కాని కట్టాలు రానీ, కరెంటు తీగలుంటే, గవాటి కింద మనం ఇల్లే కట్టం. గా ఆలోశెన కూడా శేయం. కనీ, గీ అన్న కరెంటు తీగల మద్దెలనే ఇల్లు కట్టిండు! గీ అన్న ధైర్యాన్ని సూసి అంతా ముక్కు మీద ఏలేసుకుంటాండ్లు.!!

పెద్ద లైను కరెంటు తీగలు పోతయి కద. గవి గా అన్న ఇంటి తలం మీద నుంచే పోతానయి. ఇగాయింత గా అన్న ఇల్లు కట్టుకోవాలనుకున్నడు. గా కరెంటోల్లు గా తీగల్ని ఊకూకనే తీత్తారు? అస్సలు తీయలే. గిదంత పని కాదని, గా తీగల మద్దెలనే ఇల్లు కట్టిండు. గా కరెంటు తీగలకు ప్లాస్టిక్ పైపులు తొడిగిండు. గా తీగెల్ని ఇల్లు మద్దెల కేలే పోతాంటే గోడలకు రంద్రం పొడిసిండు. గోడలు లేపిండు. ఇగ టాపు పోసుడే మిగిలింది. గది గూడ పోసి, గా ఇంట్లనే ఉంటడట గా అన్న. గా అన్న ధైర్యానికి సలాం పో.

