మలయాళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు అజిత్ విజయన్ (57) ఆయన తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
అజిత్ విజయన్ తన సినీ ప్రస్థానంలో “ఒరు ఇండియన్ ప్రణయకథ”, “బెంగళూరు డేస్”, “అమర్ అక్బర్ అంథోని”, “అంజు సుందరికల్” వంటి అనేక హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు.
అయన అకాల మరణంపై మలయాళ సినీ ప్రముఖులు, సహచర నటులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

