Friday, November 27, 2026
23.2 C
Hyderabad

‘ఢీ’లిమిటేషన్ కు మరోసారి మో‘ఢీ’!?|EDITORIAL

నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల బిల్లుల ఆమోదానికి మోదీ సర్కార్ మరోసారి సిద్ధమైంది. మొదటిసారి దెబ్బతిన్న ప్రభుత్వం ఈసారి పకడ్బందీగా వ్యూహరచన చేస్తోంది. నవంబర్ 30 నుంచి లోక్‌సభ, డిసెంబర్ 2 నుంచి రాజ్యసభ తిరిగి సమావేశం కానుండగా, డిసెంబర్ 3తో ఈ సమావేశాలు ముగిసే అవకాశం ఉంది. అన్ని రాష్ట్రాలకు ఏకరీతిగా 50శాతం సీట్లు పెంచడంతోపాటు, 25 ఏళ్ళ పాటు పెంచిన సీట్లను ఫ్రీజ్ చేసే విధంగా నవంబర్ 27న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపనుంది! మరి ఆ బిల్లులు ఈసారి ఆమోదం పొందుతాయా? అందుకు తగిన సంఖ్యాబలం ఉందా? ఏం జరగనుంది?

మార్గం – అడుగు, ఎడిటోరియల్ 

పార్లమెంట్‌లో మరో కీలక రాజకీయ పోరుకు రంగం సిద్ధమవుతోంది. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన బిల్లులను మరోసారి ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం వ్యూహరచన చేస్తోంది. నవంబర్ 30 నుంచి లోక్‌సభ, డిసెంబర్ 2 నుంచి రాజ్యసభ తిరిగి సమావేశం కానుండగా, డిసెంబర్ 3తో ఈ సమావేశాలు ముగిసే అవకాశం ఉంది. అయితే ఈ భేటీల్లో ఏయే బిల్లులను ప్రవేశపెడతారనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించిన వివరాలు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అన్ని రాష్ట్రాలకు ఏకరీతిగా 50శాతం సీట్లు పెంచడంతోపాటు, 25 ఏళ్ళ పాటు పెంచిన సీట్లను ఫ్రీజ్ చేసే విధంగా నవంబర్ 27న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపనుంది.

గత ఏప్రిల్‌లో ఇదే అంశాలపై కేంద్రం ప్రవేశపెట్టిన రాజ్యాంగ 131వ సవరణ బిల్లుకు లోక్‌సభలో అవసరమైన మద్దతు లభించలేదు. ఏప్రిల్ 17న జరిగిన ఓటింగ్‌లో 298 మంది అనుకూలంగా, 230 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. మొత్తం 528 మంది ఓటింగ్‌లో పాల్గొనగా, మూడింట రెండొంతుల మద్దతు సాధించడానికి 352 ఓట్లు అవసరమయ్యాయి. దీంతో బిల్లు 54 ఓట్ల తేడాతో వీగిపోయింది. ప్రస్తుత సభలో 540 మంది సభ్యులున్న నేపథ్యంలో పూర్తి సభ్యుల ప్రాతిపదికన అవసరమైన మద్దతు 360కి పైగా ఉంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం ప్రత్యేక మెజారిటీ సాధించడం తప్పనిసరి.

అప్పటితో పోలిస్తే ఇప్పుడు రాజకీయ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రతిపక్ష శిబిరం నుంచి కొందరు ఎంపీలు వైదొలగడం, కొన్ని పార్టీల్లో అంతర్గత పరిణామాలు చోటుచేసుకోవడం కేంద్రానికి కొత్త ఆశలు కల్పిస్తున్నాయి. తాజాగా లోక్ సభలో ఒక్క సభ్యుడు మాత్రమే ఉన్న శిరోమణి అకాలీదల్ ఎన్డీఏతో జత కట్టింది. ఎన్డీఏకు 320 మంది సభ్యుల మద్దతు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయినప్పటికీ, రాజ్యాంగ సవరణకు అవసరమైన సంఖ్యను చేరుకోవాలంటే ఇతర పార్టీల మద్దతు కీలకం. డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ, ఎన్సీపీ, ఆప్ తదితర పార్టీల వైఖరి ఈసారి నిర్ణయాత్మకంగా మారవచ్చు. అయితే, వీరంతా కానీ, వీరిలో కొందరు కానీ, ప్రభుత్వానికి మద్దతు ఇస్తారా? అన్నది తేలాల్సి ఉంది.

