Wednesday, August 19, 2026
26.1 C
Hyderabad

People|ప్రజల ఆశయాలను నెరవేర్చే దిశగా ప్రజా ప్రభుత్వం

Government ముందడుగు-సీఎం|CM రేవంత్ రెడ్డి|REVANTH REDDY

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఉద్వేగభరితంగా మాట్లాడుతూ, ఇది నాలుగు కోట్ల ప్రజల కల నెరవేరిన గర్వదాయకమైన రోజు అని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
ప్రత్యేక తెలంగాణ కోసం విద్యార్థులు, యువకులు, మహిళలు, కవులు, కళాకారులు, మేధావులు – ప్రతి వర్గం పోరాడింది. ప్రజల ఆకాంక్షలకే రూపం తెలంగాణ అని అన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మాజీ కాంగ్రెసు అధినేత్రి శ్రీమతి సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ కోసం అమరులైన వారికి ఘన నివాళులు అర్పించారు.

2014లో రాష్ట్రం ఏర్పడినప్పటికీ గత పదేళ్లలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని విమర్శించారు. గత డిసెంబర్ 7న ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, అప్పటి నుంచి రాష్ట్ర పునర్నిర్మాణానికి నిబద్ధతతో ముందుకు సాగుతున్నామన్నారు.

మహిళా సంక్షేమమే బలమైన బాట

“మహిళలే సమాజానికి పునాది” అనే నినాదంతో ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా పలు కీలక చర్యలు చేపట్టిందని సీఎం తెలిపారు. ఇందిరా మహిళా శక్తి మిషన్, ఉచిత బస్సు ప్రయాణం, మహిళల ఆధ్వర్యంలోని క్యాంటీన్లు, సిలిండర్‌ను రూ.500కే అందించే మహాలక్ష్మి పథకం వంటి పథకాలను గుర్తు చేశారు.

రైతుకు రుణ విముక్తి – 20,617 కోట్ల మాఫీ

రైతుల సంక్షేమాన్ని ధ్యేయంగా మిగిలిన ప్రభుత్వం ఇప్పటికే 25.35 లక్షల మందికి రూ.20,617 కోట్ల రుణమాఫీ చేశామన్నారు. ఉచిత విద్యుత్, రూ.12 వేలు పెట్టుబడి సాయం, భూమిలేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12వేలు ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. వరిధాన్యానికి మద్దతు ధరతో పాటు సన్నవడ్లకు రూ.500 బోనస్ అందించడం వల్ల రాష్ట్రం దేశంలో ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ గా నిలిచిందని చెప్పారు.

విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపుతోపాటు, 58 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ను రూ.11,600 కోట్లతో నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఉస్మానియా ఆసుపత్రిని పునర్నిర్మాణం చేసి రూ.2,700 కోట్లతో కొత్త భవనం నిర్మిస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామని వివరించారు.

బీసీలకు 42% రిజర్వేషన్, కుల గణనతో దిశానిర్దేశం

తెలంగాణలో బీసీల జనాభా 50.36 శాతంగా తేలడంతో వారికీ 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు శాసనసభలో బిల్లులు ఆమోదించినట్టు తెలిపారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణను చట్టబద్ధత కల్పించామన్నారు.

ఉజ్వల తెలంగాణ కోసం పెట్టుబడులు, మౌలిక వృద్ధి

ఐటీ దిగ్గజాల విస్తరణతో పాటు, ఫ్యూచర్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఎయిర్‌పోర్టులు, మెట్రో రైలు విస్తరణ, మూసీ పునరుజ్జీవనం వంటి ప్రాజెక్టులను ప్రస్తావించారు. ఇప్పటికే మూడు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని వివరించారు.

భద్రతకు పెద్ద పీట – తెలంగాణ పోలీస్ దేశంలో నెం.1

డ్రగ్స్ నిరోధానికి చర్యలు తీసుకున్నామని, హైదరాబాద్ నార్కోటిక్ విభాగానికి అంతర్జాతీయ అవార్డు దక్కిందని ముఖ్యమంత్రి తెలిపారు. దేశ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తామన్నారు.

సంక్షేమ పథకాలలో తెలంగాణ ప్రత్యేక స్థానం

ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం వంటి పథకాలతో పేదల ఆకలి తీర్చడమే కాకుండా, ఆత్మగౌరవాన్ని కలిగిస్తున్నామని తెలిపారు. సారపాకలో సన్నబియ్యం లబ్దిదారుల ఇంట్లో భోజనం చేసిన అనుభవం ఎప్పటికీ గుర్తుంటుంది అని అన్నారు.

ముఖ్యమంత్రి ప్రజా ప్రభుత్వ సంకల్పాన్ని స్పష్టంగా ఉటంకించారు. తెలంగాణ ప్రజలకు అభివృద్ధి, న్యాయం, సాధికారత అందించడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.

 

Latest News

వరుస ఆరోపణలు.. షోకాజ్ నోటీసులు!|CONGRESS|NOTICE

తెలంగాణ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతుంది?|TELANGANA|CM|REVANTH REDDY|KONDA FAMILY తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ కుటుంబం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గం మధ్య...

