అమెరికాకు ఇరాన్ రెండు షరతులు
అమెరికా-ఇరాన్ చర్చలపై అనిశ్చితి కొనసాగుతున్న సమయంలో ఇరాన్ కొత్త ప్రతిపాదనలు ముందుకు తెచ్చింది. హర్మూజ్ జలసంధిని తెరిచి నౌకల రాకపోకలకు అనుమతిస్తామని తెలిపింది. అయితే అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని తొలగించాలి, అణు చర్చలను జలసంధి తెరిచిన తర్వాతే కొనసాగించాలని రెండు షరతులు విధించింది. ఈ ప్రతిపాదనలు మధ్యవర్తిగా ఉన్న పాకిస్థాన్ ద్వారా అమెరికాకు పంపినట్లు సమాచారం. దీనిపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ, ఇరాన్ సూచనలు గతంతో పోలిస్తే మెరుగైనవైనా, ఒప్పందానికి ఇంకా సరిపోవని వ్యాఖ్యానించారు.

