Wednesday, September 23, 2026
22.5 C
Hyderabad

రాజకీయ అవినీతిని అరికట్టలేమా!?|EDITORIAL

దేశంలో, రాష్ట్రాల్లో పేరుకుపోతున్న అవినీతిని అరికట్టడానికి ఏసీబీ, సీబీఐ, ఈడీ లాంటి సంస్థలు పని చేస్తున్నాయి. అలాగే రాజకీయ అవినీతిని అరికట్టడానికి లోక్ పాల్, లోకాయుక్త వంటి సంస్థలను ఏర్పాటు చేశారు. అదికార పార్టీలకు కీలు బొమ్మల్లా పై నిఘా సంస్థలు పని చేస్తున్నాయన్న విమర్శలున్నప్పటికీ ఎంతో కొంత మేర అవి పని చేస్తున్నాయి. కానీ రాజకీయ అవినీతిని నిర్మూలించడం సంగతి అటుంచి, నియంత్రించే పనిని కూడా లోక్ పాల్, లోకాయుక్త సంస్థలు చేయలేకపోతున్నాయన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తుంటాయి. చివరకు అవి కూడా రాజకీయాధికారం చెప్పుచేతుల్లోనే బందీ అవుతుండటం అత్యంత విచారం, విషాదం.

ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్ వంటి అవినీతి నిరోధక సంస్థలు విడుదల చేసే నివేదికల ప్రకారం, మన దేశంలో అవినీతి స్థాయిలు ఆందోళనకరంగా ఉన్నాయి, 2024లో ప్రపంచ అవినీతి అవగాహన సూచీ (సీపీఐ) ప్రకారం భారత్ 180 దేశాలలో 96వ స్థానంలో నిలిచింది. రాష్ట్రాల వారీగా తీసకుంటే దేశంలో వరసగా రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, యూపీ, తెలంగాణలున్నాయి. ఏపీ 13వ స్థానంలో ఉంది. దక్షిణ భారత దేశంలో అవినీతిని పరిశీలిస్తే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. తెలంగాణలో ఆస్తుల రిజిస్ట్రేషన్, భూ వివాదాలు, మున్సిపల్ కార్పొరేషన్లలో అధికంగా అవినీతి జరిగిందని తేలింది. 67శాతం మంది లంచాలిచ్చే పనులు చేసుకున్నామని, 27శాతం మంది పలుమార్లు లంచాలిచ్చామని సర్వేలో చెప్పారు. అంటే 94శాతం మందికి లంచాలతోనే పనులయ్యాయన్నమాట! ఇందులో అధికారుల అవినీతికంటే రాజకీయ అవినీతిదే అగ్రస్థానం అని వేరే చెప్పక్కరలేదు.

అవినీతి నిర్మూలనకు దేశంలో అనేక చట్టాలున్నాయి. అవినీతి నిరోధక చట్టం, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్టు, సమాచార హక్కు చట్లం, ప్రజా వేగుల చట్టం, లోక్ పాల్, లోకాయుక్త చట్టం వంటివెన్నో ఉన్నాయి. కానీ అవినీతి నిర్మూలన లేదా నియంత్రణ మాత్రం జరగకపోగా, పెరుగుతూ ఉన్నది. పాలకుల్లో ప్రధానంగా ఆర్థిక నియంత్రణ లేకుండా పోతోంది. దుబారా ఖార్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నేతలు తమ రక్షణకు విపరీతంగా ఖర్చు చేస్తున్నారు. జీత భత్యాలు కూడా విపరీతమే. మరోవైపు బంధుప్రీతి, అవినీతి, లెక్కకు మించిన ఆదాయాలు, ఎన్నికల్లో ఖర్చు చేయడం, తిరిగి సంపాదించుకునే పనిలో ఉండటం వంటివెన్నో కారణాలున్నాయి. ఒక్కసారి అధికారం అందితే చాలు తరతరాలు బతికేంతగా సంపాదించడమే పనిగా రాజకీయ నేతలు పని చేస్తున్నారు.

