సుతిమెత్తగా తోలు సీట్లు, సీటుసీటుకు బుల్లి తెరలు, శార్జింగ్ పాయింట్లు, ఉచితంగా వైఫై, కావాలంటే టిపిని, తాగాలంటే చాయ్, పోవాలంటే ఒకటి, రెండుకు టాయిలెట్లు… సల్లగా పయాణం.. ఇంకేం కావాలె శెప్పుండ్రి? అయితే గిది కచ్చితంగా గాలి మోటరే అనుకుంటాండ్లు కదా? కానే కాదుల్లా…గిది ఎయిర్ బస్సు కాదు.. ఎర్ర బస్సేనుల్లా? ఇచ్చెంత్ర పోతాండ్రా? కావాలంటే మీరే సూడుండ్రి.

అవుమల్లా.. గీ ఎర్ర బస్సెక్కితే గాల్లో తేలినట్లే ఉంటది. గాలి మోటర్ ఎక్కినట్లే ఉంటది. గాలి మోటర్ల ఉన్నట్లే అన్ని సదుపాయాలు కల్పించిండ్రు. వైఫై కూడా ఉచితంగనే ఇత్తాండ్రు. బస్సు ఆగుడు, దిగుడు, ఎక్కుడు లేకుండ బస్సుల్నే ఒటికి, రెండు ఏర్పాట్లు శేసిండ్రు. ఇగ మద్దె మద్దెల గాలిమోటర్ల లెక్కనే వోస్టెస్ వయ్యారంగా వత్తది. టిపిన్లు, టీ, కాఫీలు తెత్తది. ఇగ మీ పయాణం ఆగనే ఆగది.. సల్లసల్లగా ఏసీల సాగుతనే ఉంటది. గీ బస్సును కేరళం రాస్ట్రంల ఆ రాస్ట్ర ఆర్టీసీ తయారు శేపిచ్చింది. తిరువనంతపురంల మొదలై గీ బస్సు ఎర్నాకులంల ఆగుతది. 200 కి.మీ. దూరానికి 500 రూపాయెలు వసూలు శేత్తాండ్రు. ఇగ గీ ఎర్ర బస్సు ఎక్కినోల్లు… గాలి మోటర్ల పోయినట్లే పోతాండ్రట. జనం ఒకటే ఎగబడ్తాండ్రట.

