తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని, తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇచ్చే సిఫారసు లేఖలను తిరుమలలో అనుమతించాలని తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాశాఖ మంత్రి కొండ సురేఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. శ్రీశైలం ఆలయానికి చేరుకున్న సురేఖ, అక్కడ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, తిరుమలలో తెలంగాణ భక్తులకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని, ఆ రాష్ట్ర ప్రజల ఆధ్యాత్మిక అవసరాలను తీర్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. భక్తుల విన్నపాలపై ఏపీ ప్రభుత్వం స్పందిస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు. తెలంగాణలో ధర్మ ప్రచారం కోసం టిటిడి తరఫున నిధులు ఇవ్వాలని ఆమె కోరారు. గత ప్రభుత్వ విధానాలను కూటమి ప్రభుత్వం కొనసాగించాలని సూచించారు.

