Friday, July 17, 2026
26.4 C
Hyderabad

ప్రపంచానికి పెను సవాల్ గా అమెరికా సామ్రాజ్యవాదం!|EDITORIAL

‘చెప్పేవి శ్రీరంగ నీతులు..’ అనే సామెత అమెరికాకు సరిగ్గా సరిపోతుంది. ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, అంతర్జాతీయ న్యాయం గురించి ప్రపంచానికి నిత్యం నీతిపాఠాలు చెప్పే అమెరికా, తన చేష్టలతో ఆ సూత్రాలన్నింటినీ కాలరాస్తోంది. మరీ ముఖ్యంగా డోనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా మరింత దురహంకారంగా, నిరంకుశంగా వ్యవహరిస్తోంది. ఏది కావాలంటే దాన్ని స్వాధీనం చేసుకొనే ట్రంప్‌ తరహా సామ్రాజ్యవాదం ముదిరితే, మళ్లీ బ్రిటీష్‌ తరహా సామ్రాజ్యవాదాన్ని అమెరికా ప్రారంభిస్తుందా?! అన్న ఆందోళన కలుగుతోంది.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

‘చెప్పేవి శ్రీరంగ నీతులు..’ అనే సామెత అమెరికాకు సరిగ్గా సరిపోతుంది. ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, అంతర్జాతీయ న్యాయం గురించి ప్రపంచానికి నిత్యం నీతిపాఠాలు చెప్పే అమెరికా, తన చేష్టలతో ఆ సూత్రాలన్నింటినీ కాలరాస్తోంది. మరీ ముఖ్యంగా డోనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా మరింత దురహంకారంగా, నిరంకుశంగా వ్యవహరిస్తోంది.

అమెరికా ఇతర దేశాల మీద దాడులు చేస్తే, అందుకు కారణాలు ఉంటాయి. అదే ఇతర దేశాలు ఏ దేశం మీద దాడి చేసినా అందుకు కారణాలుండ కూడదన్నది అమెరికా సిద్ధాంతంగా మారింది. ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక టెంపరితనం, సామ్రాజ్యవాద విస్తరణ కాంక్ష విపరీతంగా పెరిగింది. తన కనుసన్నల్లోనే దేశాలన్నీ నడవాలన్న నిరంకుశత్వం కనిపిస్తోంది. ట్రంప్ రెండు రకాలుగా ప్రపంచాన్ని గిప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారు. ఒకటి టారిఫ్ ల బాదుడు. రెండు సైనిక దాడులు. చైనా,భారత్‌ వంటి దేశాలపైనా పన్నులతో విరుచుకుపడుతున్నారు. కాని పక్షంలో ‘బడిత ఉన్నోడిదే బర్రె’ అనే సామెతలా వెనెజువెలా లాంటి దేశాలపై సైనిక దాడికి దిగుతున్నాడు. ఇప్పటికే ఇరాన్‌, ఖతార్‌, సిరియాలపై విరుచుకుపడి బాంబులు వేశారు. ఇప్పుడు వెనెజువెలాను తామే పాలిస్తామని చెబుతున్నాడు.

ప్రపంచంలో సైనిక శక్తి ఉంటే ఏ దేశం మీదైనా దాడి చేయవచ్చా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. అలా అయితే మన దేశం నుంచి విడిపోయిన పాక్‌, బంగ్లా దేశ్‌లపై మనం కూడా దాడి చేసి భారత్‌లో కలిపేసుకుని, అఖండ భారత్‌ కలను సాకారం చేసుకోవచ్చా? భారత్‌లో ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్న పాక్‌కు బుద్థి చెప్పేందుకు దాడి చేస్తే అడ్డుకోవాలని ట్రంప్‌ చూశారు. తానే పాక్‌, భారత్‌ యుద్దాన్ని ఆపానని అంటాడు. ఉక్రెయిన్‌, రష్యాల మధ్య యుద్దం వద్దని మధ్యవర్తిత్వం వహిస్తాడు. తానే అనేక యుద్ధాలను ఆపానని ప్రగల్బాలు పలుకుతాడు. వెనెజువెలాపై దాడి చేస్తాడు. అధ్యక్షుడిని, అతడి సతీమణిని అపహరిస్తాడు. ఇలా ట్రంప్‌ తన తల తిక్కి అహంకారంతో వ్యవహరి స్తున్నాడు. నార్కో టెర్రరిస్టు అని అభియోగం మోపి న్యూయార్క్‌ కోర్టులో ప్రవేశపెట్టింది. తాను వెనెజువెలా అధ్యక్షుడినని, ఎలాంటి నేరం చేయలేదని మదురో కోర్టులో చెప్పాడు. తదుపరి ఏం జరుగుతుందో తెలియని అయోమయం. ఉపాధ్యక్షురాలిగా ఉన్న డెల్సీ రోడ్రిగజ్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక తమకు సహకరించకపోతే మదురో కంటే ఎక్కువగా అనుభవించాల్సి వస్తుందని ట్రంప్‌ ఆమెను కూడా బెదిరించాడు.

