గా చైనాల గిప్పటికీ సైకోల్లే తొక్కుతాండ్లట. గిప్పుడైతే గయి మన దేశంల మోటైపోయినయి గనీ, ఎన్కటికి సైకోల్లు ఎక్కువ తొక్కేది. గదే పెద్ద రెండు గిర్రల బండి. ఇగ ఇంట్లనే గాలి కొట్టేది. పంపుశార్లు.. గదేనుల్లా పంచర్లు అతికేది. శిన్నశిన్న రిపేర్లు శేసుకునేది. ఇగిప్పుడైతే సైకోల్లే కనపడ్తలేవు. ఒకటి రెండున్నా, ఏమన్నైతే పంపుశార్ల దుకాన్లకే పోబడితిమి. సరే, గిదిట్లుంటే, మరి గా పంపుశార్లను తెలుసుకునుడెట్లుల్లా? గిదీనికి ఒకాయినె మాంచి ఉపాయం కనిపెట్టిండు.

పంపుషార్లు తెల్సుకోవాల్నంటే, ట్యూబుల గాలి నింపి, గదాన్ని నీల్లల్ల పెడితే, గా నీట్లె బుడుగలు వత్తయి. ఇగ గవాట్నే మనం గుర్తు పెట్టుకుని పంపుశార్లు అతుకుతం. అప్పుడప్పుడు కనబడని పొక్కలు గూడ ఉంటయి. గవాటిని గుర్తుపట్టాల్నని ఓ ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నడు. డబ్బల రాళ్లేసినట్లే, గదాంట్ల థర్మాకోల్ ను శిన్న ముక్కలుగ యిప్పేసిండు. ఇగ గా డబ్బకు మూత పెట్టి ట్యూబ్ మీద మెల్లెగ రాసుకుంట పోయిండు. ఇగ గా ట్యూబుకు పొక్కలున్న కాడ, గా గాలికి డబ్బాలోపల థర్మాకోల్ ముక్కలు ఎగురతయిన్నట్లు. ఇగ గ దాన్ని గుర్తు పెట్టి అతుక్కోవాలె. గంతే.