డీలిమిటేషన్‌పై ప్రధాన అభ్యంతరం దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యానికి సంబంధించినదే. జనాభా నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధించిన రాష్ట్రాలకు లోక్‌సభలో ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుత లోక్‌సభలో 543 స్థానాలుండగా, ప్రతిపాదిత ప్రణాళిక ప్రకారం గరిష్ఠంగా 850 స్థానాలకు పెంచే అంశం గతంలో చర్చకు వచ్చింది. అన్ని రాష్ట్రాలకు సమానంగా 50 శాతం సీట్లు పెంచాలన్న ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది. అయితే దీనిపై చట్టపరమైన స్పష్టత అవసరం. జనాభా ప్రాతిపదిక, రాష్ట్రాల మధ్య సమతౌల్యం, సమాఖ్య స్ఫూర్తి వంటి అంశాలపై విస్తృత చర్చ జరగాల్సి ఉంది.

2023లోనే పార్లమెంట్ మహిళలకు లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని ఆమోదించింది. అయితే, జనగణన, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియతో అమలును అనుసంధానించడంతో ఇప్పటికీ రిజర్వేషన్లు కార్యరూపం దాల్చలేదు. మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలన్న లక్ష్యానికి విస్తృత మద్దతు ఉన్నప్పటికీ, దానిని డీలిమిటేషన్‌తో ముడిపెట్టడంపైనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈసారి కేంద్రం ముందున్న అసలు సవాలు లోక్‌సభలో అవసరమైన ప్రత్యేక మెజారిటీ సాధించడమే. రాజ్యసభలోనూ సంబంధిత బిల్లులకు అవసరమైన మద్దతు నిర్ధారించుకోవాలి. పార్లమెంట్ సమావేశాలను ప్రొరోగ్ చేయకుండా కొనసాగించడం, తిరిగి సభలను సమావేశపరచడం వంటి పరిణామాలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే, సంఖ్యాబలం ఉందన్న అంచనాలు, వాస్తవ ఓటింగ్ ఫలితాలు ఒకటి కావు. మహిళా సాధికారతతో పాటు రాష్ట్రాల సమాన ప్రాతినిధ్యాన్ని కాపాడటం కూడా అంతే ముఖ్యం. అందువల్ల ఈ సమావేశాలు కేవలం బిల్లుల ఆమోదానికి పరిమితం కాకుండా, దేశ ప్రజాస్వామ్య భవిష్యత్తును ప్రభావితం చేసే కీలక చర్చలకు వేదిక కావాలి. చివరకు బిల్లుల భవితవ్యాన్ని నిర్ణయించేది రాజకీయ ప్రచారాలు కాదు.. సభలో నమోదయ్యే ఓట్లే!

Latest News

‘అచ్ఛా’యా!?..ఇందిరమ్మ చీరలు!|ADUGU BULLET

కోటిమంది ఆడబిడ్డలకు రేవంత్ సర్కార్ ఇస్తోంది ఇందిరమ్మ చీరల కానుక!! నాడు కేసీఆర్ చేశాడుగా బతుకమ్మ చీరల వేడుక!! బీఆర్ఎస్ ఇచ్చిన చీరలు అప్పడు..అక్కా చెల్లెండ్లు కట్టలే! చీరలు పంచినా..‘ఛీ’వాట్లు తప్పలే!! కాంగ్రెస్ ఇస్తున్న చిలుక పచ్చ చీరలను తెలంగాణ...

ఆవ్వానం లేకుండొత్తే, జరిమానా, జైలు శిచ్చ!?|ADUGU TRENDS

ఒకప్పుడు కుటుంబ సంబంధాలు ఎంతో పకడ్బందీగా ఉండేయి. గా ఫెవికాల్, ఫెవికిక్ కంటే గట్టిగ అతికినట్టుండేయి. ఎవ్వలింట్ల ప్రభోజనమైనా, అందరిండ్లల్ల పండుగలెక్కనే ఉండేది. పొరపాటునో, గ్రహపాటునో ఎవర్నన్నా పిలుసుడు మరిసిపోతే, ఇగ భూగోళం...

నవంబర్ 27, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీకమాసం కృష్ణపక్షం సంకటహర చతుర్థి తిధి తదియ పగలు 02.15 వరకు ఉపరి చవితి నక్షత్రం ఆరుద్ర రాత్రి 08.17 వరకు ఉపరి పునర్వసు యోగం సాధ్య ఉదయం 08.48 వరకు ఉపరి శుక్ల కరణం భద్ర పగలు 02.15...