సుస్మితకు ఎమ్మెల్యేల ఘాటు కౌంటర్|KONDA FAMILY|MLAS|COUNTER

క్రమశిక్షణ చర్యలపై కాంగ్రెస్‌ ఫోకస్|MALLU RAVI|CONGRESS|FOCUS తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఇటీవల పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో...

సీఎం అయ్యాక కళ్ళు నెత్తికెక్కాయా….|TELANGANA|CONGRESS|KONDA|REVANTH REDDY

సీఎం రేవంత్ వర్సెస్ కొండా కుటుంబం!|CM|KONDA SUSMITHA ఒకవైపు జెన్ జీ వాళ్లకు టిక్కెట్లు ఇవ్వాలి అంటావ్ మరోవైపు డైపర్లు వేసుకొని తిరుగుతున్న రేవూరి ప్రకాశ్ రెడ్డికి టికెట్ ఇస్తా అంటావ్ - మంత్రి కొండా సురేఖ...

స్టార్ హోటల్ల దోశ గిట్లనే తినాల్నట!?|ADUGU TRENDS

శిన్నప్పుడు మనం ఎట్ల తినాల్నో? ఎట్ల తినకూడదో మన అవ్వయ్యలు నేర్పిత్తురు. అన్నలక్కలు కూడా శెప్తరు. గట్లనే మనం తినడం నేర్సుకుంటం. పెద్దగైనంక సుత.. గట్ల తినుడే అలవాటు శేసుకుంటం. కనీ, పెద్ద పెద్ద...

ఉగ్రవాదం : అనుమానమే ఆయుధం కాకూడదు!?|EDITORIAL

దేశ భద్రతకు ‘ప్రజలు కూడా బాధ్యతాయుతమైన సమాచార భాగస్వాములుగా ఉండాలి. నిఘా సంస్థలు ఆధారాలను విశ్లేషించి, చట్టబద్ధమైన దర్యాప్తు ద్వారా నిందితులను గుర్తించాలి. ఉగ్రవాదంపై కఠిన చర్య అవసరం. అదే సమయంలో నిరపరాధ...

ఆగస్టు19, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తిధి శు.సప్తమి రాత్రి 08.09 వరకు ఉపరి అష్టమి నక్షత్రం స్వాతి ఉదయం 08.58 వరకు ఉపరి విశాఖ యోగం శుక్ల ఉదయం 06.37 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 07.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

హవ్వ…ఆవు పెండ మట్టితోటి శివలింగం!?|ADUGU TRENDS

సావును తప్పించుకోవడానికి భక్త మార్కండేయుడు శివలింగాన్ని బిర్రుగ కావలిచ్చుని తపస్సు శేసిండు. యముడి పాశం శివలింగానికి తాకడంతోటి శివుడికి కోపమొచ్చిందిట. యముడిని తరిమికొట్టి మార్కండేయునికి చిరంజీవిగా వరం ఇచ్చిండట. గట్లనే తిన్నడు గదేనుల్ల భక్త...

మరి, ‘సౌరశక్తి మంథన్’ మాటేమిటి!?|EDITORIAL

చమురు, గ్యాస్‌ అన్వేషణ దేశానికి తక్షణ, వ్యూహాత్మక ప్రయోజనాలను అందించవచ్చు. కానీ అవి పరిమిత వనరులు. సూర్యుడు మాత్రం నిరంతర ఇంధన వనరు. అందుకే ‘సముద్ర మంథన్‌’తో పాటు ‘సౌర శక్తి మంథన్‌’...

ఆగస్టు 18, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం మంగళగౌరి వ్రతం తిధి శు.షష్ఠి రాత్రి 07.11 వరకు ఉపరి సప్తమి నక్షత్రం చిత్త ఉదయం 07.34 వరకు ఉపరి స్వాతి యోగం శుభ ఉదయం 07.00 వరకు ఉపరి శుక్ల కరణం కౌలవ ఉదయం 06.58 వరకు ఉపరి...

ఆగస్టు 17, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం నాగ పంచమి గరుడ పంచమి తిధి శు.పంచమి సాయంత్రం 06.43 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం హస్త ఉదయం 06.40 వరకు ఉపరి చిత్త యోగం సాధ్య ఉదయం 07.51 వరకు ఉపరి శుభ కరణం బవ ఉదయం...

గా ఊల్లె తాగొద్దు..!?|ADUGU TRENDS

ఎనకటికి 'మందు తాగనోడు దున్నపోతై పుట్టున్ ' అన్నరు. కానీ గా ఊరోల్లు మాత్రం మందు తాగితే జరిమానా ఏత్తం అంటున్నరు. పెండ్లి కానోళ్లు తాగొద్దట! పెండ్లి అయినోళ్ళు తాగొచ్చట? కానీ, కొట్లాడుకోవద్దట! తమిళనాడు...

రాహుల్ గాంధీ ముందున్న సవాల్ ఇదే!?|EDITORIAL

రాహుల్ గాంధీకి ఇప్పుడు ఎదురున్న అసలు సవాల్ మోదీని వ్యక్తిగతంగా విమర్శించడం కాదు. తన రాజకీయ శైలిని పునర్నిర్మించుకోవడం. సభలో హుందాతనం, వాస్తవాలపై పట్టు, విదేశాంగంపై బాధ్యతాయుతమైన భాష, పార్టీ పునర్వ్యవస్థీకరణ, యువ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News