హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో ఉద్రిక్తత నెలకొంది. శిథిలావస్థలో ఉన్న భవనాన్ని ఖాళీ చేయించేందుకు హెచ్‌ఎండీఏ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో లీజుదారులు కోర్టులో కేసు ఉన్న కారణంగా తమను ఖాళీ చేయించలేరని వాదనకు దిగారు. అధికారులు హైకోర్టు ఆదేశాల ప్రకారం భవనాన్ని ఖాళీ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. దుకాణదారులు నిరసన వ్యక్తం చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీగా మోహరించారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.