ఇక ఓట్ల కోసం అలవిగాని హామీలివ్వడం, వాటిని అమలు చేయడం ఖర్చులు తడిసిమోపెడు అవుతున్నాయి. వాటిని అమలు చేసే క్రమంలో మళ్ళీ అవినీతే చోటు చేసుకుటున్నది. అవినీతి చుట్టూ రాజకీయం, రాజకీయం చుట్టూతా అవినీతే పెనవేసుకుని కనిపిస్తున్నాయి. ప్రజాధనాన్ని దుబరా చేయడం, దుర్వినియోగం చేయడం మాములైపోయింది. అధికారంలో ఉండగా అడ్డూ అదుపు లేకుండా వ్యవహరించడం, నియంతృత్వంగా ప్రజాధనాన్ని మంచినీళ్ల కంటే అధ్వాన్నంగా ఖర్చు పెట్టడం చేస్తున్నారు. ఒక ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న అవినీతి అక్రమాలకు లెక్కలేకుండా పోతోంది. అధికారంలో ఉండగా చేసిన తప్పులన్నీ, అధికారం పోయాక వెలుగు చూస్తున్నాయి. కాకపోతే, వారికి తగిన శిక్షలే పడటం లేదు. రాజకీయ అవినీతి కేసులేవీ నిలవడం లేదు. దొందూ దొందే అన్నట్లు, తోడు తొంగల్లాగా అధికార, విపక్షాలు ఒకరినొకరు సహకరించుకుంటూ, కాపాడుకుంటూ అవినీతికి పాల్పడుతున్నారు.

రాజకీయ అవినీతిని పూర్తిగా అరికట్టడం కష్టమైనప్పటికీ, ఎంతో కొంత తగ్గించడానికి, నియంత్రించడానికి చేసిన చట్టాలే వారికి చుట్టాలైపోతున్నాయి. అయినప్పటికీ కొన్ని పద్ధతుల్లో అవినీతిని అరికట్ట వచ్చు. ప్రభుత్వ పాలనలో పారదర్శకతను పెంచాలి. సమాచార హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి, అధికారుల జవాబుదారీతనాన్ని పెంచాలి. అవినీతి నిరోధక చట్టాలను కఠినంగా రూపొందించి అమలు చేయాలి. అవినీతిపరులకు కఠినమైన శిక్షలు పడితే మిగతావారు అవినీతికి పాల్పడకుండా ఉంటారు. లోక్‌పాల్, లోకాయుక్త వంటివ స్వతంత్ర సంస్థలను సమర్థవంతంగా పనిచేయనివ్వాలి. అవినీతి నిర్మూలనలో ప్రజలు, పౌర సమాజ సంస్థలు భాగస్వామ్యాన్ని పెంచాలి. సాంకేతికతను వినియోగించుకోవాలి. ప్రభుత్వ సేవలను డిజిటలైజ్, ఆన్‌లైన్ చేయడం వల్ల కూడా అవినీతిని అరికట్టవచ్చు. ప్రజల్లో అవినీతికి వ్యతిరేకంగా నైతిక విలువలను పెంపొందించాలి.

