పేదోల్ల ప్రిజ్జు కూజలు, మట్టికుండల్ని సూసినం. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలన్నట్లు.. కొన్నింటికి మనం కొనలేనప్పుడు, గసొంటి వాటినే కాస తక్కువల తయారు చేసుకుంటం. రకరకాల ఉపాయాలు శేత్తం. ఇగ గీ పేదోడి ఏసీ గూడ గసొంటిదే! ఎట్లుందో సూద్దామా?

ఇగ ఎండలు మండబట్టె. పెనంల కెల్లి కుమ్ముల పడ్డట్లు, మంటల్ల మాడిపోతున్నట్లే ఉండబట్టె! ఇగ గీ యేడి నుంచి తట్టుకోవాల్నంటే ఏసీ లేనోల్లు ఏదో ఒకటి శేయాలె గద. ఇగో గదే ఇకమతు శేసిండు గీ శిన్నోడు. ఒక టేబుల్ ప్యాను తీసుకున్నడు. గదానికి ఎదురుంగ దండెం కట్టి, ఓ తువ్వాల ఆరేసిండు. గా తవ్వాలను నీల్లల్ల తడిపిండు. మల్ల గా తువ్వాల ఊకె తడిసి ఉండాల్నెని, గ దానికి ఓ గుల్కోసు సీసను పెట్టిండు. ఇగ గండ్ల కేసి సుక్క సుక్క నీల్లు గా తువ్వాలను తడిపేటట్లు శేసిండు. ఇగ గా ప్యాన్ను శాలు శేసిండు! ఇగ గా ప్యాను తిరుగుతనే ఉంది. తువ్వాల నీల్లతోటి తడుస్తనే ఉంది. సల్లగ ఏసీ లెక్క గాలి కొడతనే ఉంది! మంచిగుంది కదా గీ పేదోడి ఏసీ?

