జనగామ జిల్లాలో పెంబర్తి గ్రామ సమీపంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వరంగల్ పర్యటన సందర్భంగా ఎస్కార్ట్ డ్యూటీ నిర్వహిస్తున్న పోలీసు వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో జనగామ ఎస్ఐ చెన్నకేశవులు, డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. వాహనానికి మెకానికల్ లోపం లేదా డ్రైవింగ్ సమస్య కారణమా అనే దానిపై పోలీసు అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. డ్రైవర్ మరియు ఎస్ఐ ప్రాణాపాయం లేకుండా ప్రమాదం నుంచి బయటపడటం ఊరట కలిగించింది. ఘటనపై మరిన్ని వివరాలు దర్యాప్తు తరువాత తెలనున్నాయి.

