రెండు ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు రేపు లేదా ఎల్లుండి రైతు భరోసా నిధులు వారి బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం ఎకరం వరకు భూమి కలిగిన వారికి రూ. 6,000 చొప్పున అందజేసింది. గతంలోలానే ఈసారి కూడా ఎకరా, రెండు ఎకరాలు, మూడు ఎకరాల విభజన ప్రకారం రైతు భరోసా సాయాన్ని విడతల వారీగా అందించేందుకు నిర్ణయం తీసుకుంది. తొలి విడతలో దాదాపు 17 లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసినట్లు సమాచారం.

