హైదరాబాద్ చేరుకున్న లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి శంషాబాద్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అక్కడి నుండి నేరుగా రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి కలిసి హైదరాబాద్‌లో జరుగనున్న భారత్ సమ్మిట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వాగతం పలికిన వారిలో ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షీ నటరాజన్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీపీసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇతర మంత్రులు తదితరులు పాల్గొన్నారు.

