Wednesday, August 19, 2026
26.1 C
Hyderabad

Government|పాలనలో పురోగతికి మార్గదర్శకంగా కీలక నిర్ణయాలు|Decision

ఏపీ cabinet| కేబినెట్ సమావేశం నిర్ణయాలు ప్రకటించిన minister| మంత్రి పార్ధసారథి |Parthasarathi

Andhra Pradesh| ఆంధ్రప్రదేశ్ State| రాష్ట్ర Cabinet| మంత్రివర్గం ఏడాది పాలనలో 26 కేబినెట్ సమావేశాలు నిర్వహించి అనేక ప్రజా సంక్షేమ, అభివృద్ధి నిర్ణయాలను తీసుకుందంటూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పార్ధసారథి తెలిపారు. ప్రతి 15 రోజులకు ఒకసారి కేబినెట్ సమావేశం నిర్వహించి Chief Minister| ముఖ్యమంత్రి Chandrababu| చంద్రబాబు ఆధ్వర్యంలో కీలకమైన విధానాత్మక నిర్ణయాలు తీసుకోవడం పాలనలో పారదర్శకతకు, చర్చల ప్రాధాన్యతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

రాజధాని నిర్మాణానికి అవసరమైన భూముల సేకరణ కోసం ల్యాండ్ పూలింగ్ రూల్స్–2025 రూపొందించి కేబినెట్ ఆమోదించినట్టు మంత్రి తెలిపారు. అసైన్డ్ భూములపై వివాదాలు లేకుండా, పునర్విమర్శలతో రీ సర్వే చేసి మెరుగైన ప్యాకేజీతో ల్యాండ్ పూలింగ్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. జీఎడీ టవర్, హెచ్‌వోడి టవర్ల నిర్మాణ పనులు ఎన్‌సీసీ, షాపూజీ పల్లంజీ, ఎల్ అండ్ డీలకు అప్పగించినట్టు వివరించారు.

రాష్ట్రంలో కొత్తగా 7 అన్న క్యాంటీన్లు ప్రారంభించనున్నట్టు తెలిపారు. భవన నిర్మాణాల నిబంధనల్లో మార్పులు చేస్తూ, వాటిని సులభతరం చేయాలని కేబినెట్ ఆమోదించినట్టు తెలిపారు. టెన్నిస్‌లో రజత పతకం సాధించిన సాకేత్ సాయికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పర్యాటక అభివృద్ధిలో భాగంగా గండికోట వద్ద రిసార్టు నిర్మాణానికి 50 ఎకరాల భూమి కేటాయించిందని తెలిపారు.

శ్రీశైలం డ్యామ్, సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ భద్రతా పనుల కోసం రూ.350 కోట్లు మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వేగవంతం చేయాలని సీఎం ఆదేశించినట్టు చెప్పారు. గోదావరి నుంచి వృథాగా సాగిపోయే 3 వేల టీఎంసీలు నీటిని వినియోగించుకునేందుకు పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు తీసుకువచ్చినట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టు ఇరు రాష్ట్రాలకు ప్రయోజనం కలిగించే విధంగా చేపట్టనున్నట్టు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

Vijayawada| విజయవాడలో Ambedkar| అంబేడ్కర్ విగ్రహ ప్రాంగణాన్ని సోషల్ వెల్ఫేర్ శాఖ నుంచి ఏపీ కల్చరల్ డిపార్ట్‌మెంట్‌కు బదిలీ చేయాలని నిర్ణయించగా, పెండింగ్ పనులకు నిధులు విడుదల చేసి పూర్తి చేయనున్నట్టు వెల్లడించారు. రాజధాని అమరావతిలో అధునాతన సదుపాయాలతో కన్వెన్షన్ సెంటర్ నిర్మించనున్నట్టు తెలిపారు. పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

రాష్ట్రంలో 4,687 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేయనున్నట్టు తెలిపారు. విశాఖపట్నం మధురవాడలో 22.19 ఎకరాల్లో కాగ్నిజెంట్ సంస్థ 1,582 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమ ఏర్పాటు చేయనుందని, దాని ద్వారా 8,000 ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అమరావతిలో E3 రోడ్డును NH-16 కు అనుసంధానించేందుకు రూ.682 కోట్లకు టెండర్లు ఆమోదించినట్టు వెల్లడించారు.

ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా 273.17 కోట్లతో పొగాకు కొనుగోలు చేయనున్నట్టు, 20 మిలియన్ టన్నుల పొగాకు సేకరించాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. వచ్చే ఏడాది పొగాకు సాగు కోసం క్రాప్ హాలిడే ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. పరిశ్రమల రంగంలో రాష్ట్రానికి 28,546 కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, వీటిద్వారా 30,270 ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. స్మార్ట్ ఆంధ్ర సంస్థను “స్వర్ణాంద్ర పి4 ఫౌండేషన్”గా మారుస్తూ ప్రతిపాదనలు ఆమోదించినట్టు తెలిపారు.

ఏడాది పాలన సందర్భంగా జిల్లా, నియోజకవర్గ స్థాయిలో సభలు నిర్వహించాలని సీఎం ఆదేశించారని చెప్పారు. అదే సమయంలో పల్నాడు పర్యటన సందర్భంగా JAGAN| జగన్ చేపట్టిన కార్యకలాపాలను తప్పుబడుతూ, అనుమతులేకుండా నిరసనలు, బలప్రదర్శన నిర్వహించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. నరికేస్తాం, తొక్కేస్తాం లాంటి భాషను సమర్థించడం దురదృష్టకరమని, ఇలాంటి హింసాత్మక భావజాలం ప్రజల మధ్యకు రాకూడదని హితవు పలికారు.

బనకచర్ల ప్రాజెక్టుపై ఎవరికైనా విమర్శ అవసరం లేదని, వృథాగా వెళ్లే గోదావరి నీటిని వినియోగించుకునేందుకు, రెండు రాష్ట్రాలకు లాభదాయకంగా ఉండేలా ఈ ప్రాజెక్టు రూపొందించామని తెలిపారు. సామరస్యపూర్వక చర్చల ద్వారానే బనకచర్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలనే దృక్పథాన్ని సీఎం చంద్రబాబు కలిగి ఉన్నారని మంత్రి పార్ధసారథి వివరించారు.

Latest News

వరుస ఆరోపణలు.. షోకాజ్ నోటీసులు!|CONGRESS|NOTICE

తెలంగాణ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతుంది?|TELANGANA|CM|REVANTH REDDY|KONDA FAMILY తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ కుటుంబం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గం మధ్య...

సుస్మితకు ఎమ్మెల్యేల ఘాటు కౌంటర్|KONDA FAMILY|MLAS|COUNTER

క్రమశిక్షణ చర్యలపై కాంగ్రెస్‌ ఫోకస్|MALLU RAVI|CONGRESS|FOCUS తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఇటీవల పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో...

సీఎం అయ్యాక కళ్ళు నెత్తికెక్కాయా….|TELANGANA|CONGRESS|KONDA|REVANTH REDDY

సీఎం రేవంత్ వర్సెస్ కొండా కుటుంబం!|CM|KONDA SUSMITHA ఒకవైపు జెన్ జీ వాళ్లకు టిక్కెట్లు ఇవ్వాలి అంటావ్ మరోవైపు డైపర్లు వేసుకొని తిరుగుతున్న రేవూరి ప్రకాశ్ రెడ్డికి టికెట్ ఇస్తా అంటావ్ - మంత్రి కొండా సురేఖ...

స్టార్ హోటల్ల దోశ గిట్లనే తినాల్నట!?|ADUGU TRENDS

శిన్నప్పుడు మనం ఎట్ల తినాల్నో? ఎట్ల తినకూడదో మన అవ్వయ్యలు నేర్పిత్తురు. అన్నలక్కలు కూడా శెప్తరు. గట్లనే మనం తినడం నేర్సుకుంటం. పెద్దగైనంక సుత.. గట్ల తినుడే అలవాటు శేసుకుంటం. కనీ, పెద్ద పెద్ద...

