సిద్ద కరణం వణజి పగలు 03.55 వరకు ఉపరి...

పట్టుకుంటే ఊతం.. కూసుంటే ఆసనం!?|ADUGU TRENDS

వయసు మీద పడిందనుకోండ్రి. నడక కట్టమే. కూసునుడు కూడా ఇంకా కట్టం. మూడో కాలనే శేతి కర్రో.. ఇంకేదో ఒకటి ఊతంగా ఉండాల్సిందే. గట్లనే శేతకాకపోతే కూసోనికి ఏదో ఒక ఉచితాసనం ఉండాల్సిందే....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News