అడుగు ఎఫెక్ట్
ప్రభుత్వాల్ని పడగొట్టడమే బిజెపి పనా?
మా కాంగ్రెస్ గురించి మీకేం పని?
దమ్ముంటే ఎపి లాగా, తెలంగాణకు నిధులు తీసుకరండి
మన ప్రాజెక్టులకు జాతీయ హోదా పట్టుకరండి
మా గురించి మాట్లాడితే మర్యాద దక్కదు
బిజెపి, బండి సంజయ్ వైఖరిపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్
‘‘ఎప్పుడు ఏ ప్రభుత్వాన్ని పడగొట్టాలె. ఎవరి కొంప ముంచాలే.. అధికారంలోకి ఎట్లా రావాలె. నిత్యం ఇదే పనా? బిజెపోళ్ళకు వేరే పనే లేదా? మా కాంగ్రెస్ గురించి మీకేం పని? అసంత్రుప్తి ఎవరికి లేదు? నీకు లేదా? నీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు లేదా? నిన్నే పదవి నుంచి పీకేస్తే ఏం చేయాలో తోచక అసంత్రుప్తిగ ఉన్నవు’’ అంటూ బిజెపి వైఖరిపై, కాంగ్రెస్ లో అసంత్రుప్తి మాటలు మాట్లాడుతున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ పై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి నిప్పులు చెరిగారు. ‘‘కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నరు కదా? నీకు నీ బిజెపి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు దమ్ముంటే మన తెలంగాణకు నిధులు పట్టుకరండి. మన ప్రాజెక్టులకు జాతీయ హోదా తీసుకరండి’’. అంటూ విరుచుకుపడ్డారు. ‘‘ఎపీని చూసి బుద్ధి తెచ్చుకోండి. అక్కడ మీ ఎంపీలు ఎందరు? వస్తున్న నిధులెన్ని? ఇక్కడ తెలంగాణలో బిఆర్ఎస్ కి బి టీమ్ లా పని చేస్తున్నది మీరు. మా కాంగ్రెస్ గురించి మీకేం పని? మీ పార్టీ గురించి మీరు పట్టించుకోండి. పిచ్చి ప్రేలాపనలు మానుకోండి. ఈ పదేండ్లే కాదు, వచ్చే పదేండ్లు కూడా తెలంగాణలో మా కాంగ్రెసే అధికారంలో ఉంటుంది. మా రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటారు.’’ అని స్పష్టం చేశారు. ‘‘ప్రజలు తీర్పు ఇచ్చారు. వారి ఆశీర్వాదం ఉన్నన్ని రోజులు మేమే అధికారంలో ఉంటం. మీకే ప్రాబ్లెం?. జాగ్రత్త మా ఎమ్మెల్యేల గురించి కానీ, కాంగ్రెస్ గురించి గానీ మాట్లాడితే మర్యాద ఉండదు.’’ అంటూ హెచ్చరించారు.

