Thursday, July 30, 2026
24.4 C
Hyderabad

‘కాషాయం’లో కషాయం!?

బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్రానికి కొత్త బిజెపి అధ్యక్షుడి నియామకం త్వరలోనే పూర్తవుతుందన్న ఆ పార్టీ ఎమ్మెల్యే రాజసింగ్, అదే నియామకంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎవరుండాలి? ఎవరిని ఎవరు ఫైనల్ చేస్తున్నారు? స్టేట్ కమిటా?లేక సెంట్రల్ కమిటా? అంటూ హాట్ హాట్ గా నిలదీశారు. ఒకవేళ స్టేట్ కమిటీ డిసైడ్ చేస్తే ఆ అధ్యక్షుడు రబ్బర్ స్టాంప్ గానే మిగిలిపోతాడని, సెంటర్ కమిటీ డిసైడ్ చేస్తే చాలా మంచిదని కుండ బద్దలు కొట్టారు. ఈ సమాచారాన్ని ఆయన మీడియా కు విడుదల చేశారు.

గతంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎవరు అయినా, సొంత గ్రూపులు కట్టి పార్టీకి నష్టం చేశారు. సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ కోసం జైళ్ళకెళ్లిన కార్యకర్తలని గతంలో పక్కన పెట్టారు. ఒకవేళ కొత్త అధ్యక్షుడు కూడా గ్రూపిజం చేస్తే పార్టీకి చాలా నష్టం జరుగుతుంది. అని వ్యాఖ్యానించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీలో మంచి నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వాళ్ళ కాళ్ళు చేతులు కట్టి పక్కన పడేశారన్నారు. అయితే, వీళ్ళల్లో ఎవరినైనా నియమించి స్వేచ్ఛనిస్తే ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. అలాగే పార్టీ కొత్త అధ్యక్షుడు సిఎం లతో బాక్ డోర్ లో సీక్రెట్ మీటింగులు పెట్టొద్దని సూచించారు. హిందుత్వ పార్టీ గా చెప్పుకునే బీజేపీ, అలాంటి కార్యకర్తలను తొక్కడం కాకుండా, వాళ్ళకి వెన్నుదన్నుగా నిలవాలన్నారు.

తాను చెప్పిన మాటలు ఎవరికి నచ్చుతవో, ఎవరికీ నచ్చవో తనకు తెలియదని కానీ, తను మాత్రం పార్టీ సగటు కార్యకర్త, నాయకుడి మనోభావాల్ని బయట పెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. తాను పార్టీ అంతర్గత విషయాలను పార్టీలో చర్చించకుండా, మీడియాకి లీకులిస్తున్నట్లు కొందరు నన్ను నిందిస్తున్నారు. కానీ, నేను మొదటగా పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్ళినా, వాళ్ళు వినకపోవడం వల్లే ప్రజలు ముందు పెడుతున్నానన్నారు. మొత్తానికి రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు అటు స్టేట్, సెంట్రల్ పార్టీలో, ఇటు కేడర్ లో, రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

Latest News

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News