తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు అనివార్యమని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. మంగళవారం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కేసీఆర్ ను కలువగా, వారి సమక్షంలో ధర్మసాగర్ మాజీ జెడ్పిటిసి కీర్తి వెంకటేశ్వర్లు కూడా పాల్గొని, బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ప్రజలు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు గుణపాఠం చెబుతారని తెలిపారు. స్టేషన్ ఘనపూర్‌లో కూడా ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని, కడియం శ్రీహరి ఓడిపోతారని, తాటికొండ రాజయ్య ఎమ్మెల్యేగా గెలుస్తారని ఆయన అన్నారు.

