నాడు నిజాం నిరంకుశ పాలనకు, దొరలకు, భూస్వాములకు వ్యతిరేకగా భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరుడైన జాటోత్ ఠాణు నాయక్ 75వ వర్ధంతి సందర్భంగా గిర్ని తండా చౌరస్తాలో ఉన్న వారి విగ్రహానికి పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సి రాజేందర్ రెడ్డి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఝాన్సీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ…. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తుపాకీ గుండ్లకు ఎదురొడ్డి నిలిచిన యోధుడు ఠాణు నాయక్ అని అన్నారు. ఠాణు నాయక్ ను ఆదర్శంగా తీసుకొని వారు చేసిన ఉద్యమాన్ని ప్రతి ఒక్కరికీ తెలియజేయాలని, వారు ఏ విధంగా అయితే వెట్టి చాకిరీ చెయ్యకుండా, గులాం గిరి చెయ్యకుండా, స్వతంత్రంగా ఏవిధంగా వారి జీవనాన్ని కొనసాగించారో భావితరాలకు తెలియచేయడానికి మనమంతా కృషి చేయాలి అన్నారు.
బాధిత కుటుంబాల పరామర్శ

పాలకుర్తి నియోజకవర్గం పరిధిలో పాలకుర్తి, కొడకండ్ల మండలాల పరిధిలో వివిధ గ్రామాల్లో చనిపోయిన కార్యకర్తల బాధిత కుటుంబాలను పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి పరామర్శించి, ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఆయా కార్యక్రమాల్లో బ్లాక్, మండల అధ్యక్షులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

