Sunday, November 1, 2026
28.8 C
Hyderabad

గీ బూరు మిఠాయి గింత పని శేసిందా!?|ADUGU TRENDS

యెనకటికి ఓ సైకోలు మీదనో, మూడు గిర్రల బండి మీదనో.. ఓ గంట మోగేది. గది మెల్లెగా మన వాడల్లోకి వచ్చేది. ఇగ గది సూద్దుం గదా? గావాటి మీద ఎర్రగనో, గులాబీలోనో గాల్ల తేలిపోయే మొగుల్ల లెక్క రంగుల్ల కనబడేయి. దగ్గరకి పోదుం కదా? గా పిల్లగాల్లకు కాసంత గదిచ్చేటాయెన. ఇగ గది తిందుం గద… తియ్యగ, కమ్మగుండేది. గదేందంటే.. బూరు మిఠాయనేటోడు. ఇగ గదాన్ని పైస కానుంచి రూపాల దాకా పెట్టి తిన్న తరాలున్నయి. ఇగిప్పుడైతే గది మన వాడల్ల నల్ల పూసైందనుకోండ్లి. కనీ, గదాంతోటి ఓకామె కోట్లు సంపాయిత్తాందట. అవుమల్లా.. ఆశీరపోకుండ్రి మరి.

కొత్త ఆలోశెనెలకు సరికొత్త రుసులు తొడైనయి. గంతే, గామె గా బూరు మిఠాయితోనే కోట్లు కొల్లగొడ్తాంది. గదేంది? గా బూరు మిఠాయి గంత శేత్తదా అంటే అవుమల్ల… గదే జరిగింది. గీమె పేరు నిహారిక గొల్లపల్లె. గవాల్లింట్ల బువ్వ తిన్నంక మిఠాయిలు తినుడు అలవాటట. గదే గీ ఆలోశెనెకు అంకురమైందంట. గవాట్ల గా బూరు మిఠాయి గామెను మస్తు ఆకట్టుకుందంట. గట్లనే గా కేఎఫ్సీ, డొమినోస్ అనే కంపెనీలు తయారు శేసే పదార్థాలను బాగ పరీచ్చ శేసిందంట. ఇగ ఓ దోస్తుతో కలిసి, గా బూరు మిఠాయిల రకరకాల తినే పదార్థాలు కలిపి, ఓ కొత్త రుసిని తయారు శేసిందంట. గదాన్ని తన పెనిమిటి నడిపే ఓ తినే దుకుణంల పెట్టిందంట. జనాలు బాగా తింటాంటే సూసి, గదానికి గదేనుల్ల గా కాటన్ క్యాండీ.. బూరు మిఠాయికి 2018ల ‘ఈట్ కాన్ఫెట్టి’ అనే పేరు పెట్టిందంట. ఇగిప్పుడు గది ముంబయి, లఖ్ నవూ, విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, హైదరాబాద్… అసొంటి పట్నాలల్ల16 అవుట్లెట్లతోటి పాన్ ఇండియా స్థాయికి గా ‘ఈట్ కాన్ఫెట్టి’ విస్తరించిందింట. ఇగ పెట్టుబడికి పది రెట్ల లాభాలొత్తానయట. కొత్తగా ఆలోశిత్తే.. మత్తు లాభాలున్నయుల్లో.. !?

Latest News

పట్టా శాశ్వతం.. ఓటు మాత్రం తాత్కాలికమా!?|ESSAY|GRADUATES

ప్రజాస్వామ్యానికి పునాది ఓటు హక్కు. అర్హులైన ప్రతి పౌరుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తన ఓటును వినియోగించుకునేలా ఎన్నికల వ్యవస్థ ఉండాలి. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు విధానం మాత్రం...

కరెంట్ అఫైర్స్|CURRENT AFFAIRS|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|EDUCATION

1) లడఖ్‌లోని పుగా వ్యాలీలో భారతదేశపు మొట్టమొదటి జియోథర్మల్ బావులు తూర్పు లడఖ్‌లోని పుగా వ్యాలీలో 1,000 మీటర్ల లోతు కలిగిన భారతదేశపు మొట్టమొదటి మరియు అత్యంత లోతైన జంట జియోథర్మల్ (భూగర్భ ఉష్ణ)...