అయితే వెనెజువెలాలోని చమురు నిక్షేపాలను ఆక్రమించుకోవడం అమెరికా ఎత్తుగడగా ఉంది. అమెరికా చర్యను ఐరాస ఖండించింది. దాని జోక్యం మరింత అవసరం. రెండో ప్రపంచ యుద్దానికి ముందు జర్మన్‌ నియంత అడాల్ఫ్‌ హిట్లర్‌ కూడా యూదుల మారణకాండకు పాల్పడ్డాడు. నరమేధం సృష్టించాడు. గ్యాస్‌ ఛాంబర్‌లు పెట్టి లక్షల మందిని పొట్టన పెట్టుకున్నాడు. అనేక దేశాలను ఆక్రమించుకుంటూ పోయినా ప్రజాస్వామిక ముసుగు వేసుకున్న దేశాలేవీ అడ్డుకోలేదు. అప్పట్లో అమెరికా ఆయుధాలు కూడా అందించింది. అయితే రష్యా అధినేత స్టాలిన్‌ నాయకత్వంలో ప్రతిఘటించిన తరవాతనే హిట్లర్‌ ఆత్మహత్య చేసుకొని దిక్కులేని చావు చచ్చాడు.

ఇండియాలో కూడా బ్రిటిషర్లు ఇలాగే వ్యవహరించారు. అంతకు ముందు మొగలులు కూడా దాడులు చేసి హిందూ ఆలయాలను ధ్వంసం చేసి ప్రజలను ఊచకోత కోశారు. మత మార్పిళ్లు చేశారు. తెలంగాణలో నిజాం నిరంకుశ రజాకార్లు కూడా ప్రజలను ఊచకోత కోశారు. కాశ్మీర్‌లో మారణహోమం చూశాం. మతమార్పిళ్లు చూశాం. ఊచకోతలు చూశాం. అయితే ఇప్పుడు ప్రపంచ వ్యవస్థ మారంది. ఆధునిక ప్రపంచంలో ఇటీవల ఉక్రెయిన్‌పై రష్యా దాడిని, ఇప్పుడు వెనిజువెలాపై అమెరికా దాడిని చూస్తున్నాం. ఇది తమ దారికి రాని వారికి ఏ గతి పడుతుందో తెలిపే ఆరంభం మాత్రమే అని, మదురో అపహరణ తరువాత ట్రంప్‌ చెప్పాడంటే రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని దాడులు చూడాల్సి వస్తుందో? ప్రపంచానికి ఎలాంటి ముప్పురానుందో అన్నది ప్రపంచ దేశాలు ఆలోచించాలి. ఇప్పుడు డోనాల్డ్‌ ట్రంప్‌ రూపంలో ఉన్న అమెరికన్‌ ఫాసిస్టు శక్తిని నిలువరించేది ఎవరనేదే కాలమే చెప్పాలి.

తమ తదుపరి లక్ష్యం మెక్సికో, కొలంబియా, క్యూబా అని కూడా ట్రంప్‌ చెప్పాడు. ట్రంప్‌ సామ్రాజ్య విస్తరణ కాంక్షను వెనెజువెలా ఉదంతం స్పష్టం చేసింది. అంతకు ముందు డెన్మార్క్‌ స్వయంపాలిత గ్రీన్‌లాండ్‌ తమకు కావాలని చెప్పిన సంగతి తెలిసిందే. అది కూడా త్వరలోనే స్వాధీనం చేసుకునేదాకా వదిలేట్టుగా లేడు. కెనడాను కూడా ఇలాగే బెదిరించాడు. ఏది కావాలంటే దాన్ని స్వాధీనం చేసుకొనే ట్రంప్‌ తరహా సామ్రాజ్యవాదం ముదిరితే, మళ్లీ బ్రిటిష్‌ తరహా సామ్రాజ్యవాదాన్ని అమెరికా ప్రారంభిస్తుందా?! అన్న ఆందోళన కలుగుతోంది.

Latest News

కరువు కోరలు!|Fangs of drought

ఇప్పటికి 33శాతమే వర్షం నమోదు!! రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రం అడుగంటుతున్న జలాశయాలు జీవ నదుల్లోనూ జల జీవమే లేదు రిజర్వాయర్లలోనూ ఇదే పరిస్థితి సాగుకు తొందరొద్దంటున్న నిపుణులు ప్రత్యామ్నాయ పంటలపై కార్యాచరణ 20వ తేదీ తర్వాత పత్తి విత్తనాలేయొద్దు బోరుబావుల కింద వరి...

