ఆర్‌ఎస్ ప్రవీణ్, మాజీ హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ డీసీపీగా తన అనుభవాన్ని ఆధారంగా తీసుకుని, కేటీఆర్‌పై ఏసీబీ నమోదు చేసిన కేసు (FIR 14/2024) గురించి ట్వీట్ చేశారు. ఈ కేసులో కేటీఆర్ గారిపై ఏ అవినీతి ఆరోపణను కూడా నిరూపించలేకపోయారని, ప్రొసీజర్ వయోలేషన్లు మాత్రమే చూపించగలిగారని చెప్పారు. వయోలేషన్లపై శాఖా పరమైన విచారణ చేయాల్సిన విషయాన్ని సైతం గుర్తు చేశారు. ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగిందంటే, రేవంత్ రెడ్డి తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్లేనని, ఫార్ములా-ఇ అగ్రిమెంట్ రద్దుతో తెలంగాణ వందల కోట్ల రాబడిని కోల్పోయిందని ఆరోపించారు. ఆఖర్లో, “ఇది దాచలేని సత్యం. తెలంగాణ ఖజానాను పూరించాలంటే రేవంత్ రెడ్డిని జైలుకు పంపించాలి,” అని వ్యాఖ్యానించారు.