అయితే, తాజా గణాంకాలింకా అందుబాటులోకి రానప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వాలను అభినందించడం కాదు కానీ, గత ప్రభుత్వాల హయాంలో అవినీతి అధికంగా జరిగినట్లుగా సర్వే సంస్థల గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో గత 12 ఏళ్ళుగా బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ అధికారంలో ఉంది. కాబట్టి గత, ప్రస్తుత అవినీతికి ఆ కూటమి తప్పకుండా బాధ్యత వహించాల్సిందే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను పరిశీలిస్తే, 2023 నవంబర్ వరకు తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ అధికారంలో ఉంది. గత రెండు ఎన్నికల్లో 2014లో చంద్రబాబు, 2019లో జగన్, తాజాగా మళ్ళీ చంద్రబాబు అధికారంలో ఉన్నారు. కొద్ది అటు ఇటుగా మారుతున్నప్పటికీ, దాదాపుగా రెండు కూటమిలు, రెండు మూడూ పార్టీలే అధికారంలోకి వస్తున్నాయి. ప్రభుత్వ, రాజకీయ అవినీతికి ఆ పార్టీలు, వాటిని నడుపుతున్న నాయకులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నది అందరూ అంగీకరించాల్సిన వాస్తవం. అంటే ఆ పార్టీలు లేదా ఆ పార్టీలను నడిపే నాయకులే అటు దేశాన్ని, ఇటు రాష్ట్రాలను అవినీతి మయం చేశారు. చేస్తున్నారు. అంతేగాక దేశాన్ని, రాష్ట్రాలను దోచుకున్నారనే నిజం మింగుపడటం కష్టమే. అయితే ఒకవైపు అవినీతి, మరోవైపు దోపిడీ, ఇంకోవైపు అప్పులు చేసి దివాళా తీయించడం లాంటి అన్నింటికీ వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. వీటన్నింటికీ కంటే కూడా అటు ప్రపంచం ముందు దేశాన్ని, దేశం ముందు రాష్ట్రాల పరువును అవినీతి మయంగా తీసేసిన మన పార్టీలు, మన నాయకులను బోనెక్కించాల్సిన బాధ్యతను ప్రజలే తీసుకోవాలి. అంతకంటే ముందు వారికి ప్రజాక్షేత్రంలోనేగాక, చట్ట పరిధిలో కూడా శిక్షలు పడేలా చేయాలి. అందుకు తగిన చట్టాలతోపాటు, అవినీతి నిర్మూలనకు నడుం కట్టే నవ యువ నాయకత్వం రావాల్సి ఉంది.

Latest News

గా ఊర్ల పేమ పెండ్లిల్లు నిషేధం!?|ADUGU TRENDS

ఇగీ మద్దెల ఏడ సూసినా, లవ్వు మ్యారేజీలు, లివింగ్ టుగెదర్లేనాయె! గియి ఊర్లు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటి దేశాలు, ఖండాంతరాలకు విస్తరించినయి. ఇగ కులం లేదు, మతం లేదు. ఇల0 లేదు....

యూపీ విభజన ప్రతిపాదనా? రాజకీయ వ్యూహమా?|EDITORIAL

దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై చర్చ జరగడం సహజమే. కానీ ఇలాంటి నిర్ణయాలు ప్రజల దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. యూపీ విభజనపై రాజ్‌భర్‌ చేసిన ప్రకటన అధికారిక విధానంగా మారుతుందా?...

సెప్టెంబర్ 23, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ద్వాదశి రాత్రి 08.43 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శ్రవణ ఉదయం 08.18 వరకు ఉపరి ధనిష్ఠ యోగం సుకర్మ సాయంత్రం 04.50 వరకు ఉపరి ధృతి కరణం బవ ఉదయం 08.03...

పుతిన్ తిరుగులేని నేతేనా!?|EDITORIAL

పుతిన్ రాజకీయ పట్టు బలపడినప్పటికీ, ప్రతిపక్ష స్వేచ్ఛ, ఎన్నికల పారదర్శకత, యుద్ధానికి ముగింపు వంటి అంశాలపై రష్యా ఎదుర్కొంటున్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ ఆధిపత్యాన్ని కేవలం సీట్ల సంఖ్యతో...

బంగారం కొనే ముందు గీ మూడు సూడాలే!|ADUGU TRENDS

మనం బంగారం, నగలు ఏడ కొంటం? ఔసలోల్ల దగ్గర, బంగారం దుకాణాల్ల కొంటం .పెద్దపెద్ద దుకాణాలకు కూడా పోయేటోల్లు ఉంటరు. కానీ, గీ మూడు ముఖ్యమైన ముచ్చట్లు పట్టించుకోం. కానీ మన సర్కార్...

సెప్టెంబర్ 22, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ఏకాదశి రాత్రి 07.23 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.14 వరకు ఉపరి శ్రవణ యోగం అతిగండ సాయంత్రం 04.49 వరకు ఉపరి సుకర్మ కరణం వణజి ఉదయం 06.34...

సెప్టెంబర్ 21, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు దశమి సాయంత్రం 05.43 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా ఉంది యోగం శోభ సాయంత్రం 04.30 వరకు ఉపరి అతిగండ కరణం గరజి సాయంత్రం 05.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News