పేదరికంపై భారత్ విజయం|EDITORIAL

ఒకప్పుడు పేదరికం భారత్‌ను వెంటాడింది.. ఇప్పుడు అదే పేదరికంపై దేశం గణనీయమైన విజయం సాధిస్తోంది! 12 ఏళ్లలో 49.6 కోట్ల మందికి ఊరట. ఇది అభివృద్ధికి సంకేతమేనా? అసమానతల అంతానికి ఇంకా ఎంత...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

నవంబర్ 01 నుండి నవంబర్ 07 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త ఆలోచనలు కార్యరూపం దాల్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగ రంగంలో మీ ప్రతిభకు తగిన...

ఉపవాసం లేదని యిడుపు కాయితం!?|ADUGU TRENDS

ఆలుమొగల బంధం పాలునీల్ల లెక్క కలిసిపోయేది. ఎంతో యిలువైంది. వందేండ్ల పానాలకు నూరేండ్ల అనుబంధం. కానీ గా పెనిమిటి, పెండ్లాంల జీవితాలు కుక్కలు శింపి, ఇసిరేసిన ఇస్తరిలెక్కైతానయి. శీటికి మాటికి శిల్లర పంచాయితీలు,...

ప్రతి నీటి చుక్కా విలువైనదే!|EDITORIAL

ఎల్‌నినో హెచ్చరికలు.. అడుగంటుతున్న జలాశయాలు.. పెరుగుతున్న ట్యాంకర్ల డిమాండ్‌! భాగ్యనగరానికి జలగండం ముంచుకొస్తోందా? రేపటి దాహాన్ని తీర్చేందుకు నేడే మేల్కోవాలి. ప్రభుత్వ ముందుచూపుతో పాటు ప్రజల నీటి పొదుపే మహానగరానికి శ్రీరామరక్ష! మార్గం -...

అక్టోబర్ 31, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం కృష్ణపక్షం తిధి షష్ఠి రాత్రి 09.13 వరకు ఉపరి సప్తమి నక్షత్రం ఆరుద్ర పగలు 12.05 వరకు ఉపరి పునర్వసు యోగం సిద్ద రాత్రి 10.57 వరకు ఉపరి సాధ్య కరణం గరజి ఉదయం 10.24 వరకు ఉపరి...

గీ కుక్క-కోతిని సూసి నేర్సుకోవాలె!?|ADUGU TRENDS

కుక్క-కోతిలది పుట్టుకతోనే వైరం. వాటి స్వభావికం కూడా. కోతులను తరిమికొట్టడానికి కుక్కలను సాదుతరు. గాడాడ గా కుక్కలు, కోతులు కలిసి మెలిసి కూడా ఉంటయి. గట్లనే గా ఒడిశా రాష్ట్రం కలహండి జిల్ల కేంద్రం...

గ్రహణం వీడేనా? గూడూరు కు హాస్టల్ తిరిగి వచ్చేనా?|PALAKURTHI|EDUCATION

-అడుగు కథనంతో కదిలిన అధికార యంత్రాంగం -ప్రజా ప్రతినిధుల్లోనూ కదలిక దాతలు కీ.శే బొబ్బల రంగారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారులు బొబ్బల రమణారెడ్డి, బొబ్బల అశోక్ రెడ్డి లు స్వచ్ఛందంగా, ఉచితంగా పేద విద్యార్థుల భవిష్యత్తు...

అన్నం అందనంత ఎత్తులో…|EDITORIAL

అన్నం పెట్టే బియ్యమే ఇప్పుడు సామాన్యుడికి భారంగా మారింది! బస్తా ధర రూ.2 వేలు దాటుతుంటే, పప్పులు, పంచదార ధరలూ మండిపోతున్నాయి. వర్షాభావం ప్రభావమా? వ్యాపారుల ధరల మాయాజాలమా? మార్కెట్‌పై నిఘా ఏదీ? మార్గం...

అక్టోబర్ 30, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం కృష్ణపక్షం తిధి పంచమి రాత్రి 11.37 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం మృగశిర పగలు 01.45 వరకు ఉపరి ఆరుద్ర యోగం శివ రాత్రి 02.04 వరకు ఉపరి సిద్ద కరణం కౌలవ పగలు 12.47 వరకు ఉపరి...

తుఫాన్లే.. గి పొల్లగాండ్ల పేర్లు!?|ADUGU TRENDS

తుఫాన్లు, వరదలు, భూకంపాలు పకృతి వైపరీత్యాలప్పుడు పుట్టిన పిల్లలకు, గా కట్టాలను తట్టుకుని బతికి బట్టకట్టినందుకు గురుతుగనో లేకపోతే, గా ఘటనల జ్ఞాపకార్థమో గనీ, గా తల్లిదండ్రులు గా తుఫాన్ల పేర్లను పెట్టడం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News