కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 8,000 మంది రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఆర్థిక, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.
పోలీస్ అధికారి ఠాగూర్ నారాయణ సింగ్ పరిస్థితి బాధాకరమని, 30 ఏళ్లపాటు ప్రభుత్వ సేవలు అందించిన ఆయన, రిటైర్మెంట్ ప్రయోజనాలు అందక చికిత్స పొందలేకపోతున్నారని హరీశ్ రావు తెలిపారు. ఆరోగ్య భద్రత కార్డును ఆసుపత్రులు తిరస్కరించడం ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనం అని పేర్కొన్నారు.
“ఇది ఒక్కరి సమస్య కాదు, 8,000 మంది ఉద్యోగుల భవిష్యత్‌కు సంబంధించిన అంశం” అని స్పష్టం చేశారు. ఉద్యోగుల పట్ల నిజమైన బాధ్యత చూపించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేసి, ఆరోగ్య భద్రత కార్డులను సమర్థంగా అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

