Wednesday, August 19, 2026
26.1 C
Hyderabad

సమ్మె ఆలోచనను విరమించండి

ఆర్టీసీ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

తెలంగాణ కార్మికుల సంక్షేమమే మా లక్ష్యం

రవీంద్రభారతిలో సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలోని కార్మికుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన కార్మిక దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కార్మికుల చెమట చుక్కలే ప్రపంచ అభివృద్ధికి దారి చూపుతున్నాయని, ప్రపంచ వ్యాప్తంగా ఎంత మార్పులు వచ్చినా కార్మికుల ఉద్యమానికి ప్రత్యేక స్థానం ఉందని కొనియాడారు.

తెలంగాణ సాధనలో సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ కార్మికులు, అసంఘటిత కార్మికుల పాత్రను కొనియాడిన ఆయన, ఈ కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందు వరుసలో నిలవగలిగిందంటే, కార్మికుల సహకారమే ప్రధాన కారణమని తెలిపారు.

సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా ఇచ్చి బోనస్ ఇవ్వడంలో ప్రజా ప్రభుత్వం ముందుండిందని గుర్తు చేశారు. గత పదేళ్ల నిర్లక్ష్య పాలన వల్ల విద్యుత్ వ్యవస్థ కుప్పకూలే స్థితికి చేరిందని, ఇప్పుడు ఒక పద్ధతి ప్రకారం నష్టాలను తగ్గిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని వివరించారు.

ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపట్టామని, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. అసంఘటిత కార్మికుల కోసం త్వరలో గిగ్ వర్కర్స్ పాలసీని తీసుకురాబోతున్నట్టు చెప్పారు. ఈ పాలసీ దేశానికి రోల్ మోడల్‌గా నిలవబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సీఎం, వారి పాలనలో 50 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌గా ఉండగా, మొత్తం 8 లక్షల 29 వేల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని వదిలేశారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్లు ఖర్చు పెట్టి మూడేళ్లలోనే కూలిపోయే పనులు చేశారన్న ఆయన, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి చివరికి ఆ హామీని విస్మరించిన కపట నాయకత్వాన్ని గుర్తు పెట్టుకోవాలని ప్రజలకు సూచించారు.

ఆర్టీసీ కార్మికులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబోధిస్తూ సమ్మె ఆలోచనను విరమించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ సంస్థ ఇప్పుడిప్పుడే లాభాల బాటలోకి వస్తోంది అని ఆయన తెలిపారు. ఈ సంస్థను ఆదుకునే బాధ్యత కార్మికులదేనని స్పష్టం చేశారు. గత పదేళ్లలో ఆర్టీసీ విధ్వంసానికి గురైందని, ఆర్ధిక దోపిడీ జరిగినట్లు ఆయన ఆరోపించారు.

సమ్మె ద్వారా రాష్ట్రానికి నష్టం కలుగుతుందని హెచ్చరిస్తూ, ఎలాంటి సమస్యలైనా సంబంధిత మంత్రితో చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు. “వచ్చే ఆదాయమంతా మీ చేతిలో పెడతాం. ఎలా ఖర్చు చేయాలో మీరే సూచించండి. నేను అణా పైసా ఇంటికి తీసుకెళ్లేది లేదు. అన్నీ మీ కోసమే ఖర్చు చేస్తాం,” అని సీఎం స్పష్టం చేశారు.

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేకపోయినా, నిజం ఏమిటో చెబడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు చెప్పారు. సమ్మె పోటు రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీస్తుందని హెచ్చరించారు. “ఇప్పుడిప్పుడే రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడుతోంది. మరో ఏడాదిలో కాస్త కుదురుకుంటుంది,” అని సీఎం చెప్పారు.

గతంలో ఏమీ చేయని వారు ఇప్పుడు మళ్లీ వచ్చి మాటలు చెప్పినా వారి వలలో పడకూడదని ఆర్టీసీ కార్మికులను కోరారు. “వారి విషపు చూపుల్లో చిక్కుకోకండి. మీరు నన్ను నమ్మండి. నన్ను నమ్మిన మీకు నేను అండగా ఉంటాను,” అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి సద్దుబాటులోకి వస్తుందని, మరో ఏడాదిలో కొంత స్థిరపడుతుందని తెలిపారు. గతంలో పాలించిన వారు ఇప్పుడు తిరిగి వచ్చి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని హెచ్చరించారు. “వారి విషపు చూపుల్లో చిక్కుకోకండి. నన్ను నమ్మండి. మీకు నేను అండగా ఉంటా,” అని ఆయన విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపలేరని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో పునరుద్ఘాటించారు.

 

Latest News

వరుస ఆరోపణలు.. షోకాజ్ నోటీసులు!|CONGRESS|NOTICE

తెలంగాణ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతుంది?|TELANGANA|CM|REVANTH REDDY|KONDA FAMILY తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ కుటుంబం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గం మధ్య...

సుస్మితకు ఎమ్మెల్యేల ఘాటు కౌంటర్|KONDA FAMILY|MLAS|COUNTER

క్రమశిక్షణ చర్యలపై కాంగ్రెస్‌ ఫోకస్|MALLU RAVI|CONGRESS|FOCUS తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఇటీవల పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో...