ఉగ్రవాదం : అనుమానమే ఆయుధం కాకూడదు!?|EDITORIAL

దేశ భద్రతకు ‘ప్రజలు కూడా బాధ్యతాయుతమైన సమాచార భాగస్వాములుగా ఉండాలి. నిఘా సంస్థలు ఆధారాలను విశ్లేషించి, చట్టబద్ధమైన దర్యాప్తు ద్వారా నిందితులను గుర్తించాలి. ఉగ్రవాదంపై కఠిన చర్య అవసరం. అదే సమయంలో నిరపరాధ...

ఆగస్టు19, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తిధి శు.సప్తమి రాత్రి 08.09 వరకు ఉపరి అష్టమి నక్షత్రం స్వాతి ఉదయం 08.58 వరకు ఉపరి విశాఖ యోగం శుక్ల ఉదయం 06.37 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 07.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

హవ్వ…ఆవు పెండ మట్టితోటి శివలింగం!?|ADUGU TRENDS

సావును తప్పించుకోవడానికి భక్త మార్కండేయుడు శివలింగాన్ని బిర్రుగ కావలిచ్చుని తపస్సు శేసిండు. యముడి పాశం శివలింగానికి తాకడంతోటి శివుడికి కోపమొచ్చిందిట. యముడిని తరిమికొట్టి మార్కండేయునికి చిరంజీవిగా వరం ఇచ్చిండట. గట్లనే తిన్నడు గదేనుల్ల భక్త...

మరి, ‘సౌరశక్తి మంథన్’ మాటేమిటి!?|EDITORIAL

చమురు, గ్యాస్‌ అన్వేషణ దేశానికి తక్షణ, వ్యూహాత్మక ప్రయోజనాలను అందించవచ్చు. కానీ అవి పరిమిత వనరులు. సూర్యుడు మాత్రం నిరంతర ఇంధన వనరు. అందుకే ‘సముద్ర మంథన్‌’తో పాటు ‘సౌర శక్తి మంథన్‌’...

ఆగస్టు 18, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం మంగళగౌరి వ్రతం తిధి శు.షష్ఠి రాత్రి 07.11 వరకు ఉపరి సప్తమి నక్షత్రం చిత్త ఉదయం 07.34 వరకు ఉపరి స్వాతి యోగం శుభ ఉదయం 07.00 వరకు ఉపరి శుక్ల కరణం కౌలవ ఉదయం 06.58 వరకు ఉపరి...

ఆగస్టు 17, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం నాగ పంచమి గరుడ పంచమి తిధి శు.పంచమి సాయంత్రం 06.43 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం హస్త ఉదయం 06.40 వరకు ఉపరి చిత్త యోగం సాధ్య ఉదయం 07.51 వరకు ఉపరి శుభ కరణం బవ ఉదయం...

గా ఊల్లె తాగొద్దు..!?|ADUGU TRENDS

ఎనకటికి 'మందు తాగనోడు దున్నపోతై పుట్టున్ ' అన్నరు. కానీ గా ఊరోల్లు మాత్రం మందు తాగితే జరిమానా ఏత్తం అంటున్నరు. పెండ్లి కానోళ్లు తాగొద్దట! పెండ్లి అయినోళ్ళు తాగొచ్చట? కానీ, కొట్లాడుకోవద్దట! తమిళనాడు...

రాహుల్ గాంధీ ముందున్న సవాల్ ఇదే!?|EDITORIAL

రాహుల్ గాంధీకి ఇప్పుడు ఎదురున్న అసలు సవాల్ మోదీని వ్యక్తిగతంగా విమర్శించడం కాదు. తన రాజకీయ శైలిని పునర్నిర్మించుకోవడం. సభలో హుందాతనం, వాస్తవాలపై పట్టు, విదేశాంగంపై బాధ్యతాయుతమైన భాష, పార్టీ పునర్వ్యవస్థీకరణ, యువ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News