ఇగిప్పుడు అందరి బాధా గా పెయ్యిల శెడు కొవ్వే! మనం తినే ఆహారపు అలవాట్లు, బతుకు తెరువులు బాగా మారినయి. జీవన శైలి గూడ మస్తుగ మారింది. ఇగ గిదీంతోటి పెయ్యిల అట్టు తేలినట్లు, కొవ్వు తెట్టె పేరుకుపోతున్నది. కార్జెం ఉబ్బుతాంది. దొబ్బ దొబ్బుతాంది. గా కిడ్నీలు పని శేత్తలేవు. క్యాన్సర్లు రాస పుండులెక్క సలుపుతానయి. ఊకూకెనే పానాలు పోతానయి. ఇగ గిసొంటి వాటికి తావులేకుండ సేయాల్నంటే ఒక శిన్న శిట్కా శేద్దాం. గీ పానాలు పుటుక్కున పోకుండ, గా కొవ్వును కటక్కున కతం చేద్దాం.

ఓ నాలుగైదు లేకపోతే ఐదారు ఎల్లిపాయ రిబ్బలు తీసుకోవాలె. గ వాటిని నోట్లేసుకుని నమిలి, గిన్నన్ని నీల్లు నోట్లో పోసుకుని మింగాలె. ఇగ గట్ల శేత కాకపోతే, గవాటిని తేనెల కలుపుకుని నమిలి మింగాలె. ఇగ గది గూడ కాదంటే, గా ఎల్లిపాయెల్ని గిన్నన్ని నీల్లల్ల యేసి, కాసేపు ఉడక బెట్టాలె. కాస సల్లారినంక.. గవాటిని తినాలె. గా నీల్లు తాగాలె. గంతే. గుండె నొప్పులు, హార్ట్ అటాక్ లు రావట. మీరూ శేసి సూడుండ్రి మరి.