సీఎం అయ్యాక కళ్ళు నెత్తికెక్కాయా….|TELANGANA|CONGRESS|KONDA|REVANTH REDDY

సీఎం రేవంత్ వర్సెస్ కొండా కుటుంబం!|CM|KONDA SUSMITHA ఒకవైపు జెన్ జీ వాళ్లకు టిక్కెట్లు ఇవ్వాలి అంటావ్ మరోవైపు డైపర్లు వేసుకొని తిరుగుతున్న రేవూరి ప్రకాశ్ రెడ్డికి టికెట్ ఇస్తా అంటావ్ - మంత్రి కొండా సురేఖ...

స్టార్ హోటల్ల దోశ గిట్లనే తినాల్నట!?|ADUGU TRENDS

శిన్నప్పుడు మనం ఎట్ల తినాల్నో? ఎట్ల తినకూడదో మన అవ్వయ్యలు నేర్పిత్తురు. అన్నలక్కలు కూడా శెప్తరు. గట్లనే మనం తినడం నేర్సుకుంటం. పెద్దగైనంక సుత.. గట్ల తినుడే అలవాటు శేసుకుంటం. కనీ, పెద్ద పెద్ద...

ఉగ్రవాదం : అనుమానమే ఆయుధం కాకూడదు!?|EDITORIAL

దేశ భద్రతకు ‘ప్రజలు కూడా బాధ్యతాయుతమైన సమాచార భాగస్వాములుగా ఉండాలి. నిఘా సంస్థలు ఆధారాలను విశ్లేషించి, చట్టబద్ధమైన దర్యాప్తు ద్వారా నిందితులను గుర్తించాలి. ఉగ్రవాదంపై కఠిన చర్య అవసరం. అదే సమయంలో నిరపరాధ...

ఆగస్టు19, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తిధి శు.సప్తమి రాత్రి 08.09 వరకు ఉపరి అష్టమి నక్షత్రం స్వాతి ఉదయం 08.58 వరకు ఉపరి విశాఖ యోగం శుక్ల ఉదయం 06.37 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 07.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

హవ్వ…ఆవు పెండ మట్టితోటి శివలింగం!?|ADUGU TRENDS

సావును తప్పించుకోవడానికి భక్త మార్కండేయుడు శివలింగాన్ని బిర్రుగ కావలిచ్చుని తపస్సు శేసిండు. యముడి పాశం శివలింగానికి తాకడంతోటి శివుడికి కోపమొచ్చిందిట. యముడిని తరిమికొట్టి మార్కండేయునికి చిరంజీవిగా వరం ఇచ్చిండట. గట్లనే తిన్నడు గదేనుల్ల భక్త...

మరి, ‘సౌరశక్తి మంథన్’ మాటేమిటి!?|EDITORIAL

చమురు, గ్యాస్‌ అన్వేషణ దేశానికి తక్షణ, వ్యూహాత్మక ప్రయోజనాలను అందించవచ్చు. కానీ అవి పరిమిత వనరులు. సూర్యుడు మాత్రం నిరంతర ఇంధన వనరు. అందుకే ‘సముద్ర మంథన్‌’తో పాటు ‘సౌర శక్తి మంథన్‌’...

ఆగస్టు 18, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం మంగళగౌరి వ్రతం తిధి శు.షష్ఠి రాత్రి 07.11 వరకు ఉపరి సప్తమి నక్షత్రం చిత్త ఉదయం 07.34 వరకు ఉపరి స్వాతి యోగం శుభ ఉదయం 07.00 వరకు ఉపరి శుక్ల కరణం కౌలవ ఉదయం 06.58 వరకు ఉపరి...

ఆగస్టు 17, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం నాగ పంచమి గరుడ పంచమి తిధి శు.పంచమి సాయంత్రం 06.43 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం హస్త ఉదయం 06.40 వరకు ఉపరి చిత్త యోగం సాధ్య ఉదయం 07.51 వరకు ఉపరి శుభ కరణం బవ ఉదయం...

గా ఊల్లె తాగొద్దు..!?|ADUGU TRENDS

ఎనకటికి 'మందు తాగనోడు దున్నపోతై పుట్టున్ ' అన్నరు. కానీ గా ఊరోల్లు మాత్రం మందు తాగితే జరిమానా ఏత్తం అంటున్నరు. పెండ్లి కానోళ్లు తాగొద్దట! పెండ్లి అయినోళ్ళు తాగొచ్చట? కానీ, కొట్లాడుకోవద్దట! తమిళనాడు...

రాహుల్ గాంధీ ముందున్న సవాల్ ఇదే!?|EDITORIAL

రాహుల్ గాంధీకి ఇప్పుడు ఎదురున్న అసలు సవాల్ మోదీని వ్యక్తిగతంగా విమర్శించడం కాదు. తన రాజకీయ శైలిని పునర్నిర్మించుకోవడం. సభలో హుందాతనం, వాస్తవాలపై పట్టు, విదేశాంగంపై బాధ్యతాయుతమైన భాష, పార్టీ పునర్వ్యవస్థీకరణ, యువ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News