మొక్క నాటుండ్రి.. డిస్కౌంట్లు పొందుండ్రి!?|ADUGU TRENDS

పర్యావరణానికి మూలం మొక్కే. గా మొక్కే చెట్టై, మహా మానై మనల్ని రచ్చిత్తది. గీ భూమి, వాతావరణం మొత్తం గా మొక్కల మీదనే ఆధారపడ్డది. కనీ, మనమేం చేత్తానం? ఏడికాడికి శెట్లని తెగ...

‘ఢీ’లిమిటేషన్ రాజకీయాలు!?|EDITORIAL

డీలిమిటేషన్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ సంస్కరణలలో ఒకటిగా నిలవనుంది. ఇది కేవలం సీట్ల సంఖ్య మార్చే ప్రక్రియ కాదు, భవిష్యత్ రాజకీయ ప్రాబల్య సమీకరణాలను నిర్ణయించే కీలక ఘట్టం....

జూలై 17, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం దక్షిణాయణం ప్రారంభం తిధి తదియ ఉదయం 09.54 వరకు ఉపరి చవితి నక్షత్రం మఖ రాత్రి 10.51 వరకు ఉపరి పుబ్బ యోగం సిద్ది ఉదయం 05.00 వరకు ఉపరి వ్యతీపాత కరణం గరజి ఉదయం 09.54...

సింధు నాగరికత|ADUGU|SPECIAL|COMPITITIVE|EXAMS

నాగరికత మరియు సంస్కృతికి తేడా నాగరికత పూర్తిగా అభివృద్ధి చెందిన మరియు ఉన్నతమైన జీవనాన్ని గడిపినట్లయితే మరియు ప్రజలు పట్టణ, శాస్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ఉంటే దానిని నాగరికత అంటారు. సంస్కృతి సంస్కృతి అనేది ప్రతీ ఒక్కరికీ...

‘ప్రభంజన’ పథం ప్రజ్వరిల్లాలి|ESSAY|SPECIAL

జూలై 16, 2025. సరిగ్గా ఏడాది క్రితం జర్నలిస్టు, వక్త, కవి, రచయిత, మేధావి, అభ్యుదయవాది, వివేకశీలి, చైతన్యవంతుడు, నిరంతర పోరాట శీలి అయిన ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ పరమపదించారు....

రోడ్లకు కూడా ఆపరేషన్లు!?|ADUGU TRENDS

గిప్పటి దాకా మనం మనుసులకు, జంతువులకు ఆపరేషన్లు సేసుడే సూసినం. కనీ, గీ యింతను ఎక్కడా సూడలే.! గా బిహార్ రాస్ట్రంల కొత్తగ, ఎక్కడా లేని లెక్కల, రోడ్లకు కూడా ఆపరేషన్లు సేత్తాండ్రు....

నదుల అనుసంధానమే జల భద్రతకు శాశ్వత మార్గం!|EDITORIAL

ఎల్‌నినో ప్రభావాన్ని ఆపడం మన చేతుల్లో లేదు. కానీ, దాని వల్ల కలిగే నష్టాన్ని శాస్త్రీయ ప్రణాళికలు, సమర్థమైన జల నిర్వహణ, నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, వాతావరణ అనుకూల వ్యవసాయం ద్వారా...

జూలై 16, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం పూరి జగన్నాధ రధోత్సవం తిధి శు విదియ ఉదయం 11.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఆశ్లేష రాత్రి 11.40 వరకు ఉపరి మఖ యోగం వజ్ర ఉదయం 08.20 వరకు ఉపరి సిద్ది కరణం కౌలవ...

ఆషాఢమాసం రహస్యాలు|ASHADAM|SECRETS

ఆచారాలు, శాస్త్రం, సంప్రదాయాల వెనుక నిజాలు ఆషాఢమాసం విశేషాలు – ఆధ్యాత్మికత, ప్రకృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాల వెనుక అసలు కథ ప్రతి ఆచారం వెనుక ఒక అర్థం... ప్రతి సంప్రదాయం వెనుక ఒక జీవన...

ఉడుతా మిడతా!?|ADUGU TRENDS

మనం మన సుట్టుముట్టు ఉడుతల్ని సూత్తనే ఉంటం. పొలాలల్ల, రోడ్ల మీద అటిటుపోతనే ఉంటయి. సిడెం సేపట్లనే కనబడ్తయి, ఆడ్తయి. ఉరుకుతయి. ఎన్కట గా రాముడికి వారధి కట్టుట్ల గీ ఉడుత సాయం...

ఓటర్ల సవరణకు శాశ్వత పరిష్కారం లేదా!?|EDITORIAL

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, పట్టణాల్లో వార్డు కార్యాలయాలు, మీ సేవ వంటి పౌర సేవా కేంద్రాలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తే ప్రజలకు సౌలభ్యం పెరుగుతుంది. బీఎల్‌వోలపై పూర్తిగా ఆధారపడకుండా బహుళస్థాయి ధ్రువీకరణ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News