నోరు జారె.. ! ఎనక్కి తీసుకునె!!|ADUGU BULLET

కవితకు ఎయిడ్స్ రోగమని.. మంత్రి సీతక్క నోరు జారె! సోషల్ మీడియాలో రచ్చ రచ్చతో పాపం..! పెద్దక్క మాట మార్చె! కవితక్కకు సారీ చెప్పి.. విమర్శలకు ముగింపు పలికె! అన్న కేటీఆర్ ను తిట్టబోయి.. చెల్లి కవితకు...

భవిష్యత్తు దార్శనికం మన రాజ్యాంగం|NARENDRA MODI|CONSTITIUTION

(నేడు భారత రాజ్యాంగ దినోత్సవం) రాజ్యాంగ పరిషత్తు 1949 నవంబరు 26న మన రాజ్యాంగాన్ని ఆమోదించింది. ఈ నేపథ్యంలో మనమిప్పుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, బాబాసాహెబ్ అంబేడ్కర్ సహా రాజ్యాంగ పరిషత్తులోని ప్రతి సభ్యుడినీ...

అమ్మ పేమా? తల్లి పగా!?|ADUGU TRENDS

పేమకు సాటి లేదు. పగకు పాటి లేదు. ఒక కుక్కపల్లి, చిరుత పులిల గీ ముచ్చట గిదీన్నే రుజువు శేసింది. పిల్లికి చెలగాటం, ఎలుకకు పాణ సంకటం అన్నట్లు... పులికి చెలగాటం.. కుక్కకు...

హసీనాకు శిక్షా? రక్షా!?|EDITORIAL

హసీనా స్వదేశానికి తిరిగి వెళ్ళడం భారత్‌-బంగ్లాదేశ్ దౌత్య సంబంధాలు, న్యాయవ్యవస్థ విశ్వసనీయత, ప్రజాస్వామ్య భవిష్యత్తుకు సంబంధించిన కీలక పరిణామం. ఆమెకు ఉరిశిక్ష తప్పుతుందా? లేక న్యాయపరమైన మరో పోరాటానికి తెరలేస్తుందా? అన్నది భారత్...

నవంబర్ 26, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీకమాసం కృష్ణపక్షం తిధి విదియ సాయంత్రం 04.39 వరకు ఉపరి తదియ నక్షత్రం మృగశిర రాత్రి 09.57 వరకు ఉపరి ఆరుద్ర యోగం సిద్ద ఉదయం 11.49 వరకు ఉపరి సాధ్య కరణం గరజి సాయంత్రం 04.39 వరకు ఉపరి...

మనుసుల కంటే గా రోబేలో ఎక్కువా!?|ADUGU TRENDS

యెనకటికి మనుసులు యెన్నో శక్తియుక్తులు పదర్శించేటోల్లు. స్రుస్టికి పతి స్రుస్టి శేసేటోల్లు. మట్టి బొమ్మలకు, రాయి రప్పలకు పానం పోసేటోల్లు. గట్ల ఒచ్చినయే గీ రోబోలు. యినుప ముక్కలను మనిసి లెక్క ఒక్కటి...

శక్తివంతమైన భారత్-ఆసియాలో అగ్రగామి!|EDITORIAL

ఒకప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న భారత్, నేడు ప్రపంచ దేశాలతో పోటీపడుతూ కీలక శక్తిగా ఎదుగుతోంది. అభివృద్ధితో పాటు సమానత్వం, ప్రజాసంక్షేమం, సామాజిక న్యాయం, అంతర్జాతీయ విశ్వసనీయతకు ప్రాధాన్యతనిస్తూ శక్తివంతమైన, సమృద్ధివంతమైన...

నవంబర్ 25, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీకమాసం కృష్ణపక్షం తిధి పాడ్యమి సాయంత్రం 06.53 వరకు ఉపరి విదియ నక్షత్రం రోహిణి రాత్రి 11.30 వరకు ఉపరి మృగశిర యోగం శివ పగలు 02.56 వరకు ఉపరి సిద్ద కరణం బాలవ ఉదయం 07.53 వరకు ఉపరి...

మన దేశంల మైనపు యిగ్రహాల మ్యూజియం!?|ADUGU TRENDS

పక్రుతి లెక్కనే గీ పపంచం యింతలు, యిశేషాల మయం. రకరకాల యిగ్రహాలను శేసే పద్ధతి ఉన్నట్లే, గా మైనపు బొమ్మలను గదే గా ఓంబత్తి, కొవ్వొత్తితో శేసి, గవాటిని ఓకాడ గదేనుల్లా.. మ్యూజియంల...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News