75 వేల ఆర్ధిక సహాయం అందించిన ఎమ్మెల్యే
స్టేషన్ ఘనపూర్ మండలం, ఇప్పగూడెం గ్రామంలో ప్రమాదవశాత్తు వంట గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన మూడు ఇండ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. నేడు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారు బాధిత కుటుంబాలను కలసి వారిని పరామర్శించారు. ఈ ప్రమాదకటనలో తోడెంగుల మల్లయ్య, తోడెంగుల కృష్ణ మూర్తి, తోడెంగుల ఐలయ్య ఇండ్లు పూర్తిగా కాలిపోవడం బాధాకరమని ఎమ్మెల్యే అన్నారు. వారితో మాట్లాడి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పి 75 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు అందజేశారు. మూడు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు ఇస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

